Sunday, September 20, 2026
27 C
Hyderabad

మేడారంలో ఘనంగా ‘మండమెలిగే పండుగ’|MEDARAM|JATHARA|SAMAKKA SARALAMMA

ఆదివాసీ సంప్రదాయాల మధ్య జాతర శుభారంభం

మేడారం ప్రత్యేక ప్రతినిధి, జనవరి 21 (అడుగు న్యూస్):
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తొలి ఘట్టం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జాతర ఆరంభానికి అధికారిక సంకేతంగా భావించే ‘మండమెలిగే పండుగ’ను మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు స్వామి కొలువై ఉన్న ఆలయంలో ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పండుగతోనే మహాజాతరకు తొలి అడుగు పడిందని గిరిజనులు విశ్వసిస్తారు.

‘వరుడు సిద్ధం’ అనే సంకేతం

మేడారం జాతర ప్రారంభానికి ముందు పగిడిద్దరాజు గద్దెపై ప్రతిష్ఠ తప్పనిసరి అనే కోయ సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయానికి అనుగుణంగా మండమెలిగే పండుగను నిర్వహించడం ద్వారా “వరుడు సిద్ధం… తల్లుల జాతరకు సమయం ఆసన్నమైంది” అనే భావనను చాటుతారు. ఈ పూజలతో మేడారం మహాజాతర విజయవంతంగా సాగుతుందన్న నమ్మకం భక్తుల్లో గాఢంగా ఉంది.

మండమెలిగే పేరు వెనుక చరిత్ర

పూర్వకాలంలో అగ్నిప్రమాదాల వల్ల దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతర వారం ముందు కొత్త కొమ్మలతో (మండలు) శుద్ధి చేసి పునర్నిర్మించే ఆచారం ఉండేదని పూజారులు వివరిస్తున్నారు. ఆ పవిత్ర సంప్రదాయానికే ‘మండమెలిగే’ అనే పేరు వచ్చిందని తెలిపారు. ఈ పండుగ సజావుగా జరిగితే మహాజాతర ఎలాంటి అవాంతరాలు లేకుండా ఘనంగా జరుగుతుందని ఆదివాసీలు విశ్వసిస్తున్నారు.

రహస్యంగా ప్రత్యేక పూజలు

మండమెలిగే పండుగను ప్రధాన పూజారి పెనుక బుచ్చి రాములు, ఇతర ప్రధాన పూజారులు, పెనుక వంశస్థుల ఆధ్వర్యంలో శతాబ్దాల నాటి కోయ తెగ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేసి అత్యంత రహస్యంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సమయంలో సామాన్య ప్రజలకు ఆలయ ప్రవేశాన్ని నిషేధించారు. డోలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ మామిడి తోరణాలతో గ్రామమంతా పండుగ శోభను సంతరించుకుంది.

దొరస్తంభాలతో అష్టదిగ్బంధనం

మహాజాతర పూజలకు దుష్టశక్తులు అడ్డురాకుండా ఉండేందుకు అడవిలో నుంచి తెచ్చిన బూరుక కర్రలకు మామిడి ఆకులు కట్టి పూనుగొండ్ల గ్రామ పొలిమేరల్లో దొరస్తంభాలు ఏర్పాటు చేశారు. గ్రామాన్ని అష్టదిక్కుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయం కొనసాగుతుందని పూజారులు తెలిపారు.

కఠిన నిష్ఠతో పూజలు

ఇక నేటి నుంచి మహాజాతర ముగిసే వరకు కోయ పూజారులు కఠిన నియమాలు పాటిస్తూ ప్రత్యేక నిష్ఠతో పూజలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధమైన జీవనం, నియమిత ఆహారం, శుద్ధి ఆచారాలతో వనదేవతల అనుగ్రహం పొందుతారన్న విశ్వాసం ఆదివాసీ సమాజంలో బలంగా ఉంది.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News