దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సూచీలు గణనీయంగా పడిపోయాయి. సెన్సెక్స్ 76,000 మార్క్ దిగువకు, నిఫ్టీ 23,000 దిగువకు చేరాయి.
అయితే, మార్కెట్ చివర్లో కొంత మేర పుంజుకోవడంతో నష్టాలు స్వల్పంగా తగ్గాయి, మదుపర్లకు కొంత ఊరట లభించింది. రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ షేర్లు మార్కెట్‌పై ఒత్తిడి పెంచగా, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు సూచీలను కొంత మద్దతునిచ్చాయి.

