Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

నిబద్ధ, నిస్వార్థ రాజకీయ నేత సురవరం!|EDITORIAL

నేటి స్వార్థ రాజకీయాల్లో నిస్వార్థంగా నేనున్నానని చెప్పుకోదగిన ఉదాత్త రాజకీయవేత్త సురవరం సుధాకర్‌ రెడ్డి. ఆజన్మాంతం సామాన్యుడిగానే ఉంటూ, అసామాన్య రాజకీయ ప్రతిభను ప్రదర్శించిన వ్యక్తి ఆయన. దేశం గర్వించదగ్గ సురవరం మన తెలుగువాడు, తెలంగాణవాడు కావడం మనకు గర్వకారణం.

కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉంటూనే సురవరం సుధాకర్ రెడ్డి, దేశ రాజకీయాల్లో ప్రభావశీలమైన ముద్రవేశారు. అయితే, కమ్యూనిస్టులు ఏకం కావాలన్న ఆయన కోరిక మాత్రం తీరకుండానే పోయారు. ఎప్పుడూ ప్రజా సమస్యలతోనే ఆయన జీవితం ముడిపడి ఉండేది. తెలంగాణ కమ్యూనిస్టు దిగ్గజాలలో గతేడాది సీతారాం ఏచూరిని కోల్పోయాం. ఏడాదిలోపే ఇప్పుడు సురవరంను కోల్పోయాం. జాతీయ రాజకీయాల్లో తెలుగువారు కనుమరుగు అవుతున్నారు. గట్టిగా నిలబడే నేతలు లేకుండా పోతున్నారు. ఈ క్రమంలోనే సురవం, వృధ్ధాప్య అనారోగ్య కారణాలతో మనలను వీడిపోయారు.

ఆయన రాజకీయాల్లో అజాతశత్రువు. అంతకు మించిన నిస్వార్థం ఆయనకు ఆభరణం. పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన తెలంగాణ ముద్దుబిడ్డ. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌ రెడ్డి సమస్యలు ఎక్కడున్నా వాటి పరిష్కారానికై పోరాడేందుకు ఎప్పుడూ ముందుండే వారు. సమస్యలపై ఎంత గట్టిగా పోరాడేవారో ఆయన అంతకుమంచి సౌమ్యుడు. ఆయన సౌమ్యత్వానికి, పోరాటానికి పొంతన ఉండేది కాదు. కానీ జన్మతః వచ్చిన మృదు స్వభావం కారణంగా ఆయన అజాత శతృవు అయ్యారేమో అనిపిస్తుంది. ఆయన మాట్లాడినంత సేపు ఇంకా వినాలనిపిస్తుంది. సాదాసీదాగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో చెలామణి కావడం చాలా కష్టం. కానీ అది సాధ్యమని రుజువు చేసిన దిగ్గజనేత సురవం. తెలంగాణ వైతాళికుడు, గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు సురవరం ప్రతాపరెడ్డి తమ్ముడు స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటరామిరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి. అటు తండ్రి, ఇటు పెదనాన్న వారసత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు. ఒకవైపు పెదనాన్న సాంస్కృతిక ఉద్యమ ఆదర్శాలను, మరోవైపు తండ్రి స్వాతంత్య పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సుధాకర్‌రెడ్డి, చిన్న వయసులోనే సమస్యలపై పోరుబాట పట్టిన తీరు అమోఘం. కర్నూలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్‌ వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై నిరసన చేపట్టారు. అది ఉద్యమంగా మారి, నగరంలోని మిగతా విద్యాలయాలకు వ్యాపించింది. అన్ని స్కూల్స్ కి అవి సమకూరాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా సురవరం ఎదిగారు. దివంగత జైపాల్‌ రెడ్డితో పాటు ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో రాటుదేలారు. ఎన్నో వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారు. రెండుసార్లు నల్గొండ పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన సురవరం సుధాకర్‌ రెడ్డి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడనిపించుకున్నారు. పోరాటలు, ప్రజా ఉద్యమాల పట్ల ఉన్న నిబద్దత కారణంగా ప్రజానేతగా సురవరం గొప్ప పేరు సంపాదించుకున్నారు. పీడిత వర్గాల అభ్యున్నతి కోసం జీవితకాలం కృషి చేశారు.

తెలంగాణ ఉద్యమంతో ఆయనది విడదీయరాని అనుబంధం. ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. మూడు దఫాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2000లో విద్యుత్‌ బిల్లుల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన పోరాటంలో సురవరం ది ముఖ్యమైన పాత్ర. చండ్రరాజేశ్వరరావు తరువాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 1960లో ఏఐఎస్‌ఎఫ్‌ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆతర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1962లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. ఈ కమిటీ- 62రోజుల పాటు- చేసిన సమ్మెకు నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1965లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చదువుతున్న సమయంలో కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధానకార్యదర్శి అయ్యారు. దీంతో ఆయన దిల్లీకి మకాం మార్చారు. 1969లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. 1970లో ఏఐఎస్‌ఎఫ్‌, 1972లో ఏఐవైఎఫ్‌నకు జాతీయ అధ్యక్షుడయ్యారు. 1971లో కేరళలోని కొచ్చిన్‌లో జరిగిన సీపీఐ 9వ నేషనల్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో జాతీయ కమిటీ- సభ్యుడయ్యారు. 1974లో తిరిగి ఆంధప్రదేశ్‌కు వచ్చిన సురవరం ఆనాటి నుంచి 1984 వరకు సీపీఐ ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1985, 90లో కొల్లాపూర్‌ అసెంబ్లీ నుంచి సురవరం సుధాకర్‌ రెడ్డి పోటీ- చేసి ఓడిపోయారు. 1994లో కర్నూలులోని డోన్‌లో అప్పటి సీఎం విజయ భాస్కర్‌రెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. 1998లో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కినా, ఒదిగే ఉన్నారు. ఇంతటి ఉన్నత లక్షణాలు, ఉదాత్త ఆశయాలు కలిగిన సురవరం మనవాడు కావడం మన అదృష్టం అయితే, మనకు లేకుండా పోవడం మన దురదృష్టం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News