Tuesday, May 5, 2026
35.2 C
Hyderabad

తెలంగాణ కుల గ‌ణ‌న దేశానికి రోల్ మోడ‌ల్‌గా నిలుస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణనపై మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేర‌కు తెలంగాణలో కుల గణన చేపట్టినట్లు తెలిపారు. కుల గణనను సమాజానికి ఎక్స్‌రేలా వర్ణిస్తూ, దాని ద్వారా దేశ ప్రజల పరిస్థితులను అర్థం చేసుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మునుపటి మ‌న్మోహ‌న్ సింగ్ ప్రభుత్వం 2011లో సేకరించిన కుల గణన వివరాలను మోదీ ప్రభుత్వం బయట పెట్టలేకపోయింది. కానీ, రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలో ప్రజల మనసులోని మాటను గ్రహించి, కుల గణన చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. ఆయన హామీ ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియ ప్రారంభించింది,” అని తెలిపారు.

తెలంగాణ శాసనసభలో కుల గణనపై తీర్మానం చేసి, జంతర్ మంతర్ వద్ద నుంచి పార్లమెంట్ వరకూ ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ డిమాండ్‌కు అన్ని పార్టీల మద్దతు లభించిందని, చివరకు కేంద్రం దేశవ్యాప్తంగా కుల గణనకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. వందేళ్లుగా ఎవరూ చేయని పని తెలంగాణ ప్రభుత్వం ముందుండి చేపట్టిందని, ఇది దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

కుల గణనను పారదర్శకంగా నిర్వహించేందుకు మంత్రుల కమిటీ, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. వారు జిల్లా కేంద్రాల్లో ప్రజల డిమాండ్లు విన్నారని చెప్పారు. తనే స్వయంగా ఎనిమిది సార్లు సమీక్షలు నిర్వహించానని తెలిపారు. 90 వేలకుపైగా ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమాచారం సేకరించారని, ప్రతి పదిమందిపై ఒక సూపర్వైజర్‌ను నియమించినట్లు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణనకు అంగీకరించడం పట్ల స్వాగతం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అయితే, దేశ వ్యాప్తంగా కుల గణన చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా ఉన్న బోయులు కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారని, లంబాడీలు తెలంగాణలో ఎస్టీలు, మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారని ఉదాహరణలు చెప్పారు.

కుల గణన కోసం కేంద్రం ప్రత్యేకంగా మంత్రుల కమిటీ, నిపుణుల బృందాన్ని నియమించాలని, స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ అనుభవాన్ని కేంద్రం వినియోగించుకోవాలని కోరారు. తమ దగ్గర ఉన్న సమాచారం, అనుభవాన్ని ఇతర రాష్ట్రాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

రాజకీయాలు పక్కన పెట్టి దేశ ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తామని, కుల గణనను రాజకీయం చేయదలచుకోలేదని స్పష్టం చేశారు. చివరిగా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాహుల్ గాంధీ, ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలితమేనని తెలిపారు. బీహార్ కుల గణనపై కోర్టు ఆక్షేపించినా, తెలంగాణ చేపట్టిన కుల గణన శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.

Latest News

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 03 నుండి మే 10 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత...

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News