Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

జల జగడాలు! రాజకీయ రగడాలు!!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంటోంది. సమస్య పరిష్కారానికి బదులు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. జీవాధారమైన జలాన్ని కూడా రాజకీయం చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అందుకు పూనుకున్న పార్టీల దివాలాకోరుతనం.
నీళ్ళు, నిధులు, ఉద్యోగాల కోసమే తెలంగాణ ఉద్యమం సాగింది. సాగు, తాగునీరే ఉద్యమానికి ఇంధనంగా పని చేశాయి. సాధారణంగా నీటి అంశంపై రెండు రాష్ట్రాల ప్రజలు అత్యంత సున్నితంగా స్పందిస్తారు. కరువు కాటకాల రాయలసీమ కూడా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. వాస్తవాలను పక్కనపెట్టి, రాజకీయ పార్టీలు సామరస్యతకు పాతరేసి, పరస్పర విద్వేషాల్ని పెంచేలా వ్యవహరిస్తున్నాయి.
పవర్ లో ఉంటే పట్టించుకోకుండా, ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం పార్టీలకు అలవాటుగా మారింది. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో బీఆర్‌ఎస్, జలవివాదాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటున్నాయి. రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఆపేశారంటూ జగన్ ఆరోపిస్తున్నారు. పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయమంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

ఇరు పార్టీల సొంత మీడియా, ఏపీ సీఎం చంద్రబాబును “ఆంధ్రప్రదేశ్ ద్రోహి”గా, “నీటి దొంగ”గా, తెలంగాణ సీఎం రేవంత్ ను “తెలంగాణ ద్రోహి”గా చిత్రీకరిస్తున్నది. వాస్తవాలు ఎలా ఉన్నా, ఈ ప్రచారం ప్రజల్లో పరస్పర విద్వేషాల్ని పెంచుతున్నాయి. రాష్ట్రాల మధ్య ఇప్పటికే సున్నితగా ఉన్న భావోద్వేగాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇది కొన్ని రాజకీయ పార్టీలకేమో గానీ, ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేయదు.

వాస్తవానికి పాలకులు ఎవరైనా తమ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేరు. అదే సమయంలో పొరుగు రాష్ట్ర హక్కులను కాలరాయడం కూడా అంత సులువుగా సాధ్యం కాదు. నదీజలాలు కేవలం రాష్ట్రాలకు చెందినవే కాదు. అవి జాతీయ వనరులు కూడా. జలవివాదాలను పరస్పర చర్చలు, సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించాలనే రాజ్యాంగం సూచిస్తోంది. కోర్టుల చుట్టూ తిరగడం శాశ్వత పరిష్కారం కాదని, గత అనుభవాలే చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకంటే, ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చేసిన “జలజగడాలకన్నా పరిష్కారాలే ముఖ్యం” అన్న వారి వ్యాఖ్యలు హుందాగా కనిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజల అవసరాలే కేంద్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. వివాదం కొనసాగితే లాభపడేది రాజకీయ పార్టీలే తప్ప రైతులు, ప్రజలు కాదు.

పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ విషయంలోనూ భావోద్వేగాలకన్నా వాస్తవాల ఆధారంగా చర్చ జరగాలి. గోదావరి నది చివరి ప్రవాహ రాష్ట్రం ఏపీ. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను వినియోగించుకోవడం సూత్రప్రాయంగా తప్పు కాదు. అయితే అది ఇతర తెలంగాణ వంటి పైరాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా, వాటి సమ్మతితో చట్ట, న్యాయబద్ధమైన అనుమతులతో జరగాల్సిందే. ఏపీ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. టెండర్లు ముందస్తు సన్నాహక చర్యలేనని, అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెబుతోంది.

అయితే తెలంగాణ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా సహజ పరిణామమే. కోర్టు పరిధిలో విషయం ఉన్నప్పుడు, ఇరు రాష్ట్రాలూ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ప్రజల్లో ఉద్రేకాన్ని పెంచే ప్రకటనలు, ప్రచారాలు ఆపాలి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి అంశాలు మరింత తీవ్రంగా రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదు. ఇరు రాష్ట్రాల జలవివాదాలపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా పరిష్కార మార్గాలు సూచించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.

జలవివాదాలు రాజకీయ యుద్ధంగా మారితే నష్టపోయేది ప్రజలే. నీరును రాజేసి, నిప్పును పుట్టిద్దామని చూసే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ నిజాన్ని గ్రహించాలి. సంయమనం, చర్చలు, పరస్పర గౌరవం ఇవే జలవివాదాలకు శాశ్వత పరిష్కారం.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News