Trending News
Tuesday, November 18, 2025
28.2 C
Hyderabad
Trending News

బిల్లా? ఆర్డినెన్సా?|BILL|ORDINANCE

‘బీసీ రిజర్వేషన్ల’ ఉచ్చులో BJP|బీజేపీ!?
BILL|బిల్లును కాదంటే చిల్లే!
ఆర్డినెన్స్ ను కాదంటే అవుటే!
‘ముస్లీం’|MUSLIM సాకూ ముప్పే!
9వ SCHEDULE|షెడ్యూల్ లో చేర్చకపోతే చెల్లే!
బీజేపీకి ప్రమాదంగా ‘రాహు’ల్!
కమలాన్ని ‘క్రష్’ చేస్తున్న REVANTH REDDY|రేవంత్!
బీజేపీ BC|బీసీ LEADERS|నేతలు బయటకు రావాలని..
పిలుపునిచ్చిన PCC CHIEF|పీసీసీ చీఫ్ మహేశ్!|MAHESH KUMAR GOUD
TOMARROW|రేపు CABINET|కేబినెట్ భేటీలో మళ్ళీ నిర్ణయం?
PRESIDENT|రాష్ట్రపతి దగ్గర బిల్లు ముసాయిదా
GOVERNOR|గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ ముసాయిదా
రేపటితో ముగియనున్న HIGH COURT|హైకోర్టు గడువు
దేశ వ్యాప్త జన, కుల గణనకు పూనుకుని…
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే ఎలా?
TELANGANA|తెలంగాణ తరహాలో వ్యవహరించవచ్చా?
అప్పటిలా సీన్ రివర్స్ అయితే ఎలా?
బీజేపీ బీసీలకు వ్యతిరేకమన్న అపప్రద తప్పదా?
ఆ క్రెడిట్ కోసమే ఈ ఆలస్యమా?

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కాంగ్రెస్ ఉచ్చులో బీజేపీ పడిందా? ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఆ పార్టీ పరిస్థితి మారిందా? బీసీ రిజర్వేషన్లను అమోదించడమా? వ్యతిరేకించడమా? అన్న మీమాంసలో బీజేపీ ఉందా? తెలంగాణ కమలంలో అసలే అంతర్గతపోరు నడుస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాం రాం చెప్పారు. రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వచ్చి కొన్ని రోజులే అవుతోంది. బండికి ఈటలకు పడటం లేదు. కోల్డ్ వార్, ఓపెన్ వార్ గా డిక్లేర్ అయింది. ‘పాత, కొత్త అధ్యక్షులు కలిసి బండి, ఈటలతో మాట్లాడాలంటున్నారు ఎంపీ అరవింద్, అవసరమైతే అధిష్టానం జోక్యం చేసుకోవాల’ని కూడా ఆయన సూచన చేశారు. ఇవన్నీ ఇలా ఉండగా, బీసీల రిజర్వేషన్లు ఉచ్చు బీజేపీకి బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. జన గణనతోపాటు, కులగణనను కూడా చేపడుతున్న బీజేపీ బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతోందా? లేక ఆ క్రెడిట్ తమ బుట్టలో వేసుకోవడానికి తాపత్రయపడుతోందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో వ్యవహరించిన తీరును కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భమిది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే అయినా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషించింది. ఆతర్వాత ‘తల్లిని చంపి బిడ్డను బతికించార’న్న మోడీ వ్యాఖ్యలు ఆ పార్టీని తెలంగాణలో కోలుకోకుండా చేశాయి. బీసీ రిజర్వేషన్లు కూడా ఆలాగే ఇప్పుడు సీను రివర్స్ అయింది. బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షలో ఉంది. బిల్లు ముసాయిదా రాష్ట్రపతి దగ్గర, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెండింగులో ఉన్నాయి. ఆమోదించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అయితే, ముందుగా రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అవకాశమిచ్చి, కుల గణన తర్వాత దేశ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్లను పెంచి ఆ రెండు క్రెడిట్లను మొత్తాన్ని బీజేపీ తమ ఖాతాలో వేసుకోవచ్చు! ఒకవేళ బీసీ రిజర్వేషన్లను ఆలస్యం చేస్తే, ఓసీలకు 10శాతం రిజర్వేషన్లను కల్పించిన బీజేపీ కచ్చితంగా అగ్రకుల పార్టీగా మిగిలిపోతుంది. మరి బీజేపీ ఏం ఆలోచిస్తోంది? ఆలస్యం విషం కాకముందే నిర్ణయం తీసుకోవాలి. అంతకుముందే 3 రాష్ట్రాలనిచ్చిన బీజేపీ, అప్పటి రాజకీయావసరాలేవైనా తెలంగాణను వదిలేసింది. తర్వాత ఆ క్రెడిట్ ని కాంగ్రెస్ కొట్టేసింది. ఇవ్వాళ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే రేపు తప్పకపోవచ్చు. ఎందుకంటే రాహుల్ సహా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం బీసీలకు అనుకూలంగా ఉంది. మళ్ళీ సీన్ రివర్స్ కావచ్చు. ఆ క్రెడిట్ కాంగ్రెస్ కే దక్కొచ్చు? ఈ లోగా బీజేపీ ఏం చేస్తుంది?

