Thursday, September 17, 2026
27.7 C
Hyderabad

అధిక జనాభా అభివృద్ధికి ఆటంకమా? ఆలంబనా!|EDITORIAL

ఒక దేశ అభివృద్ధికి అధిక జనాభా ఆటంకమా? ఆలంబనా? సాధారణంగా ఆలోచిస్తే, అధిక జనాభా కచ్చితంగా అభివృద్ధి నిరోధకమే. కానీ, శిక్షణ, నైపుణ్యాల పెంపుతో సమర్థవంతంగా మానవ వనరులను వినియోగించగలిగితే జనాభా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలే చేస్తుంది! జనాభా ఒక అనుకూల అంశమే. నిజానికి ప్రపంచంలో ఇవ్వాళ అత్యంత సమస్యాత్మకం మానవ వనరులే. డబ్బు, పెట్టుబడులు వంటివి సమకూర్చుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. కానీ, సమర్థమైన మానవ వనరుల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందంటే ఆశ్చర్యం వేయక మానదు. అభివృద్ధి చెందిన, చెందుతోన్న దేశాలకు మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. అదే వెనుకబడిన దేశాలకు మానవ వనరులు పెద్ద సమస్యగా, గుదిబండగా మారుతున్నాయి. ప్రజల నైపుణ్యాలు, జ్ఞానం, సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించడమే మానవ వనరుల నిర్వహణ. ఇది నియామకం, శిక్షణ, అభివృద్ధి, జీతాలు, ప్రయోజనాలు, ఉద్యోగి సంబంధాల నిర్వహణ వంటి అనేక అంశాల మీద ఆదారపడి ఉంటుంది.

భారతదేశంలో 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణలు అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సంస్థలు వారి వినూత్న, శక్తివంతమైన పోటీతత్వంతో మన దేశంలో పెట్టుబడుల పేరుతో ప్రవేశించగా, సంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చుకున్నాయి. కొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలలో భారతదేశం ఒకటి. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న అక్షరాస్యతా శాతం వల్ల అర్హత గల మానవ వనరుల సంఖ్య పెరిగింది. గ్లోబలైజేషన్, సరళీకరణల వల్ల 1995 తర్వాత బహుళ జాతి సంస్థలు దేశంలో వ్యాపారం చేయటానికి ముందుకు వచ్చాయి. ఇక్కడ తగినన్ని మానవ వనరులు అందుబాటులో ఉండటం వల్ల మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యత రానురాను పెరుగుతోంది.

దీంతో మానవవనరుల నిర్వహణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారికి తగు శిక్షణనివ్వడం ద్వారా నైపుణ్యాలను పెంచడం, వారి సామర్థ్యాలకనుగుణంగా వారి నుంచి పనిని తీసుకోవడం అనేది సవాల్ గా మారింది. యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం. శిక్షణ, అభివృద్ధి ద్వారా నైపుణ్యాలను పెంచటం. భారతీయ సంస్థలు ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధిపరచటానికి, వృత్తి సంబంధిత అభివృద్ధిని విస్తరించటానికి వారి బాధ్యతలను గుర్తించటం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులపై ఉన్న వివక్ష రూపు మాపటానికి భారతదేశంలో సంస్థలన్నీ సమాన ఉపాధికి కట్టుబడి ఉన్నాయి. మహిళలకు శిక్షణనిచ్చి మరీ నిర్వాహక స్థాయిలో పదవులనిస్తున్నాయి. వివిధ దశలలో మహిళల పరిమితులను గుర్తించి దీర్ఘకాలిక సెలవు, తగు సమయం వరకు ప్రసూతి సెలవు వంటి సదుపాయాలు అన్ని సంస్థలు అందిస్తున్నాయి.

