Monday, September 21, 2026
27.3 C
Hyderabad

నాయకుల మాటలకు అర్థాలే వేరులే!|EDITORIAL

రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరే ఉంటాయి. ప్రసంగాలు, మాటలు, విమర్శలకు వాడే భాషతోపాటు, అర్థాలు వేర్వేరుగా ఉంటాయి. వారి భాష హద్దు దాటుతోంది. హుందాగా ఉండాల్సిన నేతల ప్రవర్తనలు కూడా నీచంగా దిగజారుతున్నాయి. విమర్శల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉంటే ఓ తీరు. అది చేజారితే మరోతీరు. ఎవరినైనా ‘అధికారాంతమున చూడవలె’ అన్నట్లుగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తే, అధికారం పోయిన తర్వాత వారి నిజస్వరూపం బయటపడుతుంది. పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్‌ నేతలు, ఐదేళ్లు పవర్ లో ఉన్న వైకాపా నేతలు ఇప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ఉన్నదున్నట్లు పత్రికలు రాస్తున్నాయి. ఛానళ్లు కూడా వీటిని యధాతథంగా ప్రసారం చేస్తున్నాయి. నాయకుల విమర్శల్లో నిజానిజాలను నిగ్గుతేల్చే సాహసాన్ని ప్రసార, ప్రచార సాధనాలు చేయడంలేదు. ఒకందుకు సామాజిక మాధ్యమాలే నయం. వాటి భాష, అతి, అబద్ధాలను పక్కనపెడితే, ఎంతోకొంత వాస్తవాలు వెలుగు చూస్తున్నవి. ఒకవైపు వారు వాడే భాషను, మరోవైపు వారు ఆడే అబద్ధాల ప్రచారాన్ని కట్టడి చేయలేమా? ఏది మాట్లాడినా చెల్లుతుందనే పద్ధతికి బ్రేకులు పడవా? అలా మాట్లాడేవాళ్లకు తగిన శిక్షలుంటాయన్న భయం లేకుండా వారి అబద్ధాలపై ఆంక్షలుండక్కరలేదా? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తుంది. మూడు పార్టీలు ఒకరినొకరు ఒక్కటే అంటే మరి వేరు పార్టీ ఏది? అయితే మూడు పార్టీలు ఒక్కటై అబద్ధాలు ఆడుతుండాలి. వారి మధ్య లేని వేర్పాటు ప్రజల మధ్య ఎందుకు? పైగా వారాడే అబద్ధాలని ఎంతకాలమని భరిస్తారు? ప్రజలు కూడా వేడుక చూస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవాలా? లేక వారి మాయలో పడి ఏది నిజమో? ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారా?

తెలంగాణలో పదేళ్లు పాలన చేసిన కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాసను, భాషను సాధనంగా వాడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీశ్ రావు, బిడ్డ కవితలతో పాటు ఇతర నేతలు కూడా హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. వీరి తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి అంతకంతకూ రెచ్చగొడుతున్నారు. ఏపీలో జగన్ ఆయన అనుచరులు కూడా ఇలాగే తెగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారం అనుభవించారు. వారి చుట్టాలు, పక్కాలు, కులమైతే చాలన్నట్లుగా పదవులను చేపట్టారు. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను, ఉద్యమకారులను కేసీఆర్‌ గడ్డి పరకల్లా తీసి అవతల పడేశారు. ప్రొపెసర్‌ కోదండరామ్‌ లాంటి వారిని కూడా కరివేపాకులా వాడి పడేశారు. జర్నలిస్టులనైతే, గంజిలో ఈగల్లాగా చూశారు. ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే గుర్తించారు. ఓటర్లు వారిని ఓడిస్తే, తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ఇప్పుడు అధికారం దూరమయ్యే సరికి వారి మాట, ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి. ఉచ్ఛ నీచాలు మరచి విమర్శలు చేస్తున్నారు. పోలీసులు, ఇతర అవినీతి అధికారుల అండదండలతో ప్రజాధనాన్ని, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములను వారు, వారి కుటుంబ సభ్యులు కొల్లగొట్టారనడానికి అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చూస్తుంటే ఇంతగా తెగించారా? అన్న అనుమానాలు కలగకమానవు. ఏసీబీ దాడులు, ఇడి విచారణల్లో, కొనసాగుతున్న దర్యాప్తుల్లో వెలుగు చూస్తున్న నిజాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అధికారులే వందల, వేల కోట్లు వెనకేసుకుంటే, ఇక అసలు నాయకులు ఎంత వెనకేసుకున్నారో ఊహించవచ్చు. అంతెందుకు ఈ ఫార్మూలా కారు కేసులో ఆర్థికశాఖ అనుమతులు లేకుండా కేవలం మంత్రిగా డబ్బులు నేరుగా దేశం దాటించానని ఒప్పుకున్న కేటీఆర్‌ మాట్లాడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ‘లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం అని, ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని అనడం వెనుక ధైర్యమేంటి? ఇది ఏ ప్రజాస్వామిక విలువలకు లోబడి మాట్లాడుతున్నట్లు?

ఏపీలో జగన్‌ కూడా ఇలాగే ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని అంటున్నారు. ఇలా మంత్రులుగా, సీఎంగా పని చేసిన వ్యక్తులు మాట్లాడాల్సిన భాషేనా? బుకాయించే తీరు ఇదేనా? అని ప్రజలు విచిత్రపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై మీడియా సంస్థలపై ప్రతిపక్షాలపై నిఘా, నియంత్రణ, ఫోన్ ట్యాపింగ్, అణచివేత కొనసాగించిన విషయం కేటీఆర్‌ మర్చి పోయి ఉంటారా? అధికారం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు పంపిణీ చేసి రాయలసీమను రతనాల సీమను చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో తెలంగాణ హక్కులను చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని విమర్శలు చేస్తున్నారు. మేడిగడ్డ మీద చర్చ పెడతామంటారు. సవాళ్లు విసరుతారు. రచ్చ తప్ప చర్చే ఉండదు. ఆనాటి ఏపీ సీఎం జగన్‌ని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవడం చూశాం. ఆయన ప్రమాణస్వీకారానికి అమరావతి వెళ్ళడాన్ని చూశాం. మంత్రి రోజా ఆహ్వానాన్ని అందుకొని నగరి సందర్శించి ఆతిథ్యం పుచ్చుకోవడం కూడా చూశాం. ఇవన్నీ అబద్ధాలైనట్లు కేటీఆర్‌, హరీష్‌ రావులు ఇప్పుడు ఇష్టానుసరాంగా మాట్లాడుతున్నారు.

ఇకనైనా చేసిన తప్పులు ఒప్పుకోండి. లేదా బుకాయించడమైనా మానండి. జగన్‌ కూడా తన తండ్రి వైఎస్‌ లాగా హుందాగా ఉండడం నేర్చుకోవాలి. ఇరు పార్టీల నేతలు హుందాగా ప్రతిపక్ష బాధ్యతలు నెరవేర్చాలి. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి. ప్రజలకు మేలుచేసేలా చర్యలు ఉండాలి. ప్రతిపక్ష పాత్రను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే ప్రజలు ఆదరిస్తారని గుర్తించాలి.
…..

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News