హైదరాబాద్, జూలై 23 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
‘బీసీ బండారు దత్తాత్రేయని తప్పించి కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి, ఆ తర్వాత రామచంద్రరావుకి ఆ పదవి ఇచ్చి బీసీలకు అన్యాయం చేశార’ని సీఎం కమలాన్ని కార్నర్ చేస్తున్నారు. గవర్నర్ పదవీకాలం ముగిసిన బండారు దత్తాత్రేయకి ఉపరాష్ట్రపతి పదివి ఇవ్వాలని కాంగ్రెస్ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీని డిమాండ్ చేయడం విశేషమే. ఇక హిందూత్వ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ, ముస్లీంలకు రిజర్వేషన్లిస్తే బీసీల రిజర్వేషన్ల బిల్లును ఎలా ఆమోదిస్తామని ప్రశ్నించింది. ఈ వాదనను మొగ్గలోనే తుంచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ‘దమ్ముంటే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీం రిజర్వేషన్లను తీసేసి మాట్లాడాల’ని సవాల్ విసిరారు. అంతేకాదు ఆ సాకుతో బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నా, వాటిని సాధించితీరుతామని హెచ్చరించారు. పైగా ‘2029 ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లే లిట్మస్ టెస్టు’ అంటూ ఎజెండాగా రేవంత్ సెట్ చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పోతామని ప్రతిన బూనారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ మాటలు మరింతగా బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు తెలిపారు. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎందుకు వద్దంటున్నారని ఆయన నిలదీశారు. కేంద్రం ఆయన భుజంపై తుపాకీ పెట్టి, బీసీలపై ఎక్కు పెట్టిందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదించకపోతే, ఈ పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేస్తామంటున్న ఆయన, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నిర్వహించాలని తలపోస్తున్న ఓబీసీ రిజర్వేషన్ల సభల్లో రాహుల్ గాంధీ బీజేపీ పాలిట ‘రాహువు’గా మారే ప్రమాదం ఉంది. బీసీలకు వ్యతిరేకమైన బీజేపీ, బీఆర్ఎస్ ను బీసీ నేతలు వీడాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

ఈ తరుణంలో కేంద్రంలో బిల్లును ఆమోదిస్తే సరి, అందరికీ మోదమే. కానీ, అది బీజేపీ వైఖరికి విరుద్ధంగా ఉండటమేగాక, మిగతా రాష్ట్రాల్లో వచ్చే డిమాండ్లకు ఎలా? అనే సంశయంలో ఆ పార్టీ ఉంది. ఆమోదించకపోతే తెలంగాణలో ఆ పార్టీకి బీసీల నుంచి చుక్కెదురేనని భావిస్తున్నది. ఈ ప్రభావం అటు దేశం, ఇటు రాష్ట్రంపైనా పడుతుంది. ఇక ఆర్డినెన్స్ పై ఆ పార్టీ ప్రతినిధిగా పని చేస్తున్న గవర్నర్ సంతకం చేస్తే బీజేపీ కేంద్ర, రాష్ట్రాలపై భిన్న వైఖరులను తేటతెల్లం చేస్తుంది. రాష్ట్రంలో ఆమోదించాక కేంద్రంలో బిల్లు చేయడానికి అభ్యంతరాలేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి? ఒక వేళ ఆర్డినెన్స్ ను కూడా గవర్నర్ ఆమోదించకపోతే బీసీలకు బీజేపీ వ్యతిరేకమేనన్న ముద్ర పడుతుంది. పైగా కేబినెట్ ఆమోదించిన ముసాయిదా కావడం కూడా గవర్నర్ కు అంటే బీజేపీకి ఇరకాటమే. 25వ తేదీన కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కేబినెట్ బీసీల ముసాయిదాకు మరోసారి ఆమోదం తెలిపి, గవర్నర్ కు మళ్ళీ పంపితే, దాన్ని ఆమోదించడం తప్పనిసరి కావచ్చు? అయినప్పటికీ మొండికేస్తే అది వివాదం కావచ్చు. పైగా స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హై కోర్టు డెడ్ లైన్ కత్తి ప్రభుత్వం మెడపై వేళ్ళాడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలన్న ద్రుఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక ఈ నెలాఖరులోగానే రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన కండీషన్ కూడా కత్తిలా కనిపిస్తోంది.

ఈ దశలో బీసీలకు బీజేపీ దూరమవుతుందా? దగ్గరవుతుందా? అన్నది బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆమోదంపైనే ఆధారపడి ఉంది. ఇప్పటికే బీజేపీ ఒకటి రెండు కులాల పార్టీగా, మిగతా కులాలకు అంటరాని పార్టీగా అపవాదును మూటగట్టుకున్నది. అసలు బీజేపీ బీసీ రిజర్వేషన్లకు అనుకూలమా? వ్యతిరేకమా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. త్వరలోనే తేలనుంది.

