2024 ముగిసింది. పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి దీవుల్లోని ప్రజలు అందరికంటే ముందుగా (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు) 2025 నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. తర్వాత న్యూజిలాండ్‌కి చెందిన చాతమ్ దీవులు (3.45 PM IST) కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాయి. న్యూజిలాండ్ మొత్తం సాయంత్రం 4.30 గంటలకు 2025లోకి ప్రవేశించనుంది. ఆక్లాండ్ స్కై టవర్ వద్ద అట్టహాసంగా వేడుకలు ప్రారంభం కానున్నాయి.
భారత్ కంటే ముందుగా వేడుకలు ప్రారంభించే దేశాలు
ఆస్ట్రేలియా మనకంటే అయిదున్నర గంటల ముందే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మన సమయానికి మూడున్నర గంటల ముందు 2025లోకి ప్రవేశిస్తాయి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మనకంటే అరగంట ముందు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి.
ఒకేసారి 43 దేశాల్లో వేడుకలు
భారత కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటలకు భారత్‌తో పాటు శ్రీలంక, సమోవా దేశాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి. అదే సమయానికి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి 43 దేశాలు నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తాయి.
చివరి అడుగు
న్యూయార్క్ జనవరి 1న ఉదయం 10.30కి కొత్త ఏడాదిని ఆహ్వానిస్తే, చివరిగా అమెరికన్ సమోవా కొత్త సంవత్సర వేడుకలను ముగుస్తుంది.