Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

రాజ్యాంగం- గవర్నర్ల వ్యవహారం- సుప్రీం తీర్పు!|EDITORIAL

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

రాష్ట్రపతి, గవర్నర్ల దగ్గర బిల్లుల పెండింగ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నా, తీర్పు మాత్రం రాజ్యాంగానికి లోబడే కనిపిస్తున్నాయి. నిర్ణీత గడువులోగా ఆమోదించకపోతే అవి ఆమోదం పొందినట్లేనన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లే. అయితే గడువు ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలన్నా, రాజ్యాంగాన్ని సవరించాలన్నా, అది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తేలింది కూడా ఏమీ లేదు. ఫైనల్ గా బంతి పార్లమెంటులోనే పడింది. గవర్నర్ల బిల్లు పెండింగ్ వ్యవహారం పెండింగులోనే పడింది.

పదవీ విరమణ పొందుతున్న సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ బుధ, గురు వారాల్లో రెండు రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించి సంచలన తీర్పులిచ్చారు. రాష్ట్రపతి న్యాయ సలహా కోరిన అంశంపై గురువారం ఏకాభిప్రాయంతో ఇచ్చిన తీర్పూ సంచలనమే. తమిళనాడులో గవర్నర్, పలు బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతుండటంతో అక్కడి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు గవర్నర్‌ను ఆదేశించింది. బిల్లులను తొక్కిపట్టే విధానాన్ని తప్పుబట్టింది. అయినా సరే, గవర్నర్‌ మాత్రం బిల్లులను ఆమోదించలేదు. దీంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న గవర్నర్‌ రాజ్యాంగ విధుల్లో విఫలయ్యారని మండిపడింది. బిల్లులు తిప్పిపంపకుండా దగ్గర పెట్టుకోవడం కుదరదని చెప్పింది. మళ్లీ శాసనసభ ఆమోదిస్తే గవర్నర్‌ ఆమోదించాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులో గవర్నర్‌ బిల్లులను ఆమోదించకపోతే, అవి ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 13న రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలతో న్యాయ సలహా కోరింది. వాటికి సుప్రీంకోర్టు గురువారం సమాధానం ఇచ్చింది. వాదనల సమయంలో ఏప్రిల్‌ 8 నాటి తీర్పును తోసిపుచ్చే ఉద్దేశం లేదని ప్రధాన న్యాయమూర్తి పదేపదే చెప్పారు. మరో తీర్పును తోసిపుచ్చేందుకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 కింద సలహా కోరడాన్ని ఉపకరణంగా వాడటం కుదరదని పేర్కొంది. ప్రధానంగా బెంగాల్‌, తమిళనాడు, తెలంగాణల్లో ఇలాంటి పరిస్థితులను చూశాం.
అయితే రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే తేల్చిచెప్పింది. విచక్షణతో వ్యవహరించవచ్చంది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవా లని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది.ఈ తీర్పుతో ఇప్పుడు గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉన్నా ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. అలాగే బిల్లులను సకాలంలో పంపాలన్న నిబంధన లేకపోతే వారు రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చెలాయిస్తారని తమిళనాడు, బెంగాల్‌ తదితర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్లకు గడువు ఉండాలని, అభిప్రాయపడ్డారు. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.

గవర్నర్‌కు రాజ్యాంగపరంగా మూడు ఆప్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆమోదించడం లేదా సహేతుక కారణం చెప్పి బిల్లును రిజర్వులో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం చేయాలి. ఒకవేళ బిల్లును తిరస్కరించి తిరిగి అసెంబ్లీకి పంపాలి. అప్పుడు శాసనసభ తిరిగి అదే బిల్లును పంపితే, ఆమోదించాలి. కానీ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. తమిళనాడు గవర్నర్‌ రవి నిబంధనలను పట్టించుకోలేదు. అయితే, రాజ్యాంగంలోని 200 నిబంధన కింద గవర్నర్‌ విచక్షణాధికారాన్ని ఉపయోగిస్తారన్నది ధర్మాసనం అభిప్రాయం. అలాంటి సమయాల్లో మంత్రి మండలి సలహా ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం లేదు. 361 అధికరణ కింద వారికి రక్షణ కవచం ఉన్నప్పటికీ సుదీర్ఘమైన ఆలస్యం జరిగినప్పుడు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయవచ్చని తెలిపింది.

తన పరిశీలనకు వచ్చిన ప్రతి బిల్లుపై రాష్ట్రపతి రాజ్యాగంలోని 143వ అధికరణం కింద సుప్రీంకోర్టు సలహా కోరనవసరం లేదు. గవర్నర్లు నిరవధికంగా ఒక బిల్లును తమ వద్ద ఉంచుకోరాదనేదే ప్రధానం. అందువల్ల పరిమితమైన న్యాయ సవిూక్ష ఉండవచ్చని రాజ్యాంగ ధర్మాసనం తన ఏకగ్రీవ తీర్పులో అభిప్రాయపడింది. డెడ్‌లైన్‌ పెట్టి, ఆలోగా ఆమోదం ఇవ్వకపోతే లభించినట్లుగానే భావించడం రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి భంగం కలిగిస్తుందని తెలిపింది.

ఇకిప్పుడు గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ ఎంతకాలమనేదే సమస్య. దానికి కూడా పరిమిత కాలం ఉండకపోతే ఎలా? అందుకే పార్లమెంట్‌ చర్చించాలి. అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News