Thursday, April 16, 2026
38.2 C
Hyderabad

లైఫ్ ఆఫ్ పై … ఫ్రభంజన్!|PRABHANJAN YADAV

‘ఎన్నో బాధలకు గురైనా, ఎంతో మనస్థాపం చెందినా ప్రభంజన్ ఓ శక్తిగా మారడానికి ఆ ఇమేజే ఉపకరించింది. ఆయనను కదిలే ఉద్యమంలా నిలబెట్టింది. ప్రభంజన్ ఓ రెబల్ స్టార్. ఆయన ప్రస్థానమంతా ఎదురీతే. ఉద్యమకారుడిగా, ఉపాధ్యాయుడిగా, ఉద్యోగిగా ఏ రంగంల ఉన్నా, ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర కోసం తపించిండు. తను నమ్మిన ఈనాటికీ అవసరమైన దళిత బహుజన స్పృహను అందించిండు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని వ్యాప్తి చేసి, స్ఫూర్తి నింపిన ప్రభంజన్ గట్లాంటి వాళ్లల్ల ముఖ్యుడు.’ అంటూ ప్రభంజన్ పై ఆయన 50వ పుట్టిన రోజు సందర్భంగా వెలువడిన ప్రత్యేక సంచిక కోసం కార్టూనిస్టు శేఖర్ రాసిన ప్రత్యేక వ్యాసం.. అడుగు పాఠకుల కోసం…

నాలుగు ఆస్కార్ అవార్డుల పొందిన యాంగ్ లీ ‘లైఫ్ ఆఫ్ పై’ సినిమా గుర్తుందా? సముద్రంల ఓ పడవల ఓ అమాయకపు పోరడు, ఓ పులి సహజీవనం చేయాల్సి వస్తుంది. పోరడు ముందుగాల ఆ పులికి భయపడుడు, అది పెట్టే బాధలు భరించుడు, ఆ తర్వాత దాన్ని ఎదుర్కొనుడు, చివరికి లొంగదీసుకొనుడు ఆ సినిమా ఇతివృత్తం.

మనం పుడుతం. అవ్వయ్య పావురంతో అల్లారు ముద్దుగా పెంచినంత కాలం మన జీవన నౌక హాయిగా పయనిస్తది. ఈలోగా మనకు ఊహ తెలుస్తది. చుట్టూ ఉన్న సమాజం అనే సముద్రం అల్లకల్లోలంగా ఉంటది. మన నౌక అనేక కుదుపులకు గురై అవ్వయ్య దూరమైతరు. మనం మనదైన లోకపు మరో పడవలకు చేరుతం. అదే పడవల ఆ కౄర పులి. సముద్రంల ఓకే పడవల మనం, ఆ పులి మిగులుతం. అనుక్షణం అది మనల తినతందుకు ప్రయత్నిస్తది. మనం తప్పించుకోవాలనుకుంటం. భయపడతం. అరుస్తం. నానా ఇబ్బందులు పడతం. దాన్ని లొంగదీసుకునుడు తప్ప వేరే మార్గం లేదని గ్రహిస్తం. పోరాటం మొదలు పెడుతం. ఆ పులి మరేదో కాదు ‘కులం’. హిందూ బ్రాహ్మణిజం సృష్టించిన కులం. ఆ పోరడు మరెవరో కాదు నువ్వూ, నేనూ మన దళిత బహుజనులందరమూ. అది మన ఫూలె, మన అంబేద్కర్, మన గద్దర్, మన కంచ ఐలయ్య, మన ప్రభంజన్ వరకూ మన అందరమూ ఆ పులి భారిన పడ్డొళ్లమే, దానితో నిరంతరం కొట్లాడుతున్నోళ్లమే!

పుట్టేనాటికి మనకు తెల్వదు, హిందూ బ్రాహ్మాణీయ కులవ్యవస్థల పుట్టినమని. ఏ కులంల పుట్టాలనేది మన ఛాయిస్ కాదుగదా! ఈ ‘పుట్టుక’ని బాధాకరంగా, ఆత్మన్యూనతగా తయారు చేసిన హిందూ బ్రాహ్మాణీయ కుల చట్రాన్ని ప్రశ్నించుడు మినహా మరో మార్గమే లేదు. లేకపోతే దాని దుష్టత్వానికి బలికాక తప్పదు. దాని ఆనుపానులు తెలుసుకొని సరైన దెబ్బ కొట్టుడే మనం చేయాల్సిన పని. ఈ పనిని చాల ధైర్యంగా, సమర్థంగా, గొప్పగా చేసిండు మన ‘ప్రభంజన్’.

