Trending News
Tuesday, January 13, 2026
25.2 C
Hyderabad
Trending News

పాన్ ఇండియా నేతగా రేవంత్ రెడ్డి:

హైదరాబాద్‌లో గాంధీభవన్ వేదికగా మీడియాతో చిట్‌చాట్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా నాయకుడిగా ఎదిగారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా స్టార్ పుష్ప (అల్లు అర్జున్) అరెస్టు తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయని తెలిపారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి ఆరోపణలతో పేరు పొందితే, రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతూ ప్రాచుర్యం పొందారని ప్రశంసించారు.

అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వివిధ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చామల కిరణ్ విమర్శించారు. కేటీఆర్ నిర్దోషిగా తేలాలని కోరుకుంటున్నప్పటికీ, ఆయన తప్పు చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయన్నారు. తన మాటలకు పదేపదే మార్పులు చేయడం ద్వారా ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుపై కూడా ఎంపీ చామల మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.7 వేల కోట్ల ఖర్చు అంచనా వేసినప్పటికీ, అదనంగా రూ.12 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని కోరామన్నారు. ల్యాండ్ సేకరణపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచనలు ఇచ్చారని వివరించారు.

రైతు భరోసా పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రైతు బంధు నిధులు అనర్హులకు పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకత్వం బాధ్యతగల ప్రతిపక్షంగా మారాలని సూచించారు. 2025 నాటికి బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Latest News

గుడ్డు.. ‘గుడ్డే’నా? తెలుసుకోండిట్లా!?|ADUGU TRENDS

ఇగో మనలో శాలా మందిమి గుడ్లను తింటం. కూరొండుకొనో, ఆమ్లెట్ పోసుకునో, ఎగ్ ప్రై రైస్ చేసుకునో, నూనెల గోలిచ్చుకునో, అంటు పులుసు పెట్టుకునో...తీరొక్క తీరుగ తింటుంటం. మరి గా గుడ్డు అప్పుడప్పుడు...

జల జగడాలు! రాజకీయ రగడాలు!!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. సమస్య పరిష్కారానికి బదులు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. జీవాధారమైన...

మంగళవారం జనవరి 13–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.దశమి పగలు 03.42 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం విశాఖ రాత్రి 12.49 వరకు ఉపరి అనురాధ యోగం శుల రాత్రి 08.18 వరకు ఉపరి గండ కరణం...

సోమవారం జనవరి 12–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.నవమి పగలు 01.45 వరకు ఉపరి దశమి నక్షత్రం స్వాతి రాత్రి 10.21 వరకు ఉపరి విశాఖ యోగం ధృతి రాత్రి 07.55 వరకు ఉపరి శుల కరణం...

ఆలుగడ్డతో మిలమిల మెరిసే అద్దాలు!?|ADUGU TRENDS

ఆలుగడ్డతోటి ఏ వంట వండిన ఆల్ రైట్గ ఉంటది. వాతం, పీతం అంటరు గని, కమ్మగుంటది. గా ఆలుగడ్డతోటి నొప్పులు నయమవుడే గాదుల్లా... అద్దాలను మెరిపించే అద్భుత గుణం గూడ ఉందట! మనం సూసుకునే...

యమపాశంగా ఆయిల్ గ్యాస్ బ్లోఅవుట్లు!|EDITORIAL

గోదావరి పరవళ్లు, పచ్చటి ప్రకృతి అందాలతో విరాజిల్లే కోనసీమ గత కొన్ని దశాబ్దాలుగా చమురు, సహజవాయు అన్వేషణలతో నిత్య భయాల మధ్య జీవిస్తోంది. ఓఎన్‌జీసీ అడుగుపెట్టిన నాటి నుంచి ఈ ప్రాంత ప్రజలు...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY RASHI PHALALU

జనవరి 11 --2026 నుండి జనవరి 17--2026 వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. కార్యస్థలంలో కొత్త ప్రాజెక్టులు ముందుకు సాగవచ్చు. పెద్దల మద్దతు మీకు లభిస్తుంది....

గా గుర్రం మూతులకు గురి తప్పని వైద్గం!?|ADUGU TRENDS

గా గుర్రం మూతులతోటి మస్తు ఇబ్బందైతది. కాలి మడిమల బొక్క పెరుగుడు. చెడు రత్తం గడ్డ కట్టుడుతోటి, ఇగ గా కాలుని కదపాల్నంటేనే కట్టమైతది. పొద్దుపొద్దుగాల అడుగుదీసి అడుగు పెట్టరాదు. ఇగ గాడ...

నిర్వాసితుల గోడు!|EDITORIAL

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే...

శనివారం జనవరి 10–2026|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం--హేమంత ఋతువు పుష్య మాసం -- కృష్ణ పక్షం తిధి బ.సప్తమి ఉదయం 11.00 వరకు ఉపరి అష్టమి నక్షత్రం హస్త సాయంత్రం 06.21 వరకు ఉపరి చిత్త యోగం అతిగండ రాత్రి 07.56 వరకు ఉపరి సుకర్మ కరణం...

పయానంల తల తిప్పుడు, కక్కుడు పరార్!?|ADUGU TRENDS

బస్సుల్ల, కారుల్ల, రైళ్ళల్ల పయానం కొందరికి అస్సలు పడది. గవి ఎక్కంగనే వాక్కు వాక్కుమని ఒకటే కక్కుతరు. తల తిక్కతిక్కగ తిరుగతది. నొత్తది. కడుపుల దేవినట్లైతది. పానం ఆగమాగమైతది. గసొంటోల్లకి పయాణమంటే పానం...

‘పెట్రో డాలర్’ ఆధి‘పైత్యం’!?|EDITORIAL

వెనెజువెలా ఉదంతం ఒక దేశపు సంక్షోభం మాత్రమే కాదు. అది మారుతున్న ప్రపంచ ఆర్థిక శక్తి సమీకరణాల ప్రతిబింబం. ఈ మార్పులను అణచివేయాలనే ప్రయత్నాలే రాబోయే కాలంలో ప్రపంచ రాజకీయాలను మరింత అస్థిరంగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News