Saturday, October 17, 2026
24.7 C
Hyderabad

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా

నాగరికత
పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు.

సంస్కృతి
సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అది పట్టణాల్లో జీవించేవారికి మరియు గ్రామీణ, టండ్రా, అడవుల్లో గుంపులుగుంపుగా నివసించే వారందరూ ఏ రకమైన జీవన విధానాన్ని అవలంబించిన దానిని సంస్కృతిగానే పరిగణించవచ్చు.

సింధు నాగరికతను నాగరికత అని అనడానికి  కారణం

సింధు నాగరికత నాటి ప్రజలు ఉన్నతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా జీవించారు.అందుకే దీనిని నాగరికతగా పరిగణిస్తారు.

భారతదేశంలోని తొలి నాగరికత మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో సింధు నాగరికత ఒకటి. క్రీ.పూ.2500 నుండి క్రీ.పూ.1500 వరకు ఈ నాగరికత కొనసాగిందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదటిసారిగా 1826లో మ్యాసన్ అనే పురావస్తు శాస్త్రవేత్త సింధు నాగరికత అవశేషాలను సింధూ నది తీర ప్రాంతంలో కనుగొన్నాడు.

సింధు నాగరికతకు గల వివిధ పేర్లు

ఈ నాగరికత సింధూ నది లోయ ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల దీనిని సింధు నాగరికత అంటారు.

హరప్పా నాగరికత:
సింధు నాగరికత నాటి అవశేషాలు మొట్టమొదటగా హరప్పా ప్రాంతంలో బయల్పడ్డాయి కాబట్టి దీనిని హరప్పా నాగరికత అని కూడా అంటారు.

సంధియుగ నాగరికత:
సింధు ప్రజలు ఉపయోగించిన లిపిని నేటికీ ఎవరూ చదవలేకపోవడంతో దీనిని సంధియుగం అని కూడా అంటారు. నట్వర్ జా మరియు రాజారావు లాంటి పండితులు సింధు లిపిని చదవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

కాంస్య యుగ నాగరికత:
భారతదేశంలో సింధు  ప్రజలు కాంస్యమును మొదటిసారిగా ఉపయోగించారు. కాబట్టి దీనిని కాంస్య యుగ నాగరికత అని అంటారు.
కాంస్యం: రాగి తగరంల మిశ్రమం.

సమకాలీన నాగరికతలు

సింధు నాగరికత కాలంలో ప్రపంచంలో మరో మూడు నాగరికతలు కూడా ఉన్నాయి.

1) మెసపటోనియా నాగరికత:
ఇది ప్రస్తుత ఇరాక్ లో టైగ్రీస్ నది లోయల్లో కొనసాగింది. సింధు ప్రజలు ఈ నాగరికతతో సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను కొనసాగించారని ఖచ్చితమైన ఆధారాలున్నాయి.
ఇరాక్ పూర్వనామం మెసపటోనియా.

2) ఈజిప్ట్ నాగరికత:
ఈ నాగరికత ఆఫ్రికా ఖండంలోని నైలు నది లోయలో అభివృద్ధి చెందింది. సింధు ప్రజలు ఈజిప్ట్ ప్రజలతో సంబంధాలు కొనసాగించారని ఆధారాలు లేవు.

3) చైనా నాగరికత:
చైనాలోని హోయాంగ్ హో నది లోయలో ఈ నాగరికత అభివృద్ధి చెందింది.

సింధు నాగరికత ఆవిర్భావం

సింధు నాగరికత ఆవిర్భావం గురించి పండితులు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు కూడా తవ్వకాల్లో బయల్పడిన వాస్తు అవశేషాల ద్వారా ఊహాగానాల మీద సిద్ధాంతాలను రచించి మనకు తెలియజేస్తున్నారు.

పండితుల అభిప్రాయాలు

ఎ) ఘోష్ మరియు శంకాలియా ప్రకారం ఈ సంస్కృతి క్రీ.పూ.3000లో అభివృద్ధి చెందింది అని, నవీన శిలాయుగ మరియు తామ్ర శిలాయుగ సంస్కృతులు గణనీయంగా అభివృద్ధి చెంది సింధు నాగరికతకు బాటలు వేసాయి. వీరి ప్రకారం సింధు ప్రజలు సింధు మరియు సరస్వతి ప్రాంతాల్లో అభివృద్ధి చెందిందిగా చెప్పవచ్చు. నవీన శిలాయుగానికి చెందిన మెహర్ గర్ లో లభించిన టెర్రకోటా బొమ్మలు స్టీటైట్ తో చేసిన ముద్రికలు ఈ ప్రాంతంలోనే లభించాయి. దీనిని బట్టి సింధు నాగరికత పూర్తిగా స్వదేశీయమైనది అని అర్థమవుతుంది.

