Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పురుగుల మందే రైతుకు పెరుగన్నమాయెనా!|EDITORIAL

ఎద్దు ఏడ్చిన ఎవుసం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు? ఆరుగాలం కష్టపడే రైతు అంతకు ఎందుకు తెగిస్తున్నాడు? ప్రక్రుతి వైపరీత్యాలకు, ఏటికి ఎదురీదే రైతు ఎందుకు అప్పుల పాలవుతున్నాడు? అసలు రైతు ఆత్మహత్యకు పురికొల్పుతున్న అంశాలేంటి? మరి ప్రభుత్వాలు గొప్పగా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, పంట పెట్టుబడులు అందిస్తున్నామని, రుణమాఫీలు చేస్తున్నామని ప్రకటించుకుంటున్నాయి కదా? నీటి తీరువా రద్దు, ఉచిత విద్యుత్‌ సౌకర్యాలు కూడా అందిస్తున్నాయి కదా? ఇన్ని చేసినా రైతు కంట కన్నీరెందుకు? రైతు ఇంట చావులెందుకు? దళారుల ఇంట పన్నీరెందుకు?

దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో 11శాతం రైతులవే. ప్రతి లక్ష మంది జనాభా కు 1.4 శాతం మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దక్షిణాదిలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. పంట నష్టం, దివాళా, వ్యవసాయ సంబంధ సమస్యలు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని కేంద్రం విశ్లేషించింది. మనదేశం వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో దాదాపు 83 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. 70 శాతం గ్రామీణ మహిళలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు. 1991లో వచ్చిన సంస్కరణల తర్వాత మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్‌ కైమ్ర్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు చనిపోతున్నాడు.

రోజురోజుకు వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి. యాంత్రీకరణ పెరిగింది. సాంకేతికత వినియోగం కూడా జరుగుతున్నది. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు, పెట్టుబడులు పెరిగాయి. దిగుబడులు తగ్గాయి. కూలీ రేట్లు అధికమయ్యాయి. అతివ్రుష్టి, అనావ్రుష్టి, ప్రక్రుతి వైపరీత్యాలు, వాతావరణ దుష్పరిణామాలు వంటివి కూడా కర్షకుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కమతాలు చిన్నవిగా మారుతున్నాయి. సాగునీరు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పేద రైతులు అప్పులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. పెళ్ళిళ్ళు, పండుగలు పబ్బాల ఖర్చులు, ఆనారోగ్యాలు, ప్రమాదాల వైద్య వ్యయాలు ఎక్కువయ్యాయి. వడ్డీరేట్లు పెరిగి, తక్కువ సమయంలోనే అప్పులు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి దఫా అప్పు చెల్లించక పోవడంతో రెండోదఫా నిరాకరించడం, ప్రభుత్వాలు, బ్యాంకర్లు రైతులకు ఇవ్వాల్సిన రుణాలను ఇతర రంగాలకు మళ్లించడం వంటివి కూడా సమస్యలుగా మారుతున్నాయి. రైతులకు కొంత మొత్తంలోనే రుణాలిచ్చిన బ్యాంకులు రుణమాఫీని కూడా క్రమశిక్షణా రాహిత్యంగా చూపుతున్నాయి. జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నాడు. రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక వ్యవసాయ వృత్తిలోనే కూరుకు పోవడంతో రైతు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అప్పు సామాజికంగా రైతును కుంగదీస్తుంది. తనకు వచ్చే ఆదాయంతో అప్పు తీర్చలేకపోతున్నాడు. గతంలోలా ఇంటిల్లిపాది వ్యవసాయ పనుల్లో పాలుపంచుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. దీంతో కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేక.. పరువు పోతోందనే ఆవేదనతో నిస్సహాయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మరి ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి? ఈ భూమ్మీద ప్రతి ఉత్పత్తిదారు తమ ఉత్పత్తులకు తామే ధరలు నిర్ణయించి విక్రయిస్తుండగా, ఒక్క రైతు మాత్రమే తమ పంటల ఉత్పత్తులకు వేరోకరు నిర్ణయించిన ధరలకు తెగనమ్ముకుంటున్నాడు. అదే అసలు సమస్య. అయితే, దీన్నే పంటలకు గిట్టుబాటు ధరను కల్పించడం అంటున్నాం. పెట్టుబడులు పోను, లాభాలతో మిగతా అన్ని వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముడవుతున్నప్పుడు రైతులు పండించిన ధాన్యాలు ఎందుకు లాభంపై విక్రయించకూడదు? రైతు హక్కులు కూడా మానవ హక్కులే. దానిపై ఒక సమగ్ర విధాన రూపకల్పన జరగడం లేదు. వ్యవస్థాగత రుణాలు కల్పించాలి. రైతులకు సరైన శిక్షణ ఇచ్చి లాభాలు పొందేటట్టు చేయాలి. సామాజికంగా పౌరులు, మీడియా, ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సమస్యలను తీవ్రమైన, ముఖ్యమైన అంశంగా పరిగణించి ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

వ్యవసాయం అసంఘటిత రంగంలో ఉండటంతో పథకాలు కూడా లబ్ధిదారులకు సరిగా చేరడం లేదు. ఆశించిన ఫలితాలు రావడం లేదు. తెలంగాణలో రుణమాఫీ, రైతు భరోసా లాంటి పథకాలు, ఏపీలో అన్నదాతకు ఆర్థిక సాయం అందుతోంది. అయినా రైతులు నిలదొక్కుకోలేకపోతున్నారు. హరిత విప్లవం తర్వాత దిగుబడి పెరిగినా, ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. పంటల మార్కెటింగ్ మరో సమస్య. మార్కెట్లల్లో తీవ్ర అవినీతిని ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర దక్కడం లేదు. వ్యవసాయం రంగంలోని మహిళల సంక్షేమానికి దిక్కులేదు. రుణాలు, రుణ హామీలు, రుణ బదిలీలు, రుణ మాఫీలకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు, బ్యాంకులు జవాబుదారీగా వ్యవహరించాలి. వ్యవసానుబంధ రంగాలను ప్రోత్సహించాలి. కోళ్ళు, పశువులు, కూరగాయల సాగను ప్రోత్సహించాలి. వీటికి మార్కెటింగ్ ను కల్పించాలి. రైతు సమస్యల పరిష్కారం లక్ష్యంగా 2004లో ఏర్పాటు చేసిన స్వామినాథన్‌ కమిషన్‌ సూచనలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు రైతు ఆత్మహత్యలను సీరియస్ గా తీసుకుంది. రైతులు చనిపోయాక పరిహారం ఇచ్చి అదే పరిష్కారం అనుకోవడమే తప్పని సూత్రీకరించింది.

అయితే సంక్షోభాల నివారణకు శాస్త్రీయ దృక్పథం అవసరం. అప్పుడే వ్యవసాయం పురోగమించ గలదు. ఆత్మహత్యలను నిరోధించగలం. ఉత్పత్తిని పెంచగలం. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన భాగస్వామిని చేయగలం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News