Saturday, September 19, 2026
27.3 C
Hyderabad

పాశమైలార ఘటనకు ఎవరు బాధ్యులు!?|EDITORIAL

కంపెనీ సైరన్‌ మోగింది. యథావిధిగా కార్మికులంతా ఉత్సాహంగా తాము రోజూ చేసే పనుల్లో మునిగిపోయారు. వేగంగా పనులు ముగించుకొని, త్వరగా ఇళ్లకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోజులాగానే వీడ్కోలు పలికినా, సాయంత్రానికి మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నారు. కానీ, ఇదే వారికి ఆఖరి రోజని వారు ఊహించలేకపోయారు. అదే కడసారి చూపవుతుందని వారు అనుకోలేదు. అనుకోని ప్రమాదం తమ వారిని కబళిస్తుందని వారికేం తెలుసు? ఇప్పుడు తల్లికి పిల్ల, పిల్లలకు తల్లులు, తండ్రులు కాకుండా పోయారు. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని స్థితిలో వారున్నారు. జరిగిన ఘటనను ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదానికి ఇప్పటి లెక్క ప్రకారం 45 కుటుంబాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? తగు రక్షణ, భద్రత జాగ్రత్తలు తీసుకోకుండా యథాలాపంగా నడిపిన కంపెనీదా? కంపెనీ నిర్లక్ష్యాన్ని చూసీ చూడనట్లుగా వదిలేసిన అధికారులదా? ఇప్పుడు ఇస్తున్న ఎక్స్ గ్రేషియా, కంటి తుడుపు సహాయాలు పోయిన వారిని తిరిగి ఇవ్వగలవా? అన్యాయమైన ఆ కుటుంబాలను ఆదుకోగలవా?

ఏ ప్రమాదం జరిగినా కంటితుడుపు చర్యలు తప్ప కఠిన చర్యలకు ఉపక్రమించడం లేదు. పాశమైలారం ఒక్కటే కాదు, ఇండస్టియ్రల్‌ పార్కుల్లోనే భద్రత డొల్ల అని తేలిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు లేకుండానే ఇలాంటి వందల కంపెనీలు నడుస్తున్నాయి. పేరుకే కార్మికశాఖ ఉంది. కార్మికుల గురించి వారు పెద్దగా స్పందించరు. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఉన్న అంజయ్య భవన్‌కు వెళితే ఎన్నో దీనగాథలు కనిపిస్తాయి. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరుగుతోంది. పేలుడు ధాటికి కార్మికులు దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారంటే ప్రమాద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగ భవనం కూలిపోగా, మరో భవనానికి బీటలు వారాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది. ఇక ఇక్కడ కార్మికులే కాదు, అందులో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ప్లాంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ కూడా దుర్మరణం పాలయ్యారు. గోవన్‌ ప్లాంట్‌లోకి అడుగుపెట్టిన సమయంలోనే పేలుడు సంభవించింది. ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ ప్రేమజంట పెళ్లి చేసుకున్న మధుర జ్ఞాపకం మరువకుండానే అనంతలోకాలు పోయారు.

మొన్నటికి మొన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన విషాదం మరువక ముందే ఈ ఘటన జరగడం విచారకరం. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఓ కమిటీ వేస్తామని కార్మిక మంత్రి వివేక్‌ తెలిపారు. అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందన్నారు. ఫిర్యాదు చేయడం కాదు…అలా జరుగుతుందా లేదా అన్న విషయం ఆరా తీయాల్సింది కార్మికశాఖనే. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ అనే పౌడర్‌ తయారు చేస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు రసాయన పరిశ్రమల భద్రతపై అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడే యాజమాన్యాలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. ఆతర్వాత కొద్ది రోజులకు అంతా మరచిపోతాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. రసాయనాల మధ్య చర్యల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీకి సంబంధించిన ఇంజనీర్లతో యంత్రాలను తనిఖీ చేయించాలి. జిల్లా అధికారులు పరిశ్రమలను నిర్ణీత తేదీల్లో తనిఖీ చేస్తుండాలి. కాలుష్య నియంత్రణ మండలి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారి, అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీలకు వెళ్తుంటారు. వీరు తనిఖీలు చేసి ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితికి అనుమతులు ఇస్తుంటారు. క్షుణ్నంగా పరిశీలన చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం పరిశ్రమల నిర్వహణ ఉండాలి. ఇవి కాగితాల్లోనే కనిపిస్తాయి. ప్రతి పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్‌ వాహనాలు, సిబ్బంది ఉండాలి. అంతేకాదు అగ్నిమాపక సిబ్బందిని వారే నియమించుకోవాలి. ఈ కార్మికులు మూడు షిప్టుల్లో పనిచేయాలి. నైపుణ్యం కలిగిన కార్మికులను తీసుకోవట్లేదు. తక్కువ వేతనాలు ఇస్తూ ఇతర రాష్టాల్రకు చెందిన కూలీలనే పనిలోకి తీసుకుంటున్నారు. చిన్నచిన్న ప్రమాదాల బారినపడి కార్మికులు మృతిచెందిన విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఇక నుంచి బంద్‌ కావాలి. క్షేత్ర స్థాయిలో ఒక్కో పరిశ్రమను అడుగడుగునా తనిఖీ చేయాలి. నిపుణుల బృందం పరిశీలించాలి. అప్పుడే ప్రమాదాలను కొంతయినా నివారించగలుగుతామని గుర్తించాలి.

Latest News

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News