గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST
ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA
డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP
ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS
భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD
లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు
వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్ రెడ్డి
తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్` తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి వీరంతా లొంగిపోయారు. ములుగు, భూపాలపల్లి విÖదుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోతున్నట్లు ప్రకటించారు.అనంతరం సరిహద్దుల నుంచి పోలీసులు వీరిని వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. మావోయిస్టు నేత హిడ్మా గెరిల్లాను వదిలి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీకి వెళ్లిన తర్వాత బెటాలియన్ బాధ్యతలను బడ్సే దేవాకు, కేశాలుకు అప్పగించారు. అయితే, కొన్ని రోజులు కిందటే కమాండర్ దేవా.. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుపోయారు. ఆ తర్వాత బెటాలియన్ బాధ్యతలు నిర్వహిస్తున్న సోడిమల్ల కేశాలు సైతం తాజాగా శుక్రవారం లొంగిపోయారు. ఇతనికి సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ వంటి పేర్లున్నాయి. ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రెస్ విÖట్ నిర్వహించారు.మొత్తం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయినట్లు తెలిపారు. వీరిలో గెరిల్లా బెటాలియన్ కమాండర్ సోడిమల్ల అలియాస్ కేశాలు అలియాస్ నిఖిల్ ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పోలీసుల ఎదుట ఆయుధాలు, బంగారంతో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. 36 తుపాకులు, ఐదు ఏకే 47లు, నాలుగు ఎసఎలఆర్‌లు, 1,007 తూటాలతో పోలీసులు ముందు మావోలు లొంగిపోయినట్లు పేర్కొన్నారు. అలాగే 800 గ్రాముల బంగారం సైతం అప్పగించినట్లు వెల్లడించారు. వీరి లొంగుబాటుతో అత్యంత కీలకమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పూర్తిగా కనుమరుగైనట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.గత ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం 42 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు కూడా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ పెరగడంతో మావోయిస్టులు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణకు చెందివారు కాగా.. ఎక్కువమంది ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే. ‘లొంగిపోయిన వారికి పునరావాస ప్యాకేజీ కింద రూ.1.93 కోట్లు అందజేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యకార్డులు అందజేస్తాం. తెలంగాణకు చెందిన వాళ్లు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండేవారు. ఇప్ప్పుడు ఇద్దరున్నారు. స్టేట్ కమిటీలో తెలంగాణ వాళ్లు 24 మంది ఉండేవారు. ఇప్ప్పుడు ఇద్దరే ఉన్నారు. వాళ్లు కూడా లొంగిపోవాలని పిలుపునిస్తున్నాం అని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు.

