Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పాకిస్తాన్ ద్వంద్వ నీతి!|EDITORIAL

భారత-పాకిస్తాన్ సంబంధాలు ఉద్రిక్తతలతో కూడుకుని ఉంటాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. పాక్ అదే పనిగా చేస్తున్న సరిహద్దు ఉల్లంఘనలు, ఉగ్రవాద ప్రోత్సాహం, ఆక్రమిత కశ్మీర్ వంటి అంశాలు దాయాదుల మధ్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయి. పహల్గాం సంఘటన తర్వాత ఉత్పన్నమైన యుద్ధం కారణంగా పాకిస్తాన్ బాగా దెబ్బతింది. కాళ్ళ బేరానికి వచ్చి, బతిమిలాడుకుంటే పాక్ అభ్యర్థనను మన్నించి భారత్ యుద్ధ విరమణకు ఒప్పుకుంది. చావు తప్పి కళ్ళు లొట్టబోయిన పాక్ తన దుర్బుద్ధిని వీడలేకపోతున్నది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది. అమెరికా అండ చూసుకుని విర్రవీగుతున్నది.
పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపేస్తూ భారత్ నిర్ణయించింది. ఓ వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు తమకు సింధూ జలాలను విడుదల చేయాలని ఆ దేశ విదేశాంగ శాఖ భారత్ ను వేడుకుంటోంది. పాక్ విదేశాంగ శాఖ భారత్ కు ఈ మేరకు ఓ అభ్యర్థనను పంపింది. సింధూ జలాల ఒప్పందాన్ని నమ్మకంగా, న్యాయ బద్ధంగా కొనసాగించాలని కోరుతున్నది.

మరోవైపు పాక్ ఆర్మీ చీఫ్ భారత్ పై నోరు పారేసుకున్నారు. అణు హెచ్చరికలు చేశారు. ‘భారత్ అనేది హై వేపై వస్తున్న మెర్సీడెస్ కారు లాంటిది. కానీ, పాక్ మాత్రం కంకరతో నిండిన ఓ డంప్ లారీ లాంటిది. ఒక వేళ కారు వచ్చి లారీని ఢీ కొంటే ఎవరికి నష్టం? ’ అని పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. పిరికి పంద బెదిరింపులు, సింధు నీటిని నిలిపివేస్తే యుద్ధం తప్ప మరో గత్యంతరం లేదని ఉత్తర ప్రగల్బాల ఉత్తుత్తి పిచ్చి హెచ్చరికలు చేస్తున్నది. మరోవైపు సింధు జలాలను విడుదల చేయాలని అభ్యర్థిస్తున్నది.

భారత్‌పై యుద్ధ హెచ్చరికలు పాక్ ప్రజల్లో జాతీయ భావాలను రగిలించడానికి ఉపయోగపడుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, వనరుల కొరత, ముఖ్యంగా నీటి సమస్యను ఎదుర్కొంటోంది. పాక్‌లోని వ్యవసాయం పూర్తిగా సింధు నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడి ఉంది. సింధు, జీలం, చెనాబ్ నదులు భారత ఉపఖండంలోని హిమాలయాల నుంచి ఉద్భవించి పాకిస్తాన్ వైపు ప్రవహిస్తాయి. 1960లో భారత్-పాక్‌ల మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ నదుల నీటి వినియోగానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. భారత్ తూర్పు నదులైన రవి, బియాస్, సట్లెజ్‌ను వినియోగించుకోగా, పాక్‌కు పశ్చిమ నదులైన సింధు, జీలం, చెనాబ్ నీటిని వినియోగించే హక్కు లభించింది. ఈ ఒప్పందం వల్ల పాక్ వ్యవసాయం సాగదీసుకోగలిగింది. అయితే, గత కొన్నేళ్లుగా వాతావరణ మార్పులు, మంచు కరుగుదల తగ్గడం, వర్షపాతం లోపం వంటి కారణాల వల్ల ఈ నదులలో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. ఇప్పటికే 15శాతం నీరు తగ్గింది. 21శాతం తగ్గుతుందని పాక్ అంచనా వేసింది. పంటలు పండకపోతే తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం పాక్ కు పొంచి ఉంది.

