తెలంగాణలో పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల తేదీలను ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు మార్చి 6 నుంచి ప్రారంభమవనున్నాయి. పరీక్షలు ప్రతి రోజు మధ్యాహ్నం 1.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించనున్నారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం గంటన్నర వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇక వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులు తగిన ప్రణాళికతో సిద్ధమవ్వాలని విద్యార్థులు సూచించారు.