Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

సామాన్యుడి ఊసే లేని సంస్కరణల బడ్జెట్!?|EDITORIAL

దేశ ప్రజల ఆకలి బాధలు, జీవన ప్రమాణాల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను పట్టించుకోకుండానే కేంద్ర ప్రభుత్వం మరోసారి బడ్జెట్‌ను యథావిధిగా ప్రవేశపెట్టింది. రూ. 53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ కాగితాల మీద భారీగా కనిపించినా, సామాన్య ప్రజల జీవితాల్లో ప్రతిఫలించేదేమిటి? గత తొమ్మిదేళ్లుగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థలో సమతౌల్య అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఆస్కారమే లేకుండా పోతోంది.

ప్రస్తుతం దేశంలో ఎదురవుతున్న ప్రధాన సమస్య ఆర్థిక మందగమనం. జాతీయ స్థాయిలో వినియోగం తగ్గిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఔషధాల వరకు ధరలు విపరీతంగా పెరిగాయి. కోవిడ్‌ అనంతరం, కొన్ని కీలక ఔషధాల ధరలు 200 నుంచి 500 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్‌ డేటా సూచిస్తోంది. ఫలితంగా వైద్యం చేయించుకోవడం దూరమైతే, కనీసం మందులు కొనుగోలు చేసే స్థితిలోనూ సామాన్యుడు లేకుండా పోయాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిజంగా ప్రగతిశీలమైతే, దాని ప్రభావం ప్రజల జీవితాల్లో కనిపించాలి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆశించిన మార్పు రావడం లేదు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడంతో గ్రామాల నుంచి పట్టణాల వైపు వలసలు పెరుగుతున్నాయి. సంపాదించిన ఆదాయం తిండికే సరిపోని పరిస్థితి విస్తరిస్తోంది. గ్రామీణ వినియోగం తగ్గిన తీరే ఇందుకు నిదర్శనం.

ఈ బడ్జెట్‌లో మరో ప్రధాన అంశం ఆర్థిక క్రమశిక్షణ. కార్పొరేట్లు, కోటీశ్వరులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సినప్పుడు ఈ క్రమశిక్షణ గుర్తుకు రాలేదు. కానీ కార్మికులు, రైతులు, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ వ్యయాలు పెంచాల్సిన సందర్భంలో మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముందుకు వచ్చింది. ఫలితంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి రంగాలకు కేటాయింపుల్లో కోతలు పడ్డాయి. మహిళా సంక్షేమం కోసం ఉద్దేశించిన జెండర్ బడ్జెట్‌ నిధుల్లోనూ కోత పడటం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తోంది.

బడ్జెట్‌పై ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ఆర్థిక సంస్కరణలకు మద్దతు ఇచ్చే నిపుణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయాల పెరుగుదల తప్పవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిలో ఆదాయ పన్ను, జీఎస్టీ మార్పులతో కొంతమేర ఉపశమనం కల్పించిన ప్రభుత్వం, ఈసారి వాటి జోలికి వెళ్లకపోవడం మధ్యతరగతిపై భారాన్ని మరింత పెంచింది. పరోక్ష మినహాయింపులు ప్రకటించినా, అవి ప్రజల జేబుల్లోకి డబ్బు తెచ్చే స్థాయిలో ఉంటాయా? అన్నది అనుమానమే.

అయితే, బడ్జెట్‌లో కొన్ని ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. కేన్సర్‌ చికిత్సకు ఉపయోగించే 17 కీలక ఔషధాలపై దిగుమతి సుంకాల మినహాయింపు, అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మరో 7 ఔషధాలపై సుంకాల తగ్గింపు నిర్ణయం ఊరట కలిగించే అంశం. ఇవి ఔషధాల ధరలను తగ్గించి బాధితులకు ఉపశమనం కలిగించే అవకాశముంది. కానీ ఇది సమగ్ర ఆరోగ్య సంరక్షణ విధానానికి ప్రత్యామ్నాయం కాదన్నది గుర్తించాలి.

ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’, ‘మూడు కర్తవ్యాలు’ గత తొమ్మిదేళ్లుగా విన్న పదాలే. కానీ, వాటి ఫలితాలు గ్రామాల్లో, పేదల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? ఇంకా కోట్లాది మందికి ఉచిత బియ్యం అందించాల్సిన పరిస్థితి ఉంటే, దేశ ఆర్థిక బలం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఆలోచించాల్సిన అంశమే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను లోతుగా అర్థం చేసుకోకుండా, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని బడ్జెట్లు ప్రవేశపెట్టినా భారత పురోగతి కాగితాలకే పరిమితం అవుతుంది. ‘సంస్కరణల ఎక్స్ ప్రెస్’ వేగం పెరిగిందని చెప్పడం కంటే, ఆ ఎక్స్ ప్రెస్ ఎవరిని తీసుకెళ్తోంది? ఎవరిని వదిలేస్తోంది? అన్నదే తేలాల్సిన ప్రశ్న? మరి సమాధానం మన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా?

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News