TELANGANA|తెలంగాణ సచివాలయంలోని CABINET|కేబినెట్ హాల్ వద్ద మంత్రి కొండా సురేఖ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. మంత్రివర్గ సమావేశానికి హాజరైన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన DOCTORS|డాక్టర్లు, BP|బీపీ తగ్గిన కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మంత్రి సురేఖకు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం మంత్రి కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు.