పాలకుర్తి మండలం గూడూరుల పుట్టిన యాదనాల ప్రభంజన్ యాదవ్ పాలకుల పనితీరును ప్రశ్నించే స్వభావం ఉన్నవాడు. చిన్ననాడు దొర కొడుకుపై హోళి రంగునీళ్లు చల్లి చెంపదెబ్బతిన్నా, బడిల టీచర్ల పోకడ నచ్చకున్నా, బీసీ హాస్టళ్ల వార్డన్ల వైఖరితో ఇబ్బందులు పడ్డా, చదువు ప్రసాదించిన విజయ గర్వంతో ‘దొర భార్య’కు ‘దొరసాని’ అంటే అర్ధం ఏమిటో వివరించినా, హన్మకొండ ఫుట్ పాత్ పై స్ఫూర్తిదాయక పోస్టర్ల కొటేషన్లు చూసి వాటినే జీవిత గమ్యంగా నిర్ణయించుకున్నా, తోటి విద్యార్థులల్ల నాయకుడిగా వ్యవహరించినా, పాఠాలు బోధించినా, ప్రొఫెసర్ల వివక్షను ఎదుర్కొన్నా, సహొద్యోగుల కుట్రలను ఛేదించినా, సంఘాలు పెట్టినా, ఉద్యమాలు నడిపినా, ఆఖరికి జర్నలిజం వృత్తిల జఠిలమైన అంశాలు ఎదుర్కొన్నా ప్రభంజన్ కు సహసమే సహవాసం అయింది. ఆయన ప్రశ్నించే తత్వమే ప్రభంజన్ అండ అయింది. ఆ స్వభావమే ఆయకు రక్షణ కవచమైంది. కర్తవ్యంతో సహజీవం చేయించింది. ఆ క్రమంల ఎన్నో బాధలకు గురైనా, ఎంతో మనస్థాపం చెందినా ప్రభంజన్ ఓ శక్తిగా మారడానికి ఆ ఇమేజే ఉపకరించింది. ఆయనను కదిలే ఉద్యమంలా నిలబెట్టింది. ప్రభంజన్ ఓ రెబల్ స్టార్. ఆయన ప్రస్థానమంతా ఎదురీతే.

ప్రభంజన్ నాకు ఉస్మానియా యూనివర్సిటీ రోజుల నుంచీ తెలుసు. 1987-90 ల మధ్య నేను యూనివర్సిటీ లా హాస్టల్ ఈ 28 ల ఉండేవాణ్ని. అప్పుడు ప్రభంజన్ పలు రూపాలల్ల కనిపించేవాడు. బీసీ ఉద్యమాలల్ల, యాదవ విద్యార్థి సంఘాలల్ల, విప్లవ ఉద్యమ గీతాలల్ల, హాస్టల్ విద్యార్థిల పోరాటాలల్ల, చదువే పోరాటంగా యూనివర్సిటీ లైబ్రరీ విద్యార్థులల్ల ఎంతో స్ఫూర్తివంతంగా కనిపించేవాడు. అస్తమానం పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు అగుపడేది. కాస్త మొండితనం కొట్టొచ్చినట్టు కనపడేది. కానీ మరు క్షణమే మనసు వెన్నపూస, మమతల కోవెల అయ్యేది.

నేను చదువు అర్థంతరంగా ఆపేసిన. కార్టూనిస్టుగా ప్రజాశక్తి దినపత్రికల చేరడానికి విజయవాడ వెళ్లిన. ప్రభంజన్ యూనివర్సిటీల కొనసాగుతూ జర్నలిజం, ఎంఫిల్, పిహెచ్ డి, సివిల్స్ కు ప్రిపేరవుడు, ఉద్యమాలతో సమాంతరంగా తన పోరాట పటిమను పెంచుకునుడు, స్ఫూర్తిదాయకంగా తన జీవితాన్ని మలచుకున్నడు. ఈనాడు లాంటి అగ్రశ్రేణి దినపత్రికల పనిచేస్తూ అక్కడి వాతావరణాన్ని సైతం ప్రశ్నించి బయట పడ్డడు. పలు పత్రికల్ల పనిచేసి జర్నలిజం ఆనుపాలు ఎరిగిండు. అంతే కాదు జర్నలిజంల పాఠాలు బోధించే స్థాయికి ఎదిగిండు. ఉద్యమకారుడిగా, ఉపాధ్యాయుడిగా, ఉద్యోగిగా ఏ రంగంల ఉన్నా, ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర కోసం తపించిండు. తను నమ్మిన ఈనాటికీ అవసరమైన దళిత బహుజన స్పృహను అందించిండు.

