Tuesday, July 28, 2026
23.4 C
Hyderabad

మానవత్వమా నీ అడ్రసెక్కడ?|EDITORIAL

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ 

ఒక రోజు తేడాలో తెలంగాణలో చోటు చేసుకున్న రెండు సంఘటనలు మొత్తం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నివ్వెరనొములా చేస్తున్నాయి. నిర్ఘాంతపరుస్తున్నాయి. హైదరాబాద్ షాపూర్ నగర్ లోని పూర్ణిమ స్కూల్ లో నర్సరీ చదువుతున్న ఐదేళ్ళ బాలిక ధరిత్రిపై అదే స్కూల్ ఆయా లక్ష్మమ్మ దాడి చేసిన తీరు గగుర్పొడిచేలా ఉంది. కింద పడేసి, నేలకేసి బాది, కాలితో తొక్కి, గొంతు పిసికి, చెంపలపై కొట్టి, కొడుతూ, తిడుతూ చేసిన దాడి ఆమెలోని హింసా ప్రవృత్తికి పరాకాష్టగా నిలిచింది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, హన్మకొండ కాజీపేట కడిపికొండ బ్రిడ్జిపై నర్సింగ్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు చేసిన యాసిడ్ దాడి ఘటన మానవత్వంపై దాడిగా మిగిలిపోయింది.

ఈ రెండు ఘోర సంఘటనలు మనం ఏ దిశగా సాగుతున్నామని సమాజాన్నే కాక ప్రభుత్వ వ్యవస్థలనూ ప్రశ్నిస్తునాయి. నిలదీస్తున్నాయి. మట్టిలో కలుస్తున్న మానవత్వానికి భయానక సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఈ దారుణాలు కేవలం నేరాలు మాత్రమే కాదు. మన సమాజంలో క్షీణిస్తున్న విలువలు, పెరుగిపోతున్న హింసాత్మక ధోరణులు, చిన్న చిన్న విభేదాలకే భయంకరమైన దాడులకు పాల్పడే దౌర్భాగ్యాన్ని, బాధితులను రక్షించడంలో వ్యవస్థల లోపాలను ఎత్తి చూపుతున్నాయి.

యూనిసెఫ్-2024 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్లకు పైగా పిల్లలు, మహిళలు దాడులకు గురవుతున్నారు. 65 కోట్ల మంది అంటే ప్రతి 5గురిలో ఒకరు పరోక్షంగా ఆన్‌లైన్, మానసిక హింసలకు గురవుతున్నారు. భారతదేశంలో నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం ఒక్క 2023లోనే మహిళలపై 4,48,211 దాడుల కేసులు నమోదయ్యాయి. అంటే ప్రతి లక్ష మంది మహిళలలో సగటున 66.2 కేసులు నమోదైనట్టు. తెలంగాణలో 2023లో 23,679 కేసులు నమోదయ్యాయి, ప్రతి లక్ష మంది మహిళల్లో 124.9 కేసులు నమోదయ్యాయి. ఇది దేశ సగటు రేటు 66.2తో పోలిస్తే రెండింతలు. ఆంధ్రప్రదేశ్ లో 2023లో 22,418 కేసులు నమోదయ్యాయి. ఇక పిల్లలపై హింస విషయంలో దేశంలో 2023లో 1,77,335 కేసులు నమోదు అయ్యాయి.

ఇలాంటి దాడులు ఆ ఒక్కరికే నష్టం కలిగించవు. ఆ కుటుంబంతోపాటు మొత్తం సమాజం మీద ప్రభావాన్ని చూపుతాయి. భద్రత లేని, నిత్యం ప్రమాదంలోనే ఉన్నామన్న భావన ప్రజల్లో భయానక మానసిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. నేరాలు పెరగడం ఒకవైపు, నేరస్థుల్లో శిక్షల భయం లేకపోవడం మరోవైపు, సమాజాన్ని అశాంతి దిశగా నెట్టేస్తున్నాయి.

న్యాయ వ్యవస్థ, పోలీస్ విభాగం, ప్రభుత్వ యంత్రాంగం పై నమ్మకం సన్నగిల్లడమేగాక, అవి బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయాలు బలపడతాయి. నేరాలు జరిగాకే స్పందించడం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోగల సామర్థ్యం, చొరవ ఆ వ్యవస్థల్లో కనిపించాలి. తీవ్రమైన నేరాలకు దారితీసే సామాజిక కారణాలను గుర్తించి, వాటిపై అవగాహన, కౌన్సెలింగ్, కమ్యూనిటీ పోలిసింగ్ వంటి చర్యలు చేపట్టడం అత్యవసరం.

అన్నింటికంటే స్కూల్ నుండి కాలేజీల వరకు యువతలో విలువల విద్యను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. మహిళలపై దాడులు, చిన్నారులపై హింస వంటి దారుణాల మూలాల్లో పితృస్వామ్య ధోరణులు, కోప నియంత్రణలో వైఫల్యం, అసూయ, అసహనం వంటి మానసిక రుగ్మతలు ఉంటాయి. వీటిని విద్య ద్వారానే మార్చగలం. ఇంటి నుండి పాఠశాల, సమాజం వరకు పిల్లల్లో పరస్పర గౌరవం, బాధ్యత, సానుభూతి వంటి విలువలు పెంపొందితేనే సమాజంలో శాంతి నెలకొంటుంది. మరోవైపు, నేరాలకు పాల్పడినవాళ్ళకు గట్టి శిక్షలు పడి, అవి వెంటనే అమలయ్యేలా ప్రత్యేక కోర్టులు పనిచేయాలి. ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క.

ఈ నేపథ్యంలో మౌనం వీడాలి. ప్రతి ఒక్క పౌరుడి నుండి పౌర సమాజం మొత్తం సమస్యను కేవలం పోలీస్‌, ప్రభుత్వాలపై నెట్టడం సరికాదు. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు మహిళలను గౌరవించాలి, రక్షించాలి, సమాన హక్కులతో కలిసి నడిచే సమాజాన్ని నిర్మించాలి. భవిష్యత్తు తరాలకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని అందించాలి.

Latest News

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News