పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా పసువులకు అవుసరమైన గడ్డిని గీ రైతన్న ఎంత మంచిగ రచ్చిత్తాండో సూడుండ్రి.
ఎండుగడ్డి వామేసిండు. ఏడికాడికి బందో బస్తు శేసిండు. మరి వానొత్తే? గిదీనికే ఓ ఆలోసన శేసిండు. గా గడ్డాముకి పై నుంచి రేకులు కప్పిండు. గయి గాలి దుమారానికి లేసి పోకుండ పై నుంచి గట్టిగ తాళ్ళు కట్టి బరువులేసిండు. ఇగ గడ్డాముకు గీ రచ్చణ సూసిన రైతులు, రైతంటే గీయినే పో అంటాండ్లు!