బి) వీలర్ ప్రకారం సింధు ప్రజలు విదేశీయులు. నాగరికత అనే భావన మెసపటోనియాలో పుట్టి సింధు ప్రాంతానికి వలస వచ్చి ప్రత్యేక నాగరికతను అభివృద్ధి చేసుకొని సింధు నాగరికతగా పరికల్పన చేశారు. నగర జీవితాన్ని గడపడం, స్నానవాటికలు, ధాన్యాగారాలు మరియు మాతృదేవతను పూజించడం ఈ రెండు నాగరికతల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కానీ ఆధునిక చరిత్రాకారులు ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు ఎందుకనగా సింధు నాగరికతలో కనిపించే శాస్త్రీయమైన పట్టణ నిర్మాణం, ఉన్నతమైన జీవనం మెసపటోనియా నాగరికతలో కనిపించడంలేదు.

సి) రఫిక్ మొఘల్ ప్రకారం సింధు నాగరికత బలూచిస్తాన్ నుండి సింధు లోయకు వలస వచ్చి తామర శిలాయుగాన్ని ఆధునీకరించుకొని నాగరికతగా చేసుకున్నారు. సింధు ప్రజలు లింగాలను, ఎద్దును పూజించడం, కోటలు నిర్మించుకోవడం బలూచిస్తాన్ కి చెందిన జోబ్, కుల్లి సంస్కృతుల్లో కూడా ఉందని ఈయన అభిప్రాయం. కానీ పండితులు దీనిని విశ్వసించడంలేదు.

✓సింధు నాగరికత ప్రజలు ఈ నాలుగు జాతులకు చెందినవారని ఒక బలమైన ఊహ:

1) మంగోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన గడ్డపు మనిషి బొమ్మలో మంగోలాయిడ్ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

2) మెడిటరేనియన్ జాతి: ఈ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ద్రావిడ భాష మాట్లాడడం వలన సింధు ప్రజలను ద్రావిడ ప్రజలు నీ కూడా అంటారు. (మెడిటరేనియన్ అనేది జాతిపదం. ద్రావిడ అనేది భాష.)

3) ఆల్ఫినాయిడ్ జాతి: పురావస్తు తవ్వకాల్లో ఈ జాతికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి.

4) ఆస్ట్రోలాయిడ్ జాతి: మోహేంజోదారోలో లభించిన కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహంలో ఈ జాతి లక్షణాలు కనిపిస్తున్నాయి.

“నాట్యకారిణి” సింధు లోయ నాగరికత యొక్క కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, దక్షిణ ఆసియా చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది.

ఈ వివాదం 9వ తరగతి కోసం కొత్తగా ప్రవేశపెట్టిన ‘మధురిమ’ అనే కళా విద్యా పాఠ్యపుస్తకానికి సంబంధించినది. మొహెంజో-దారోలో కనుగొనబడిన ‘నాట్యకారిణి’ శిల్పం, ప్రాచీన సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. 4,000 సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఈ కంచు విగ్రహం, తొలి కళాత్మక విజయానికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా పరిగణించబడుతుంది.

అయితే, కొత్త పాఠ్యపుస్తకంలో ఉపయోగించిన చిత్రం అసలు శిల్పానికి భిన్నంగా ఉంది. అసలు బొమ్మకు మొండెం నగ్నంగా ఉండగా, ప్రచురించిన చిత్రంలో మొండెం భుజాల నుండి కిందికి నీడతో చూపబడింది.కళల చరిత్ర” అనే శీర్షిక గల ప్రారంభ అధ్యాయంలో సవరించిన చిత్రం కనిపించింది. అసలు శిల్పం దాని అసలైన రూపంలో విస్తృతంగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, పురావస్తు శాస్త్రం మరియు కళా ప్రచురణలలో తరచుగా ప్రస్తావించబడుతున్నందున, ఈ మార్పు దృష్టిని ఆకర్షించింది.

అంతకుముందు, NCERT డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీ NDTVతో మాట్లాడుతూ, “మొండెం భాగాన్ని కప్పి ఉంచడం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదు. పాఠ్యపుస్తకాల రూపకల్పనకు బాధ్యత వహించే కళలు మరియు విద్య విభాగానికి ఈ విషయాన్ని నివేదించడం జరిగింది” అని చెప్పారు.

సింధు నాగరికత ప్రధాన పట్టణాలు

పురావస్తు శాస్త్రవేత్తలు సుమారు 200 పైగా ప్రధాన పట్టణాలను సింధు నాగరికతలో భాగంగా కనుగొన్నారు. సింధు నాగరికత పట్టణ నాగరికత. వాటిలో ముఖ్య నగరాలు హరప్పా (పాకిస్తాన్), మోహెంజోదారో (పాకిస్తాన్), ఛాన్సుధారో(పాకిస్తాన్), లోథాల్ (గుజరాత్), కాళీబంగన్(రాజస్థాన్), బన్వాలి(హర్యానా) మొదలగునవి.