ఈ క్రమంలో జనాభా పెరగాలని రష్యా లాంటి దేశాలు ఆరాటపడుతున్నాయి. భారత్‌ లాంటి దేశాలు జనాభా నియంత్రణను కోరుకుంటున్నాయి. కొన్ని దేశాలు అధిక జనాభాతో సతమతమవుతూ, జనాభా నియంత్రణ చర్యలు పాటిస్తున్నాయి. మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. గతంలో జనాభా నియంత్రణను కఠినంగా అమలు చేసిన దేశాలు కూడా ఇప్పుడు ఆ నిబంధనను సడలిస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. జనాభా పెరగాలని కొన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి. యూపీ, బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు ఇప్పటికీ జనాభా నియంత్రణకు ప్రాధాన్యమివ్వడం లేదు. జనాభా అనేది సమస్యే కాదని, మావన వనరుల నిర్వహణకు ప్రభుత్వాల వద్ద సరైన ప్రణాళికలు లేకపోవడమే అసలు సమస్యని తేట తెల్లమవుతోంది. కేవలం రాజకీయ ప్రయోజనాలే పరాకాష్టగా పని చేస్తున్నందువల్లే సమస్యలుత్పన్నమవుతున్నాయి. సరైన ప్రణాళికలతో జనాభాను వినియోగించుకుంటే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. వస్తూత్పత్తని పెంచవచ్చు. ఆహారోత్పత్తిని జరపవచ్చు. వ్యవసాయంలో విప్లవం తేవచ్చు. ఇలా ఆలోచించ గల నేతలు దేశంలో లేకుండాపోయారు.

మన దేశం 146 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉన్నది. జనాభా ఆయా దేశాల ఆర్థిక, సామాజిక, పర్యావరణంపై ఆధారపడి ఉంటాయి. సరైన ప్రణాళిక లేనప్పుడు జనాభా పెరుగుదల ఒత్తిడిని సృష్టిస్తుంది. వనరులను దెబ్బతీస్తుంది. పర్యావరణ విధ్వంసానికి కారణం అవుతుంది. అయితే సమర్థవంతమైన విధానాలతో ఈ సవాళ్లను అధిగమించవచ్చు. అధిక జనాభా ఉన్నా, చైనా సరైన ప్రణాళికలతో అభివృద్ధి పథంలో దూసుకు పోతోంది. ప్రపంచంలో మూడో అధిక జనసాంద్రత గల దేశం సింగపూర్‌ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. సింగపూర్ వైశాల్యం 719.9 చ. కి. మీ. కాగా, చదరపు కిలో మీటర్‌కు 8,595 మంది నివసిస్తున్నారు. అయితే అధిక ఆర్థిక వృద్ధి, అత్యుత్తమ గృహనిర్మాణం, ఆరోగ్య సేవలతో ప్రపంచంలోనే ఆ దేశం అగ్రగామిగా ఉంది. 1980 నుంచి 2015 వరకు చైనా వన్‌ చైల్డ్‌ పాలసీని అమలు చేసి, దాదాపు 40 కోట్ల జనాభాను నియంత్రించింది. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఆ దేశం జనాభా వనరులను అత్యంత సమర్థవంతంగా ఉపయోగించింది. ఫలితంగా చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. భారతదేశంలో 35 ఏళ్ల లోపు యువ జనాభా 65 శాతం ఉంది. ఈ జనాభాను పని విధానంలోకి మారిస్తే అద్భుతాలు సాధించవచ్చు. వీరిని ఉత్పాదక శక్తిగా మారిస్తే, ఆర్థిక వృద్ధికి దోహదపడతారు. ఈ దిశగా ఆలోచనలు సాగడం లేదు. మన ప్రజాస్వామ్యంలో ఓటు ప్రధానం కనుక అంతా ఆ ఓటు బ్యాంకు వైపే మొగ్గుతున్నారు. దీంతో ఉచితానుచితాలు పెరిగి, ప్రజలు సోమర్లుగా మారి, ఉత్పాదక తగ్గి మొత్తం దేశమే సమస్యల్లో కూరుకుపోతోంది.
…..

Latest News

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News