Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

వ్యవసాయం సంస్కరణలు – దీర్ఘకాలిక, తక్షణ చర్యలు!|EDITORIAL

మన దేశం వ్యవసాయక దేశం. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. జనాభాలో అరవై శాతానికి మించిన ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే, ఏనాడూ వ్యవసాయం అంత లాభసాటిగా లేదు. పాతకాలపు పద్ధతులు, నీటి కొరత, మార్కెటింగ్ లోపాలు, దళారుల హస్తలాఘవం, పెట్టుబడుల కొరత, మద్దతు ధర, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపం, విధానాలే లేకపోవడం వంటి అనేక సమస్యలు వ్యవసాయ రంగాన్ని పట్టి పీడిస్తున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చి 80 కావస్తునా, వ్యవసాయ రంగం వికాసానికి స్వల్ప, దీర్ఘ కాలిక పరిష్కారాలను ఇంకా వెతకాల్సి రావడం సిగ్గుచేటు. వ్యవసాయ రంగంలో తాత్కాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇవి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడతాయి. వర్షాభావం, వడగళ్ల వాన, తుపానుల కారణంగా పంట నష్టపోతే రైతులకు తక్షణంగా పరిహారం అందించాలి. పంటల బీమా పథకాలను వర్తింప చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు లేదా కరువు, ధరలు పడిపోవడం వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుండి రైతులను విముక్తి చేయడానికి రుణభారంలో నుంచి సబ్సిడీని అందించాలి. రైతులకు కనీస మద్దతు ధరను కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి. విత్తనాలు, ఎరువులు, మందులకు సబ్సిడీలను పెంచాలి. పంట కోత సమయంలో ధరలు పడిపోకుండా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్ లు ఉండాలి. రైతు బజార్లు, డైరెక్ట్ మార్కెటింగ్ యూనిట్లు పెంచాలి.
అలాగే, వ్యవసాయం రంగాన్ని అభివృద్ధి చేయడానికి దీర్ఘకాలిక దృక్కోణం కూడా అవసరం. వ్యవసాయంలో నీటి వాడకం అత్యధికంగా ఉంటుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రిప్ ఇరిగేషన్ వంటి నీటి పొదుపు పద్ధతులపై దృష్టి పెట్టాలి. సాగునీటి ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించాలి. భూముల రికార్డుల ఆధునీకరణ, భూముల డిజిటలైజేషన్ ద్వారా రైతుల భూములకు భద్రతను పెంచాలి. చిన్న రైతులు భూమి హక్కులను పొందడానికి సులువువైన పద్ధతులు ఉండేలా చూడాలి. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వాలి. అగ్రి-యూనివర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా తాజా పరిశోధనల్ని రైతులకు చేరవేయాలి. రోడ్లు, గోడౌన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయడం వల్ల రైతులకు నిల్వ, రవాణా సౌలభ్యం కలుగుతుంది. దీని ద్వారా ధరలు కూడా స్థిరంగా ఉండే అవకాశం ఉంది. చిన్న రైతులు కలిసి ఎఫ్ పీఓలను స్థాపించి తమ ఉత్పత్తిని కూడగట్టగలగాలి. దీనివల్ల వారికే ఎక్కువ లాభాలు లభిస్తాయి, మధ్యవర్తుల, దళారుల దోపిడీ తగ్గుతుంది. అధిక దిగుబడులు ఉన్న పంటల కోసం విదేశీ మార్కెట్లను సిద్ధం చేయాలి. ప్రభుత్వం సరైన విధానాలతో ఎగుమతులకు మద్దతివ్వాలి. ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఆధారంగా వాతావరణ సమాచారం, మార్కెట్ ధ‌రలు, సలహాలు రైతులకు చేరేలా చేయాలి. కృత్రిమ మేధ వంటి పరిజ్ఞానం వ్యవసాయంలో ప్రవేశించాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవసాయ విధానాలు రూపొందించాలి. వ్యవసాయ మార్కెట్ చట్టాల సరళీకరణ చేయాలి. ‘ఈ-నామ్’ వంటి డిజిటల్ మార్కెట్ ప్లాట్‌ఫాంను విస్తరించాలి. రైతులకు క్రెడిట్ రేటింగ్ సిస్టం రూపొందించి, మంచి రైతులకు తక్కువ వడ్డీకి రుణాలుపడాలి.
అయితే, వీటన్నింటినీ అమలు చేయడంలో కొన్ని సవాళ్ళు, ప్రతి బంధకాలు కూడా ఎదురవుతున్నాయి. రాజకీయాలకు లోనైన రుణ మాఫీలు, సబ్సిడీలు వ్యవస్థను కల్లోలపరుస్తున్నాయి. వ్యవసాయంలో లాభాలు లేకుండా పోవడంతో యువత వ్యవసాయరంగం వైపు రావడం లేదు. వాతావరణ మార్పులు, కలుషిత భూగర్భ జలాలు వంటి సమస్యలు విపరీత ప్రభావం చూపుతున్నాయి.
వ్యవసాయం రంగం అభివృద్ధి చెందాలంటే తక్షణ చర్యలు మాత్రమే సరిపోవు. ముందు చూపుతో దీర్ఘకాలిక సంస్కరణలు, శాశ్వత పరిష్కారాలు వెతకాలి. రైతులను ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలంటే విధానాలు సమర్థవంతంగా అమలవ్వాలి. స్వాతంత్ర్యం పొందిన నాటి నుండి ఇప్పటి వరకు వ్యవసాయ రంగం ఎన్నో విప్లవాత్మక మార్పులకు లోనైంది. ఇకపై సాంకేతికత, మౌలిక వసతులు, మార్కెట్ లింకేజ్ వంటి సంస్కరణలు అనే నాలుగు స్తంభాలపై అభివృద్ధి నిర్మించాల్సిన అవసరం ఉంది. ‘అభివృద్ధి చెందే దేశానికి శక్తివంతమైన వ్యవసాయ రంగం అవసరం’ అనే నినాదం నిజం కావాలంటే తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక దృక్కోణంతో వ్యవసాయ రంగంలో సమగ్ర మార్పులు తేవాల్సిన అవసరం ఉన్నది.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News