జిల్లా కన్వీనర్ గా మొలుగూరి యాకయ్య గౌడ్
పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలోతెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జనగామ జిల్లా కన్వీనర్ గా మొలుగూరి యాకయ్య గౌడ్ ను ఉద్యమకారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ మొలుగురి యాకన్న గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సకారం కావడంలో ఉద్యమకారులు కీలకమని, గతంలో చెప్పిన విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యమకారులను గుర్తించి వారికి 250 గజాల ఇంటి స్థలంతో పాటు నిర్మాణ ఖర్చు భరించాలని ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రతి ఉద్యమకారులకి 25 వేల పెన్షన్ ప్రకటించి ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మామిడాల. యశస్విని రెడ్డి, నియోజవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులు అంతా ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కో కన్వీనర్ నల్లమాస. రమేష్ గౌడ్, నియోజవర్గ కన్వీనర్ సంగి.వెంకన్న యాదవ్, కోకన్వీనర్ మాటూరి. యాకయ్య గౌడ్, కోఆర్డినేటర్ నారగాని. ఎల్లయ్య, పాలకుర్తి మండల అధ్యక్షులు అనుముల. అంజీరావు, ఉపాధ్యక్షులు మామిండ్ల సోమయ్య, జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు కారు పోతుల. సోమయ్య, మండల అధ్యక్షులు బలుగుల సోమ నరసయ్య, కార్యదర్శి గుగ్గిళ్ళ ఎల్లయ్య, ప్రెస్ ఇన్చార్జి కారుపోతుల శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు.

