సూటూ, బూటూ గదేనుల్లా… బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది. బూరు మిఠాయి లెక్క అయితది. సూత్తానికి గలీజుగుంటది. మరి గదానికి గూడ ఇకమతు ఉందుల్లా?

పిండినంక బట్టలు ఆరేత్తం కద? గప్పుడు ఒక లాట్నీ తీసుకోవాలె. గ రొట్టెల కట్టెకు అటిటు కనిపించే బంక పేపర్ను తీసుకుని తిర్లమర్ల దానికి సుట్టాలె. ఇగ గా బూరు లేసిన అంగి, లాగులను పీట మీద రొట్టెను తాల్చినట్లు రుద్దాలె. గా బూరంత గా లాట్నీకి అంటుకుంటది. ఇగ గా అంగి, లాగులు నున్నగయితయి. ఎట్లుంది గీ ఇకమతు? మీరూ శేసి సూడండ్లి.

