పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ జాక్‌పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్-2025 లాటరీలో రూప్ నగర్ జిల్లాకు చెందిన ఆయన రూ.10 కోట్లు గెలుచుకున్నారు. ఇది ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీగా నిలిచింది. హర్పిందర్ సింగ్ కువైట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తూ సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చినప్పుడు రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేసి కోటీశ్వరుడయ్యాడు. గత 15 ఏళ్లుగా లాటరీలు కొనుగోలు చేస్తున్న ఆయనకు చివరికి అదృష్టం కలిసొచ్చింది.

