Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

అవినీతిలో దొందూ దొందే!|EDITORIAL

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రజల ఆశలు, ఆకాంక్షలు రానురున తీవ్ర నిరాశగా మారుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు, వేర్వేరు రాజకీయ, పార్టీల, ప్రభుత్వాల ప్రయాణాలు సాగించినప్పటికీ, పాలనల ఫలితాలు మాత్రం ఒకేలా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలే కేంద్రంగా పాలన సాగుతోందన్న భావన బలపడుతోంది. అప్పుడు కేంద్రీకృతంగా, ఇప్పుడు వీకేంద్రీకరణ అవినీతి సాగుతున్నట్లుగా ఉంది. అధికార మార్పులు జరిగినా, పాలన ధోరణిలో మార్పు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం.

తెలంగాణలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి, అప్పులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అభివృద్ధి పేరుతో వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారన్న ఆరోపణలు నేటికీ కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అవినీతి అజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవలి నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బొగ్గుగని కోసం ఇద్దరు మంత్రులు కోట్లాడుకుంటున్నారని విమర్శలు చెలరేగాయి. కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు దక్కించుకోవడానికి కోమటిరెడ్డి, భట్టి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారని చివరకు తేలింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వచ్చిన ఆరోపణలు, ఆపై సింగరేణి నైనీ బొగ్గు టెండర్ల ప్రక్రియ రద్దు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అవినీతి జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేస్తే, మరి టెండర్లు ఎందుకు రద్దయ్యాయి? ప్రజాపాలనలో పారదర్శకతంటే ఇదేనా?

ఒక్క నైనీ టెండర్లే కాదు, రాష్ట్రంలో పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు, పరస్పర ఆరోపణలు, వీడియోల యుద్ధం రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు, లాభదాయకమైన శాఖలు, కాంట్రాక్టుల కోసం జరుగుతున్న కుమ్ములాటలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చుక్కాని లేని నావలా మారుస్తున్నాయి. పాలన కంటే రాజకీయ అంతర్గత పోరాటాల ప్రభావమే ఎక్కువగా కనిపిస్తున్నది.

మేడారం అభివృద్ధి పనుల టెండర్ల కాంట్రాక్టులపై మంత్రుల మధ్య విభేదాలు ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చాయి. దేవాదాయ శాఖ పనుల్లో ఇతర శాఖల మంత్రుల జోక్యంపై ఎఐసీసీ వరకు ఫిర్యాదులు వెళ్లడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ఉండాల్సిన దేవాలయాల అభివృద్ధి కూడా రాజకీయ లాభనష్టాల లెక్కల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కణతకు మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ గన్ను గురిపెట్టిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సష్టించిన విషయం తెలిసిందే.
మంత్రుల బాధ్యత కేవలం విమర్శలు చేయడం, గత ప్రభుత్వాన్ని నిందించడమే కాదు. తమ శాఖల్లో ఏం జరుగుతుందో పర్యవేక్షించడం కూడా. అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే విచారణకు ఆదేశించాలి. మంత్రులే ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం, అనుకూల మీడియా ద్వారా ఆరోపణలు చేయించుకోవడం, అధికారులను బలిపశువులుగా మార్చడం పరిపాటిగా మారింది.

ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పుకుంటున్న రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, పెన్షన్లు, ఉచిత బస్సు సౌకర్యాలు సంక్షేమంలో భాగమే కానీ, అవి సంపూర్ణ అభివృద్ధికి ప్రత్యామ్నాయాలు కావు. పాలనలో దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక, పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగ సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాల్లో స్పష్టమైన దృక్పథం కనిపించడం లేదు. అప్పులు చేసి సంక్షేమం చూపించడం తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం ఎప్పటికీ కాదు.

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తిచూపుతూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అదే తప్పులు పునరావృతం చేస్తే ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ‘కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగి’తే ఎవరికీ కనిపించకుండా పోదు. అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చకుండా, రాజకీయ కుమ్ములాటలతో కాలం గడిపితే తెలంగాణ మరింత భ్రష్టు పట్టడం ఖాయం.

చివరికి నష్టపోయేది ప్రజలే. అభివృద్ధి పక్కకు పోయి, అప్పుల భారం పెరిగితే భవిష్యత్ తరాలకు భారమవుతుంది. అవినీతిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది తీర్పు చెబుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుని, పారదర్శక పాలన దిశగా అడుగులు వేయకపోతే, ప్రజల చేతిలో పరాభవం తప్పదన్నది రాజకీయ సత్యం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News