అడుగు ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ అజంజాహి కార్మిక భవనాన్ని కూల్చిన చోటనే కార్మిక కల్చరల్ భవనాన్ని రూ. 10 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని వరంగల్ వాసులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను డిమాండ్ చేస్తున్నారు. 1934లో నైజాం ప్రభుత్వం అజం జాహి మిల్లును నిర్మించి పదివేల మందికి ప్రత్యక్షంగా మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన విషయం తెలిసిందే. 75 సంవత్సరాల పాటు కార్మికుల సభలు సమావేశాలకు వేదికగా నిలిచిన కార్మిక భవన కూల్చి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు నగరవాసులు తిప్పి కొట్టడంతో కూల్చిన చోటనే కార్మిక, కల్చరల్ భవనాన్ని నిర్మించాలన్నది వరంగల్ వాసుల కోరిక. హనుమకొండలో కాళోజి కళాక్షేత్రం నిర్మించిన స్థాయిలో వరంగల్లో కార్మిక కల్చరల్ కళాక్షేత్రాన్ని నిర్మించాలని ప్రజల అభ్యర్థన పద్మశాలి ముద్దుబిడ్డ గా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మంత్రిగా ఉన్న మీరు వరంగల్ వాసుల నివేదన అర్థం చేసుకొని రూ 10 కోట్ల వ్యయంతో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం దీటుగా వరంగల్ అజాంజాహి కార్మిక కల్చరల్ కళాక్షేత్రాన్ని నిర్మించాలన్నది ఓరుగళ్లు సగటు పౌరుడి అభ్యర్థన. అతి త్వరలో మీ నిర్ణయాన్ని ప్రకటించి అజంజాహీ కార్మిక భవనం కూల్చిన చోట కార్మిక కల్చరల్ భవనానికి శంకుస్థాపన చేయాలని మీకు ఓటు వేసి గెలిపించిన వరంగల్ తూర్పు ప్రజల ఆకాంక్ష.. మంత్రి గారూ! మా విన్నపాన్ని ఆలకించండి.

