Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

నిరంకుశం వైపు ప్రజాస్వామ్యం పరుగులు!|EDITORIAL

ప్రజలు, వారి ప్రతినిధుల ద్వారా ప్రజల కోసమే జరిగే పరిపాలన ప్రజాస్వామ్యం. రాను రాను ప్రజాస్వామ్యం నిరంకుశం వైపు పరుగులు పెడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన నేతలు, నిరంకుశంగా పాలించడం, నిరపేక్షంగా అధికారాన్ని చెలాయించడం చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థ నింరకుశంవైపు, నిరంకుశాలు నియంతృత్వంగా మారుతుండటం విచారకరం. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం చేత అధికారాలు కేంద్రీకృతమై, ప్రజల స్వేఛ్ఛా హక్కులను హరించడమే దీని ఉద్దేశ్యం. ఇది ప్రజాభిప్రాయాన్ని అణచివేస్తుంది. వివిధ సంస్థలను హస్తగతం చేసుకుని, ప్రజాస్వామ్యంలో ఈ నిరంకుశ ప్రవృత్తి మెల్లగా ప్రబలడం ఎంతో ప్రమాదకరం.
ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను మరిచి, అధికారంలోకి వచ్చాక తమ స్వంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం.. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి సంస్థలను కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అధికారాన్ని నిలుపుకోవడం.. హక్కుల కోసం పోరాటాలు, నిరసనలు జరగకుండా అణచివేయడం.. భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా ముద్రవేసి, విపక్షాలను విచారణల పేరుతో వేదించడం.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని అణచడానికి న్యాయ వ్యవస్థను లేదా చట్టాలను ఉపయోగించడం వంటివన్నీ నిరంకుశ ధోరణులే. దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి, స్థిరత్వం వంటి నినాదాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారు. హిట్లర్ తరహాలోనే వీరు వ్యవహరిస్తున్నారు. శాసన సభలను రద్దు చేయడం, గవర్నర్ల వ్యవస్థను వాడుకోవడం, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు వంటి చర్యలన్నీ ప్రజాస్వామ్య బలహీనతలుగా చూడాలి.
బలమైన పౌర సమాజం ఏర్పడాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెరగాలి. హక్కుల విషయంలో గళమెత్తే శక్తిని ప్రజలు కలిగి ఉండాలి. ప్రశ్నించే మీడియా ఉంటే ప్రభుత్వ చర్యలు ప్రజలకు స్పష్టమవుతాయి. ప్రభుత్వానికి అతీతంగా స్వతంత్రంగా న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ఓటు హక్కును వినియోగించడమే కాక, ప్రభుత్వ చర్యలను గమనిస్తూ, ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలు చూపాలి. అప్పుడే నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయవచ్చు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్ లో ప్రస్తుతం ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుత రాజకీయ వాతావరణం కనిపించకుండా పోతోంది. అధికారం చేపట్టిన నేతలు నిరంకుశమనే విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారు. అన్ని వ్యవస్థలతో పాటు మీడియా పైనా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. మీడియాపై ఆంక్షలు, కక్ష సాధింపులు, అక్రమ కేసులు, అరెస్టుల దాకా వెళుతున్నారు. సొంత మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ, సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. మోదీ, మమతా బెనర్జీ, నిన్న మెన్నటి దాకా కేసీఆర్‌, జగన్‌ వంటి వాళ్లంతా అహంకార పూరితంగా పరిపాలకులుగా చరిత్రలో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు, వారిచ్చే ఓటుతో గెలిచి సుపరిపాలన అందించాలి. ఓట్లేయించుకోవడం, వేసుకోవడం ఎలాగో తెలుసుకుని రాజ్యమేలుతున్న మన రాజకీయ నేతలు అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తున్నారు. ప్రజలను పురుగుల్లా చూస్తున్నారు. పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ఇలా జరుగుతుందని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఊహించి ఉండరు. లేకుంటే ఎక్కడో అక్కడ ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేవారేమో!
దేశంలో ఉక్కు మహిళగా పేరున్న ఇందిరా గాంధీ కాలంలోనూ, ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, వైఎస్ లాంటి నేతలు కూడా ఇంత నిరంకుశంగా పాలించ లేదు. ప్రజా సంక్షేమం పేరుతో, డబ్బుల పందేరంతో ఖాజానాను ఊడ్చేస్తున్న నాయకులు ఎప్పటికైనా జవాబుదారీగా ఉండాల్సిందే. అధికారంలో ఉన్న వారు నిజంగా మంచి పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు. వారిని ఆదరిస్తారు. లేదంటే అత: పాతాళానికి తొక్కేస్తారు.
ప్రజాస్వామ్యానికి అసలైన శక్తి ప్రజలే. అయితే ప్రజల మౌనం, ఓటింగ్ పై ఆసక్తి లేకపోవడం, వ్యక్తిగత లాభం కోసమే ఓట్లేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యానికి చేటు, నిరంకుశత్వానికి బలం చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే ప్రజలు చైతన్యంగా ఉండాలి. పాలకులను ప్రశ్నించగలగాలి. లేదంటే ప్రజాస్వామ్యం నెమ్మదిగా నియంతృత్వాన్ని సంతరించకోవడం ఖాయం.
…..

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News