Friday, June 26, 2026
26.2 C
Hyderabad

పార్టీల దశ,దిశను మార్చే పురపోరు!|EDITORIAL

ఎన్నికలు రాజకీయ పార్టీలకు కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియ మాత్రమే కాదు. అధికారాన్ని అధిష్టించడానికి, తమ బల ప్రదర్శనకు, భవిష్యత్ రాజకీయ దిశను నిర్ణయించుకునే వేదిక. తెలంగాణలో ఇటీవల గ్రామ పంచాయితీల ఎన్నికలు ముగియగా, ఇప్పుడు పట్టణ ఎన్నికలకు తెరలేచింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పట్టణాలు, నగరాలు రాజకీయ రణక్షేత్రాలుగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు మరింత ఉధృతమవుతోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు, 16న మున్సిపల్ ఛైర్మన్‌లు, మేయర్‌ల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదలతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పార్టీ గుర్తులపై జరిగే ఈ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే. ముఖ్యంగా అధికార పార్టీకి పట్టణాల్లో పట్టు నిలబెట్టుకోవడం ఒక పెద్ద సవాల్. కాగా, ప్రతిపక్షాలకు ఇది తమ ఉనికిని చాటుకునే అవకాశం. గ్రామీణ ప్రాంతాల్లో సాధించిన ఫలితాలను పట్టణాల్లో కూడా పునరావృతం చేయాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వంపై పట్టణ ఓటర్ల అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి.

గ్రామ పంచాయతీల్లాగే, మున్సిపల్ ఎన్నికలు కూడా స్థానిక సమస్యలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, ట్రాఫిక్, పట్టణ అభివృద్ధి వంటి అంశాలే ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ, ఈ ఎన్నికలు రాష్ట్ర స్థాయి రాజకీయ బల నిరూపణకు కొలమానంగా మారుతున్నాయి. పట్టణాల్లో ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై గట్టి ప్రభావం చూపనున్నాయి.
నామినేషన్ల ఘట్టం మొదలవడంతో ఆశావహుల మధ్య పోటీ తారాస్థాయికి చేరింది. రిజర్వేషన్ల కారణంగా కొందరు అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపుతుండగా, మరికొందరు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ టికెట్ల కోసం అంతర్గత రాజకీయాలు, పైరవీలు జోరుగా సాగుతున్నాయి. అధికారిక నోటిఫికేషన్‌కు ముందే ఖర్చులు మొదలవడం, ఇప్పుడు నోటిఫికేషన్‌తో మరింతగా వ్యయాలు పెరగడం అభ్యర్థులకు ఆర్థిక భారంగా మారింది.

ప్రచారానికి కేవలం రెండు వారాలే సమయం ఉండటం ఒకవైపు మంచిదే అయినప్పటికీ, తక్కువ సమయంలో ఓటర్లను ప్రభావితం చేయాలనే తొందరలో అనవసర హంగులు, ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పథకాలు, హామీలు కీలకంగా మారనున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే మొదలైంది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు పోలింగ్, ఒకే రోజు లెక్కింపు ద్వారా ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించడం ద్వారా అనవసర ఉద్రిక్తతలకు తావు లేకుండా చూసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలన్న ఎన్నికల కమిషన్ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాల్సిందే.

Latest News

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

జూన్ 24, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు దశమి రాత్రి 08.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం చిత్త సాయంత్రం 04.28 వరకు ఉపరి స్వాతి యోగం పరిఘ మధ్యాహ్నం 01.25 వరకు ఉపరి శివ కరణం తైతుల ఉదయం 07.45...

సిమిటి మాల్ కు శిన్న శిట్కా?!|ADUGU TRENDS

శిన్న శిన్న ఇకమతులే పెద్ద పెద్ద పనుల్ల శెమను తగ్గిస్తయి. అల్కగ అయ్యేట్లు శేత్తయి. గట్లనే ఇగో గీ ఉపాయమన్నట్లు. సిమిటి మాల్ కు ఓ శిన్న శిట్కాను కనిపెట్టిండు. గా పనిల...

ఎల్‌నినో హెచ్చరికలు : అప్రమత్తతలు|EDITORIAL

వాతావరణ మార్పులు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనిశ్చిత వర్షపాతం, తీవ్రమైన వాతావరణ ఘటనలు వ్యవసాయ రంగానికే కాదు, మానవ మనుగడకే కొత్త సవాళ్లను...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News