– బానోత్ కళ్యాణ్ 

Latest News

ఈ దంపతులు సింపతీ కోల్పోతున్నారా!?|KONDA SUREKHA|KONDA MURALI|FAMILY

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్ ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్ పైగా విడిగా పార్టీ...

బతుకమ్మ వాయినం!?|ADUGU TRENDS

‘ఇత్తినమ్మ వాయినం అంటే, తీస్కుంటినమ్మ వాయినం.’ అని అంటరు. గిదేందంటే, పండుగలు, పబ్బాలకు, శుభ కార్యాలకు, రతాలకు ముత్తైదువులకు అందించే తాంబూలం, పిండివంటలు, పండ్లు-పూలు, పసుపు-కుంకుమలను కలిపి ఇచ్చే కానుకలను వాయినం అంటరు....

పటిష్ట వ్యవస్థ తప్పనిసరి!|EDITORIAL

ఓటరు జాబితాలో ఒక్క పేరు మాయమైనా.. ప్రజాస్వామ్యానికి గట్టి దెబ్బే! దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పెరుగుతున్న ఆందోళనలు, ఓటర్ల పేర్ల తొలగింపుపై ఆరోపణలు ఎన్నికల వ్యవస్థ పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి. జాబితాల ప్రక్షాళన అవసరమే.....

అక్టోబర్ 17, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ చండికాదేవి అలంకరణ తిధి సప్తమి రాత్రి తెల్ల 05.10 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 08.16 వరకు ఉపరి పుర్వాషాఢ యోగం అతిగండ రాత్రి 10.31 వరకు ఉపరి సుకర్మ కరణం...

ఆడ ఏడో రోజే|SADDULA BATHUKAMMA

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. అయితే జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పెద్దమడూరు గ్రామంలో మాత్రం ఈ పండుగను ఏడో...

పొద్దుగాల పెండ్లి.. సీకటి పడంగనే పెటాకులు!?|ADUGU TRENDS

పెండ్లంటే నూరేండ్ల పంట అన్నరు. ఒకపాలి పెండ్లైందంటే వందేండ్లైనా గా అనుబంధం యిడి పోదని దానర్థం. కానీ, గీ మద్దెల పెండ్లిల్లు.. పెటాకులైపోవడానికి పెద్దగ టైమేం పడ్తలేదు. గిప్పుడు పెండ్లి సేసుకుంటాండ్లో లేదో.....

రియాద్ సంక్షోభం!|EDITORIAL

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి! హౌతీల భీకర క్షిపణి దాడులతో సౌదీ రాజభవనాలు వణుకుతుండగా, క్రౌన్ ప్రిన్స్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన వేళ.. ఇజ్రాయెల్ స్నేహహస్తాన్ని తిరస్కరించిన రియాద్ నిర్ణయం గల్ఫ్ రాజకీయాల్లో...

అక్టోబర్ 16, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ సరస్వతిదేవి అలంకరణ తిధి షష్ఠి రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం శోభ రాత్రి 09.56 వరకు ఉపరి అతిగండ కరణం కౌలవ పగలు...

గియేం పోస్టాపీసుల్రా నాయినా!?|ADUGU TRENDS

మనం సూసిన పోస్టాపీసులకు గీ పోస్టాపీసులకు పోలికలే లేవు. ఒకటేమో నీల్ల మీద. ఇంకోటేమో నీల్ల లోపల, మరోటేమో ఎత్తనై భూమ్మీద, ఇంకా గుహల్ల, రైలు పట్టాల మద్దెల... గిట్ల గీ పోస్టాపీసులన్నయి....

ప్రపంచానికి పెను ముప్పు!?|EDITORIAL

క్షిపణుల మోతతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది! విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు.. చమురు కేంద్రాలపై ప్రతీకార దాడులు.. కీలక సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు! అగ్రరాజ్యాల జోక్యంతో యుద్ధం మరింత విస్తరిస్తుందా? చమురు ధరల నుంచి...

అక్టోబర్ 15, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజ మాసం శుక్లపక్షం శ్రీ లలిత త్రిపుర సుందరిదేవి అలంకరణ తిధి పంచమి రాత్రి 01.00 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 05.41 వరకు ఉప6 మూల యోగం సౌభాగ్య రాత్రి 09.28...

బంగారం సొరంగంలకి!?|ADUGU TRENDS

ఆశకు అంతుండాలంటరు. అత్యాశకు పోతే ఒక్కోపాలి పానమే పోతది. గట్లనే అయింది గీ ఇద్దరి దోస్తుల పని. యూ ట్యూబ్ సూసి, బంగారం కోసం ఓ సొరంగంలకి పోయి పానం మీదికి తెచ్చుకున్నర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News