Latest News

ప్రస్తుత పరిరక్షణే భవితకు భద్రత|ARTICLE|ESSAY

ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవగాహన సప్తాహం: 18-24 నవంబర్ 2025 సూక్ష్మజీవ నాశకాలకు బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు మరియు పరాన్నజీవులు స్పందించక పోతే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్) ఏర్పడుతది. ఔషధ...

గా పసువులకు గూడ మనసుంటదుల్లా!|ADUGU TRENDS

ఎద్దులేనిది యవుసంలేదు. రైతు లేనిది అన్నం లేదు. గందుకే ‘ఎద్ద యేడ్సిన యవుసం, రైతు ఏడ్సిన రాజ్యం’ బాగుపడదంటరు. ఎద్దు రైతుకు పదింతల బలం. గట్లనే దున్నపోతులు, బర్రెలు గూడ. పసులతోటి పనులే...

‘ఫీల్ గుడ్’ గుండు సున్నా కావద్దు!|EDITORIAL

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక విజయంతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంపై ఉన్న సందేహాలు కొంతమేరకు వీడిపోయినా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గెలుపును బలుపుగా తీసుకుని సమస్యలను విస్మరించరాదు. విజయం ధైర్యాన్నివ్వాలి....

మంగళవారం నవంబర్ 18 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం --కృష్ణ పక్షం మాస శివరాత్రి తిధి బ.త్రయోదశి ఉదయం 06.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం స్వాతి పూర్తిగా రోజంత యోగం ఆయుష్మాన్ ఉదయం 07.34 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి...

సోమవారం నవంబర్ 17 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం --కృష్ణ పక్షం నక్త వ్రతం తిధి బ.త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం చిత్త రాత్రి తెల్ల 05.17 వరకు ఉపరి స్వాతి యోగం ప్రీతి ఉదయం 07.21 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం...

VACCINATION|వ్యాక్సినేషన్ ADVOCATES|వకీల్లుగా PHARMACIST|ఫార్మసిస్ట్ లు|ARTICLE|ESSAY

64వ జాతీయ ఫార్మసీ సప్తాహం : 16-22 నవంబర్ 2025 వ్యాక్సిన్ లు అంటు వ్యాధులను తక్కువ ఖర్చుతో నివారించే సాధనాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు ఎచ్ ఓ) ప్రకారం ప్రస్తుతం 26...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY RASHI PHALALU

నవంబర్ 16 నుండి నవంబర్ 22 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. కష్టపడి పని చేస్తే ఉద్యోగంలో ప్రోత్సాహం లభించే సూచనలు ఉన్నాయి....

కొబ్బరి శిప్ప, కుడుకను యేరు శేసే ఇకమతు!?|ADUGU TRENDS

దేవుని కాడ, శుబ కార్యాల కాడ మనం కొబ్బరికాయలను కొడుతం. కోరిన కోర్కెలు తీరాలని మొక్కుతం. గనీ, గా కొబ్బశిప్ప నుంచి కుడుకను వేరు శేయాలంటే మస్తు తిప్పలు పడతం. కత్తులు కటార్లు...

పరనింద కాదు ఆత్మవిమర్శ కావాలి!|EDITORIAL

కులతత్వ, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలాన్ని బిహార్ ప్రజలు తిరస్కరించారా? ఇందిర, రాజీవ్ లతో పని చేసిన సీనియర్లు కూడా రాహుల్ విన్యాసాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మిత్ర పక్షాలు, పార్టీ కార్యకర్తలకు కూడా...

JUBILEE HILLS|జూబ్లీ హిల్స్ లో… ‘నవీన’ కాలం!|NAVEEN YADAV

-‘నవాం’శతో నెగ్గిన నవీన్ యాదవ్ -జూబ్లీ హిల్స్ లో పాగా వేసిన కాంగ్రెస్ -హైదరాబాద్ లో బోణీ కొట్టిన హస్తం -ప్రత్యామ్నాయంగా నిలిచిన బీఆర్ఎస్ -డిపాజిట్ కోల్పోయి డీలాపడిన బీజేపీ రాష్ట్రంలో 25శాతం జనాభా ఉన్న హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్...

ఓపెన్ స్లైడ్స్ బాల్కనీలొచ్చినయి!?|ADUGU TRENDS

గాలి, ఎలుతురు లేకపోతే ఇల్లేం బాగుంటది? అంతా శీకటి శీకటేనాయె. గందుకే గిప్పుడు ఇండ్లల్ల ఇశాలంగ బాల్కనీలు పెట్టుకుంటాండ్లు. గీ మద్దెల గవాటిని ఇంకా కొత్తగ శేపిత్తాండ్లు. బాల్కనీకి స్లైడింగ్ డోర్ల పేరుతో గిరికల...

బీహార్‌ ఫలితాలు- రాజకీయ పాఠాలు!|EDITORIAL

బిహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు, దాని భాగస్వామ్య హాగఠ్ బంధన్ కూటమికి అనూహ్యం కావచ్చు. కానీ, బీజేపీకి, నితీశ్ కి మాత్రం వ్యూహాత్మకమే. ఎన్నికలను ఎత్తుగడగా సాగించి, ఎన్డీఏ కూటమి విజయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News