Saturday, June 27, 2026
24.8 C
Hyderabad

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద యువజన శక్తి కలిగిన దేశం. 145 కోట్ల జనాభాలో 65 శాతానికి పైగా ప్రజలు 35 ఏళ్ల లోపు వారే. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే సామర్థ్యం, రాజకీయాలను మార్చే శక్తి, వ్యవస్థను ప్రశ్నించే ధైర్యం ఉండాల్సిన వాళ్ళు. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి కీలక చారిత్రక దశలో యువతే మార్పునకు చోదకశక్తిగా నిలిచింది. అయితే, డిజిటల్ యుగంలో యువత రాజకీయ చైతన్యం కొత్త రూపం దాల్చింది. వీధి పోరాటాలు, విద్యార్థి ఉద్యమాల స్థానంలో ఇప్పుడు సోషల్ మీడియా క్యాంపెయిన్లు, మీమ్స్, ట్రోల్స్, వ్యంగ్య రాజకీయాలే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన “కాక్రోచ్ జనతా పార్టీ” దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ఇది అధికారిక రాజకీయ పార్టీ కాకపోయినా, యువతలో పెరుగుతున్న రాజకీయ అసంతృప్తిని ప్రతిబింబించే డిజిటల్ ఉద్యమంగా ప్రచారం పొందుతోంది. రాజకీయ అవకాశవాదం, కుటుంబ పాలన, ఫిరాయింపు సంస్కృతి, అవినీతిపై వ్యంగ్యాస్త్రంగా ఇది ముందుకొచ్చింది. కానీ దీని ప్రచార విధానం, ఎంచుకున్న అంశాలు, లక్ష్యాలను పరిశీలిస్తే ఇది పూర్తిగా తటస్థ వేదిక కాదన్న అభిప్రాయం బలపడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, ఆప్ రాజకీయ వాదనలను ముందుకు తీసుకెళ్లే విధంగానే దీని ప్రచారం సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత ఒక సందర్భంలో ఫేక్ సర్టిఫికెట్లు, తప్పుడు పిటిషన్లతో న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కొందరిని ఉద్దేశించి “బొద్దింకలు”, “పరాన్నజీవులు” అనే పదాలను ఉపయోగించారు. అయితే ఆ వ్యాఖ్యల అసలు సందర్భాన్ని పక్కనబెట్టి, యువతను అవమానించారన్న రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. దానినే ఆధారంగా తీసుకుని “కాక్రోచ్ జనతా పార్టీ” పేరుతో వ్యంగ్య రాజకీయ వేదికను నిర్మించడం జరిగింది. అసలు వ్యాఖ్యల ఉద్దేశం, సందర్భం తెలుసుకోకుండా వైరల్ ప్రచారం చేయడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దౌర్బల్యం.

యువత నిజంగా ప్రశ్నించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనాల ప్రకారం యువ నిరుద్యోగం అనేక రాష్ట్రాల్లో 20 శాతానికి మించి నమోదవుతోంది. ప్రతి ఏడాది లక్షలాది మంది డిగ్రీలు పూర్తిచేసినా, వారికి తగిన ఉపాధి అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలు ఆలస్యం అవుతుండగా, ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. నీట్, యూజీసీ నెట్ వంటి పరీక్షల లీకేజీలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి దారితీశాయి.

అలాగే విద్యా, వైద్య రంగాల ప్రైవేటీకరణ కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు బలహీనపడుతుండగా, మరోవైపు కార్పొరేట్ వ్యవస్థలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. గ్రామీణ యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు అందుబాటులో లేకపోవడం సామాజిక అసమానతలను పెంచుతోంది. ఇలాంటి అనేకానేక వ్యవ్థలపై సమీక్ష, చర్చ, పరిష్కారాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో సోషల్ మీడియా వ్యంగ్య రాజకీయాలే ప్రధాన చర్చగా మారడం విస్మరించలేనిది. పైగా ఆలోచించాల్సిన విషయం.

భారత రాజకీయాల్లో కుటుంబ పాలన కూడా యువత ప్రశ్నించాల్సిన ముఖ్య అంశమే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌లో నెహ్రూ–గాంధీ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతుండగా, బీజేపీ సహా ఇతర పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు పెరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు కుటుంబం, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం, ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్య అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పదవులు కొన్ని కుటుంబాలకే పరిమితం కావడం ఆరోగ్యకర రాజకీయ సంస్కృతి కాదు.

తెలంగాణ ఉద్యమం, అస్సాం విద్యార్థి ఉద్యమం, స్వాతంత్ర్య పోరాటాలు యువ శక్తి ఎంత ప్రభావవంతమో నిరూపించాయి. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేశారు. కానీ ఉద్యమ ఫలితాలను కొన్ని కుటుంబాలు, కొందరు రాజకీయ నాయకులే అనుభవిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో కనిపించింది.

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, సమస్యలపై బంద్ లు, ధర్నాలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ ప్రభావాన్ని నిర్ణయిస్తున్నాయి. “కాక్రోచ్ జనతా పార్టీ” కూడా ఈ డిజిటల్ రాజకీయ సంస్కృతిలో భాగమే. అయితే అది నిజంగా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే వేదికగా నిలవాలంటే అన్ని పార్టీల అవకాశవాదాన్ని సమానంగా ప్రశ్నించాలి. ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా, మరొక వర్గానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అది ప్రజా ఉద్యమం కాకుండా రాజకీయ ప్రయోగంగా మిగిలిపోతుంది.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అత్యంత అవసరం. ప్రశ్నించని సమాజం క్రమంగా బలహీనపడుతుంది. యువత నిజంగా దేశ భవిష్యత్తు కోసం నిలబడాలంటే నిరుద్యోగం, అవినీతి, విద్యా సంక్షోభం, కుటుంబ పాలన, నేర రాజకీయాలు, ఫిరాయింపులు వంటి సామాజిక సమస్యలపై పాలకులను నిలదీయాలి. రాజకీయ పార్టీలకు డిజిటల్ సైన్యాలుగా కాకుండా ప్రజల తరఫున మాట్లాడే శక్తిగా ఎదిగినప్పుడే భారత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

Latest News

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News