ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్.సి.ఏ భూముల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ కమిటీతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొనున్నారు. అనంతరం గాంధీ భవన్ లో ఎన్.ఎస్.యు.ఐ నాయకులతో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పార్టీ ఆర్గనైజేషన్ మరియు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం.

