ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే వరుసలో కనిపిస్తుంటాయి. ఫిబ్రవరి 28న వీటితోపాటు బుధుడు కూడా చేరడంతో మొత్తం ఏడు గ్రహాలు ఒకే సరళరేఖలో దర్శనమిస్తాయి. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ సహాయంతో చూడవచ్చు, మిగతా గ్రహాలు కంటితోనే వీక్షించవచ్చు. ఈ అరుదైన ఘటన భూమిపై ప్రభావం చూపుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తుండగా, మరికొందరు దాన్ని ఖండిస్తున్నారు.