ముఖ్యంగా రచయితగా ప్రభంజన్ పరిణతి గురించి చెప్పుకోవాల్సిందే. అదీ ఇంగ్లీష్ రచయితగా. (బహుశ కంచ ఐలన్న స్ఫూర్తి అనుకుంట). ఉబుసుపోక రాసుకునే బ్రాహ్మణీయ భావజాల కథలు, మధ్యతరగతి ప్రేమ కథలు కాకుండా తన జీవిత కథలు, తన మూలాల నుంచి పుట్టిన మట్టి కథలు, దళిత బహుజన కథలు ఆయన మలచిన తీరు అద్భుతం. అన్నీంటికి మించి కల్పిత పాత్రలు కాకుండా తన మూలాలనే మొక్కలుగా నాటుతున్నడు. ముఖ్యంగా ఫూలె అంబేద్కర్ వారసుడిగా హిందు బ్రాహ్మణీయ కులవ్యవస్థ మీద ప్రభంజన్ ఎక్కుపెట్టిన అస్త్రాలు చాల పదునైనై. గొల్ల కురుమ కుటుంబ నేపథ్యం ఆయన కథలల్ల ప్రతిబింబిస్తుంది. సకల దుర్మార్గాలకు జనని బ్రాహ్మణీయ భావజాలమనీ అది సృష్టించిన కులవ్యవస్థ అనీ ప్రభంజన్ తన రచనలల్ల చాల స్పష్టంగా వివరిచిండు.

నిచ్చెనమెట్ల కులవ్యవస్థల అందరికన్నా పైన ఉన్న బ్రాహ్మణులు తప్ప, మిగతా అందరూ బాధితులే. దేవుడికి జీవుడికి మధ్య సంధానకర్తగా వ్యవహరించే ఉద్యోగం సృష్టించుకున్నడు బ్రాహ్మణుడు. జీవుడు తమకు ఎట్ల అణిగిమణిగి ఉండాలని నిర్దేశించిండు. మనిషిని పశుప్రాయంగా చూస్తున్నడు. మనం అదే అమెరికాల పుట్టి ఉంటే క్రైస్తవులం అయి ఉండేవాళ్లం. దేవుడికి మనకు మధ్య పూజారి ఉండే వాడు కాదు. ఏ ముస్లీం దేశంల పుట్టినా కుల బానిసత్వం ఉండేది కాదు. భారత దేశంల పుట్టినందుకే మనకు ఈ కులం ట్యాగ్ బొడ్డు తాడుకే కట్టేసిండ్లు. తత్ఫలితంగా చదువుల, ఉద్యోగాలల్ల, అవకాశాలల్ల అన్నీట్లా అసమానతలే. హిందూ బ్రాహ్మణాది దోపిడి అగ్రకులాల వాళ్లు నూరుశాతం తెలివితో ఉంటే, దళిత బహుజనుల పిల్లలు నూటయాభై శాతం తెలివితో ఉంటేగానీ పోటి పడలేని పరిస్థితి.

ఇలాంటి అసమానతల, అవకతవకల, అనాగరిక సమాజంల మనం జీవిస్తున్నం. చదువుకొని, సమాజాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న దళిత బహుజన మేథావులు దీన్ని ప్రశ్నిస్తున్నరు. తమ రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా దళిత బహుజనులను చైతన్యం చేస్తున్నరు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నరు. స్ఫూర్తిని నింపుతున్నరు. ప్రభంజన్ గట్లాంటి వాళ్లల్ల ముఖ్యుడు.

ప్రభంజన్ మాత్రం ఎన్ని పుట్టిన రోజులు జరుపుకుంటున్నం అన్నది ముఖ్యం కాదంటడు. పుట్టిన రోజుకు పుట్టిన రోజుకు మధ్య ఏం చేస్తున్నం అన్నదే ముఖ్యం అంటడు. ప్రభంజన్ నిరంతరం సమాజాన్ని ప్రభావితం చేస్తూ, నడిచే ఉద్యమంగా, ఆత్మగౌరవ పతాకగా భావితరాలకు స్ఫూర్తిని అందించిండు. నా ప్రియ మిత్రుడు ప్రభంజన్ యాదవ్ కు జోహార్! జోహార్లు!!


-కంబాలపల్లి చంద్రశేఖర్ యాదవ్, పూర్వ కార్టూనిస్ట్
ఆంధ్రజ్యోతి దినపత్రిక, హైదరాబాద్
మొబైల్ 9849378031
ఈ మెయిల్ shekartoon@yahoo.com

Latest News

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News