Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

యుద్ధం – శాంతి!

యుద్ధంలో గెలుపు ఓటములకంటే, యుద్ధ పరిణామాలే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే అనివార్యమైతే తప్ప యుద్ధానికి దిగకూడదని అంటారు. యుద్ధాన్ని నివారించడమే తెలివైన పని. తప్పదనుకున్నప్పుడు యుద్ధాన్ని తెలివిగా చేయాలి. అంతకంటే తెలివిగా ముగించాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దేశం అంటే కేవలం భావనలు, భూభాగం మాత్రమే కాదు. మనుషులు, విలువైన వాళ్ళ ప్రాణాలు, సంపద, వర్తమానం, భవిష్యత్తు ఎన్నో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా యుద్ధానికి దిగితే, వాటి పరిణామాలను కూడా ఆయా దేశాలు అనుభవించాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అనుభవాలను ఏ దేశమైనా గుణపాఠంగా తీసుకోవాలి. బహుశా, ఇవేవీ దాయాది దేశం పట్టించుకున్నట్లు లేదు. పాక్ కు తమ దేశ ప్రజల భవిష్యత్తు, మనుగడ కంటే కూడా యుద్ధమే ముఖ్యమన్నట్లు ప్రవర్తిస్తున్నది. కచ్చితంగా దాని ఫలితాలను ఆ దేశం అనుభవించి తీరుతుంది.

పాక్ లోని ఉగ్ర మూకలపై దాడులు మాత్రమే జరిగాయి. అసలు యుద్ధమే జరగలేదు. కానీ భారత్‌తో యుద్దం గెలిచామని తమ సొంత ప్రజలను నమ్మించేందుకు పాక్‌ చేయని ప్రయత్నం లేదు. చివరకు విజయోత్సవాలను కూడా జరుపుకుంది. ట్రంప్‌ కూడా తను ఓ అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిని అన్నదే మరచి, వీడియో గేమ్స్ ఆడే పిల్లాడిలా తన టెంపరితనాన్ని చూపిస్తున్నాడు. తనవల్లే భారత్ పాక్ యుద్ధం ఆగిందని ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రచార పటాటోపం, కీర్తి కండూతి తప్ప మరేమీ లేదు. అంత మొనగాళ్ళైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎందుకు ఆపడం లేదు? ఇజ్రాయిల్ ను ఎందుకు కట్టడి చేయడంలేదు? లేని పెత్తనాన్ని నెత్తిన ఎత్తుకొని అమెరికా, లేని యుద్ధాన్ని కొని తెచ్చుకుంటూ పాకిస్తాన్ ఎందుకు కాళ్లబేరానికి వచ్చింది? ప్రపంచాన్ని బెదిరించి పబ్బం గడుపుకునే దుస్థితిలో ట్రంప్‌ ఉన్నాడు. అడుక్కుతినే దుస్థితిలో పాక్‌ ఉంది. పైగా యుద్ధాన్ని తానే ఆపానని ఓ వైపు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేసుకుంటుంటే, మరో వైపు పాకిస్తాన్‌ తామే యుద్ధంలో గెలిచామని ప్రచారం చేసుకోవడంలో ఔచిత్యం ఉందా?!

నిజానికి అమెరికా, పాకిస్తాన్‌లు చేసుకుంటున్న చిల్లర ప్రచారంపై అమెరికాతో సహ ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. భారత్‌ దెబ్బకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిన పాక్‌, ట్రంప్ పిచ్చి ప్రేలాపనలు మానుకోవడం మంచిది. ఇండియా పాకిస్తాన్‌ల మధ్య కాల్పులు మొదలైన మూడు రోజులకే తోక ముగిసిన సంగతి ప్రపంచానికి తెలిసిందే! భారత్‌ దెబ్బకు పాక్‌ కూసాలు కదిలిపోయాయి. మిస్సైల్స్‌, డ్రోన్ల దాడి కారణంగా భారీ ఆస్తినష్టం సంభవించింది. ఒకరకంగా పాక్‌పై కోలుకోలేని దెబ్బ పడింది. యుద్ధం ఇలాగే కొనసాగితే దేశం సర్వ నాశనం అవుతుందని పాక్‌ భావించింది. వెంటనే కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సాయంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో కాల్పుల కొనసాగింపు ఆగిపోయింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కొనసాగుతుందని గట్టిగా హెచ్చరించింది.

ఇప్పుడు అందరి చూపు పాకిస్తాన్‌ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న వైనంపై కేంద్రీకృతం అయింది. ఇవ్వాళ ఉగ్రవాదం కేవలం భారత్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచానికి విస్తరించింది. గతంలో జరిగిన దాడులు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అన్నీ టెర్రరిజం పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఉగ్రవాదులకు ఊతమిచ్చే చర్యలను పాక్ పక్కన పెట్టాలి. పాక్ కు మద్దతిస్తే భవిష్యత్తులో అమెరికాకు కూడా ఉగ్ర ముద్ర తప్పదని గుర్తించాలి.

1971 యుద్ధ సమయంలో పాక్‌కు దన్నుగా అమెరికా, బ్రిటన్‌, చైనా వంటి దేశాలు నిలిచాయి. మన దేశానికి సమైక్య రష్యా మాత్రమే అండగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అందుకే చైనా భయపడుతోంది. వ్యూహాత్మకంగా పాక్ ను చేరదీస్తోంది. దాయాది దేశానికి వివిధ రూపాల్లో సహాయం చేస్తోంది. ఇదే తరుణంలో అమెరికా చైనాతో విభేదిస్తోంది. పన్నుల యుద్ధాన్ని మనమంతా చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో చైనాతో తలపడాల్సి వస్తే భౌగోళికంగా పాక్‌ భూభాగం అమెరికాకు అవసరం. ఈ కారణంగా ఉగ్రవాదంపై తమది రాజీ లేని పోరు అంటూనే అమెరికా దొడ్డి దారిన పాకిస్తాన్‌కు సహాయం చేస్తోంది. పశ్చిమ దేశాలతో ఉన్న వైరం కారణంగా రష్యా కూడా చైనాకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈ కారణంగానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేయవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు భారత్‌ విజ్ఞప్తి చేసినా, వినకుండా వంద కోట్ల డాలర్ల సహాయం అందించడానికి అంగీకారం తెలిపింది.

ఇక యుద్ధాలను భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. ఏ దేశం ఒంటరిగా మనజాలదు. పరస్పర ఆధారం అనివార్యం. అన్నింటికంటే వాణిజ్య అవసరాలను ఏ దేశం విస్మరించలేదు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా పెరిగాయి. ఇప్పుడంతా అభివృద్ధి, అర్థిక వృద్ధిపైనే అన్ని దేశాలు దృష్టి సారిస్తున్నాయి. పాక్‌ ఇందుకు భిన్నంగా ఉగ్రవాదులను ఎగదోస్తోంది. ఇలా ఎంతకాలం చేసినా అది మనుగడ సాగించదని గుర్తిస్తే మంచింది. అలా అని పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పకుండా ఉండలేం. తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ యుద్ధం ప్రతిబంధకమే. అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేని సంకట స్థితి.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News