Thursday, September 17, 2026
25.5 C
Hyderabad

కేసీఆర్…తీన్మార్!|KCR|ASSEMBLY

ముచ్చటగా మూడో‘సారీ!’
అలా వచ్చారు! ఇలా వెళ్ళారు!!
2వ తేదీన మళ్ళీ సారొస్తారా?

కేసీఆర్ సారు… అసెంబ్లీకి అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు. గత రెండేళ్ళల్లో రెండుసార్లు, ముచ్చటగా ఇది మూడో‘సారీ!’… కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం పట్టుపట్టడం, ఆయన అలా రావడం. ఇలా వెళ్ళడం పరిపాటైంది. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి కేసీఆర్, ‘తోలు తీస్తా… నేనే రంగంలోకి దిగుతా’నని అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ, యథావిధిగా ఆయన వెనక్కి వెళ్ళారు. తిరిగి ఆయన ఈ సమావేశాలకు 2వ తేదీన మళ్ళీ వస్తారా? నీళ్ళపై నిజానిజాల నిగ్గు తేల్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా?

హైదరాబాద్, డిసెంబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది మొదటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్, అందరికంటే ముందే వచ్చారు. కొద్దిసేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించిన సీట్లో కూర్చుకున్నారు. సభలో ప్రార్థనా గీతం, అనంతరం సంతాప తీర్మానాలు ముగిసి, సభ మొదలవుతుండగానే వెనుదిరిగారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇలా రావడం, అలా వెళ్ళడం కొత్తేమీ కాదు. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి సభలో ప్రభుత్వం తోలు తీస్తా. నీళ్ళపై నిలదీస్తా… ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఉరిమారు. తానే ముందుండి నడుపుతామని చెప్పారు. కానీ, పాత పద్ధతిలోనే తిరిగి వెళ్ళారు.
కేసీఆర్ సభ నుంచి వెళ్ళిన అంశం మాత్రం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అధికారపక్షంపై, ప్రభుత్వంపై రాజకీయ యుద్ధానికి సిద్ధమని జంగు సైరన్ ఊదిన కేసీఆర్, ‘అలా వచ్చి, ఇలా వెళ్ళిపోయే’ వైఖరి సహజంగానే ప్రశ్నలను రేపుతోంది.

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత పరిపాలన, విధి విధానాల రూపకల్పన వేదిక. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, లోపాలు వంటివన్నీ అక్కడే చర్చకు వస్తాయి. 1983 మిహనా, 1985 నుండి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా, కేసీఆర్ ది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పాలనపై పట్టు అపారం. రాజకీయ వ్యూహాల దిట్ట. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ఉండటం ప్రతిపక్షానికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా మేలు చేస్తుంది.

‘ప్రభుత్వాన్ని నిలదీస్తా’, ‘ప్రజల పక్షాన అసెంబ్లీని దద్దరిల్లేలా చేస్తా’, ‘నేనే ముందుండి పోరాడతా’నన్న కేసీఆర్, ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు? ఆయన మాటలకు చేతలకు పొంతన ఎందుకు లేదు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా నిలుస్తోంది.

కొందరు బీఆర్ఎస్ మద్దతుదారులు దీనిని వ్యూహాత్మక నిర్ణయంగా సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రస్తుత సభా వాతావరణం అనుకూలంగా లేద’ని, ‘ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వడం లేద’ని, ‘సభను ప్రభుత్వమే దిగజార్చింద’ని వాదిస్తున్నారు. ఇవన్నీ సాధారణ రాజకీయ విమర్శలే. అయినా, సభలో ఉండి పోరాడితేనే ఈ వాదనలకు బలం చేకూరుతుంది.

ప్రతిపక్ష పాత్ర కేవలం బయట విమర్శించడమే కాదు, సభలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం, ప్రజల సమస్యలను లేవనెత్తడం, విధానపరమైన ప్రత్యామ్నాయాలను సూచించడం. ఈ తరహా వ్యవహార శైలి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడం, లేదా దూరంగా ఉండడం, ప్రజలకు తప్పుడు సంకేతాల్ని ఇస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడి నుంచి ప్రజలు ఆశించేది రాజకీయ పరిపక్వత, స్థిరత్వం, నిలకడైన పోరాటం.

ప్రస్తుత కేసీఆర్ వైఖరి ఆయన వ్యక్తిగతం కావచ్చు. కానీ, అది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ప్రతిపక్షం పారిపోయింది. మమ్మల్ని ఎదుర్కోనే ధైర్యం లేదు’ వంటి ఆరోపణలు రాజకీయంగా సహజమే. కానీ ఈ ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతదే. రాజకీయ పోరాటం బయట మాటలతో కాదు, లోపల నిలబడి చేసే వాదనలతో గెలవాలి. నిజానికి మాటలకంటే చేతలే రాజకీయ నాయకుడి నిజమైన బలమని గుర్తించాలి.

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News