కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశానికి పార్టీ మారిన ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఈ సమావేశానికి అటెండ్ అయితే, సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో ప్రత్యక్షంగా చిక్కుకుపోతామనే ఆందోళనతోనే వారు డుమ్మా కొట్టినట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు వీరి అనర్హతపై చర్చ కొనసాగుతుండగా, తాజా పరిణామం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం ఎమ్మెల్యేల గైర్హాజరు వెనుక కారణాలను విశ్లేషిస్తోంది. త్వరలోనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