ఇటీవల పాక్ ప్రభుత్వం, నీటి మేనేజ్మెంట్ సంస్థలు భారత్‌తో నీటి పంపిణీపై పునరాలోచన కోరుతూ పలు సమావేశాలు జరిపాయి. వారు భారత్ నుంచి సాంకేతిక సహాయం, సమాచారం, కొన్ని సందర్భాల్లో అదనపు నీటి విడుదలకూ అభ్యర్థించారు. ఇదే సమయంలో, వారి సైనిక నాయకత్వం మీడియా ముందు “భారత్‌తో ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం” అనే ప్రకటనలు చేస్తోంది. ఈ రెండు విభిన్న ధోరణులు పాక్‌లోని ద్వంద్వ వైఖరిని బయటపెడుతున్నాయి.

భారత్ పక్షాన చూస్తే, సింధు జలాల ఒప్పందం ఇప్పటికీ గౌరవప్రదంగానే అమలు అవుతోంది. భారత్ తన భాగం నీటిని మాత్రమే వినియోగించి, మిగతా నీటిని ఒప్పందం ప్రకారం పాక్ వైపు వదులుతోంది. అంతర్జాతీయంగా కూడా భారత్ ఈ ఒప్పందాన్ని పాటిస్తున్న బాధ్యతాయుత దేశంగా గుర్తింపు పొందింది. కానీ పాక్ మాత్రం తరచుగా భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నీటిని ఆయుధంగా వాడుతున్నట్లు ప్రచారం చేస్తోంది. ఇది వారి అంతర్గత రాజకీయ ప్రయోజనాలకు, ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది.

నిజానికి పాక్ ఆర్థిక దుస్థితి, అంతర్జాతీయ రుణ భారం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. ఈ అసంతృప్తిని కట్టడి చేయడానికి వారి నాయకులు యుద్ధ ప్రకటనలు చేసి జాతీయవాద వాదాన్ని పెంచుతున్నారు. అయితే వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం భారత్ సహకారాన్ని కోరడం, పాక్ పరిస్థితి ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోంది. యుద్ధం ద్వారా ఏ సమస్యలూ పరిష్కరించబడవు. పైగా, నీటిలాంటి ప్రాణాధార వనరులో భారత్‌పై ఆధారపడే దేశం, యుద్ధాన్ని సవాలు చేయడం వ్యూహపరంగా, రాజకీయపరంగా అతి తెలివి, అవివేకానికి నిదర్శనం.

ఈ నేపథ్యంలో, పాక్ నాయకత్వం తాత్కాలిక రాజకీయ లాభాల కోసం యుద్ధ హెచ్చరికలు చేయకుండా, ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టడం ఆ దేశానికి అవసరం. నీటి సంక్షోభం వాతావరణ మార్పుల ప్రభావంతో మరింత తీవ్రమవుతుంది. కాబట్టి భారత్‌తో సహకారం, నది నిర్వహణలో సాంకేతిక మార్పులు, నీటి సంరక్షణ విధానాలు, అంతర్గత మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి దీర్ఘకాలిక పరిష్కారాలే వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మొత్తంగా, పాక్ ప్రస్తుత వైఖరి అంతర్జాతీయ వేదికపై ద్వంద్వ నీతిగా కనిపిస్తోంది. ఒకవైపు యుద్ధ బెదిరింపులు, మరోవైపు నీటి కోసం అభ్యర్థనలు ఈ విరుద్ధ స్వరాలు వారి రాజకీయ బలహీనత, ఆర్థిక క్షీణతను వెల్లడిస్తున్నాయి. భారత్‌కు వ్యతిరేకంగా నిరంతరంగా శత్రుత్వ ధోరణి ప్రదర్శించడం కంటే, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించడమొక్కటే రెండు దేశాల ప్రజలకు శాంతి, అభివృద్ధిని అందించగల మంచి మార్గం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News