TELANGANA|తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కొత్త కార్యవర్గాన్ని పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈ కార్యవర్గంలో మొత్తం 27 మంది VICE PRESIDENTS|ఉపాధ్యక్షులు, 69 మంది GENERAL SECRETERIES|ప్రధాన కార్యదర్శులకు చోటు కల్పించారు. ఎంపీ రఘువీర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీ, ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, బస్వరాజు సారయ్యలను ఉపాధ్యక్షులుగా నియమించారు. అలాగే, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పర్నిక రెడ్డి, రాగమయి తదితరులను నియమించారు. యువత, మహిళలు, అనుభవజ్ఞులు అన్నింటికీ ప్రాధాన్యం ఇస్తూ నాయకత్వానికి సమతూకంగా ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి< ప్రజల్లో విశ్వాసం పెంచే దిశగా ఈ కార్యవర్గం పని చేయనుంది. పూర్తి జాబితా కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.
TPCC COMMITTEE LIST

