Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

విపత్తుల నిర్వహణ పెను సవాల్!|EDITORIAL

ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. విపత్తులు సంభవించినప్పుడు, దాని నిర్వహణ ఇప్పుడు ఇక్కడ రాసినంత, మీరు చదువుతున్నంత, ఎవరైనా మాట్లాడినంత ఈజీ కాదు. వ్యయ ప్రయాసలతోపాటు ముందస్తు ప్రణాళికలతో కూడినది. విపత్తుల నిర్వహణ ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికైనా సమస్యే. పెను సవాలే. విపత్తుల నిర్వహణకు మన దేశంలో ప్రస్తుతం ఎన్డీఎప్ లాంటి వ్యవస్థలున్నప్పటికీ, అవి సరిపోవడంలేదు. విపత్తులు జరిగినప్పుడే వాటి ప్రాధాన్యత అర్థమవుతుంది. మిగతా సమయాల్లో అవి ఉన్నాయా? లేదా? అన్నంతగా ఉంటాయి. అలాగని వీటిని నిర్లక్ష్యం చేయలేం. చేయకూడదు.
విపత్తుల సమయంలో సకాలంలో స్పందించేలా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విపత్తు నిర్వహణకు కూడా ఆర్మీలాంటి దళాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మంచిది. భూకంపాలు, అగ్నిప్రమాలు, వరదలు లాంటి ప్రమాదాల సమయాల్లో తక్షణం స్పందించేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడ ఏ మూల ప్రమాదం జరిగినా సహాయక చర్యలకు దిగేలా తీర్చిదిద్దాలి. ఇలాంటి దళాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్థిక సంపత్తిని కూడా కట్టబెడితే మంచిది. దీనిద్వారా విపత్తు నిర్వహణతో పాటు, నిరుద్యోగ సమస్యకూడా కొంతమేర తీరవచ్చు.
విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర, రాష్టాల్రు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి. అలాగే దీనిని సైన్యంలో ఒక భాగంగా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. భారత్‌ లాంటి దేశానికి ఇది తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన అనేక విప్తతులను దృష్టిలో పెట్టుకుని తగిన తర్ఫీదు ఇచ్చి స్వయం శక్తిగా దీనిని రూపొదించాలి. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి ఉపద్రవం వచ్చిపడినా తక్షణం రంగంలోకి దిగేలా అన్ని రాష్టాల్ల్రో సన్నద్దంగా ఉండేలా చూడాలి. ఈ దిశగా ఆలోచ నలు చేసి ఆచరణకు సిద్ధపడాలి. ప్రస్తుతం ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలను దానిని మరితంగా పటిష్టం చేయాలి. దీనికి ఆర్టీ తరహా వ్యవస్థ అవసరం ఉంది. దేశంలో ఏ మూల ఎలాంటి ఉపద్రవం ముంచుకుని వచ్చినా సకాలంలో చేరుకుని సేవలు అందించే విధంగా తయారు కావాల్సి ఉంది. రైలు ప్రమాదాలు కావచ్చ. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో సకాలంలో సత్వర సేవలు అందించే వీలు కలుగుతుంది. ఇటీవలి వరదలు, రైలు ప్రమాదాలు చూశాక శిక్షిత సిబ్బంది అవసరముందని తెలుస్తోంది. దానికి సాంకేతికంగా సహాయ సహకారం అందించాలి. ప్రస్తుతానికి విపత్తులను ఎదుర్కోవడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరించిన మార్గాలే ఇప్పుడు శరణ్యంగా మారాయి. ఈ దుస్థితి పోవాలంటే ఓ అత్యున్నత వ్యవస్థ అవసరం అన్నది గుర్తించాలి. కేంద్ర రాష్ట్రాలు ఇందుకు ముందుకు రావాలి. ఉమ్మడిగా వ్యవస్థను తయారు చేసుకోవాలి. దీనిని ఆర్మీలో భాగంగా చేస్తే మరీ మంచిది. సాధారణ ఆర్మీ ఇలాంటి సమయాల్లో అంతగా పనిచేయకపోవచ్చు. కానీ అప్పుడు ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా రంగంలోకి దిగేలా అవకాశం ఉంటుంది.

ఏటా దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల మూలంగా పెద్దయెత్తున నీరు వచ్చి చేరుతుండడంతో ప్రధానమైన డ్యాముల గేట్లను తెరవాల్సి రావడంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. విపత్తుల సమయంలో స్వతంత్ర వ్యవస్థ రంగంలోకి దిగి ప్రజలను కాపాడడంతో పాటు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేలా ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండదు. హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో ఏటా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రజాజీవనం అతలాకుతలం అవుతున్నాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, విరిగిపడుతున్న కొండ చరియలు, తెగిపోయిన రోడ్లు సాధారణ పౌర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సకాలంలో సహాయక శిబిరాలకు తరలించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం అన్నది ఇలాంటి సమయాల్లో ముఖ్యం. పునరావాస శిబిరాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం, మందులు వంటి కనీస సదుపాయాలు కల్పించడం, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రత్యేక యంత్రాంగం ఉండివుంటే వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టే వీలుంటుంది. ప్రస్తుత వ్యవస్థలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర విపత్తు, సహాయక బృందాలు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన భూమిక రాష్టాల్రదిగానే ఉంటోంది. అలాగాకుండా వ్యవస్థ ఉంటే సాయం కోసం కేంద్రంవైపు చూడాల్సిన ఆగత్యం రాదు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, చలన చిత్ర పరిశ్రమ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలందిస్తున్నారు.

అయితే ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి విపత్తులు సర్వ సాధారణంగా మారిన దశలో ప్రత్యేక,శాశ్వత ఏర్పాటు అవసరాన్ని గుర్తించాలి. అసాధారణ వరదలు కావడంతో పెద్దయెత్తున ఆస్తినష్టం కలిగించాయి. ఇటీవలి వరదల్లో వేల ఎకరాల్లో పంటలు తుడిచి పెట్టుకునిపోయాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ, సహాయక అథారిటీని పటిష్టపరచినప్పటికీ ఇప్పుడు సంభవించిన విపత్తు అసాధారణమైనది. దీనిని ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. అయినా, పరిస్థితి తీవ్రతకు మించిన వేగంతో ప్రభుత్వం కదిలింది. నదికి ఇరువైపులా వున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ఇకపోతే విపత్తు బృందం ఉంటే నష్టం అంచనా కూడా వెంటనే గుర్తించవచ్చు. లేకుంటే కేంద్రబృందం ఎప్పుడో రావడం…పోటోలు చూడడం.. అంచనా వేయడం జరుగుతోంది. అలా గాకుండా వెంటనే నష్టం అంచనాలు కూడా జరిగిపోవాలి. సహాయక చర్యలతో పాటు పునరావాస చర్యల్లో కూడా ఈ బృందాలు పాల్గొనేలా చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలతో పాటు సకాలంలో సాయం అందగలదు.
…..

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News