Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

నిర్వాసితుల గోడు!|EDITORIAL

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

పోలవరం, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, గతంలో గంగవరం పోర్టు.. దేశంలో చేపడుతున్న ప్రతి పెద్ద ప్రాజెక్టు వెనుక విషాదం ఒక్కటే. త్యాగం ప్రజలది, లాభం కార్పొరేట్లది. వేల కోట్ల ప్రజాధనం వెచ్చించి నిర్మించే ప్రాజెక్టులు చివరకు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయి. భూములు లాక్కోవడం, ఇళ్లు కూల్చడం, ఊర్లు ఖాళీ చేయించడం వరకూ పాలకులు చూపించే వేగం, నిర్వాసితుల పునరావాసం, న్యాయమైన పరిహారం విషయంలో మాత్రం కనిపించడం లేదు.

గంగవరం పోర్టు కోసం త్యాగం చేసిన మత్స్యకారులు ఉపాధి కోల్పోయి నిండా మునిగారు. అదే పోర్టును దక్కించుకున్న ఆదానీ మాత్రం ఒడ్డున పడ్డారు. ఇదే నమూనా తెలంగాణలోనూ పునరావృతమైంది. కేసీఆర్‌ హయాంలో మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టుల కోసం వేల ఎకరాల భూములు, గ్రామాలు త్యాగం చేసిన రైతులు, ప్రజలు ఆగమయ్యారు. కానీ పాలకులూ, వారి అనుచరుల భూములు మాత్రం నీటితో పచ్చగా కళకళలాడతున్నాయి.

అమరావతి రాజధాని పేరుతో లక్ష ఎకరాలకు పైగా భూసేకరణ జరిగింది. రైతులు ఇచ్చిన త్యాగాలకు తగిన పరిహారం లభించిందా? ప్లాట్లు సక్రమంగా అందాయా? అంటే సమాధానం లేదు. బహిరంగంగా ప్రశంసలు కురిపించడం తప్ప రైతులకు వాస్తవ లబ్ధి చేకూరలేదు. ఇంకా ప్లాట్ల కోసం రైతులు పాట్లు పడుతూనే ఉన్నారు. అయినా పాలకుల భూదాహం తీరలేదు. ఇప్పుడు రెండో దఫా భూసేకరణ మొదలైంది. ఈ అభివృద్ధి ఎవరి కోసం అన్న ప్రశ్నకు పాలకులు నిజాయితీగా సమాధానం చెప్పాల్సిన సమయం ఇది.

పోలవరం ప్రాజెక్టు పరిస్థితి మరింత విషాదకరం. దేశంలోనే అతిపెద్ద జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం నిర్వాసితులు నేటికీ దుర్భర జీవితం గడుపుతున్నారు. 1.20 లక్షల కుటుంబాలు ముంపు ముప్పులో ఉండగా, వారికి న్యాయమైన పరిహారం, సమగ్ర పునరావాసం ఇప్పటికీ అందలేదు. భూమికి భూమి లేదు. ఇల్లు కట్టించి ఇవ్వలేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా అమలు కాలేదు. నిర్మించిన పునరావాస కాలనీల్లో వర్షం పడితే ఇళ్లు నీళ్ళల్లో తేలుతున్నాయి. నిలువునా కారుతున్నాయి. శ్మశానాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు వంటి కనీస సదుపాయాలే లేవు.

1986, 2022 వరదల అనుభవం ముంపు ప్రాంతాల స్థితిగతులను కళ్ళకు కట్టినా, పాలకులు వాస్తవాన్ని గ్రహించడం లేదు. కాంటూరు సర్వేలు, లైడార్‌ సర్వేలు వాస్తవాలను ప్రతిబింబించలేదని నిర్వాసితులు చెబుతున్నారు. అయినా తాజా పరిహారం 2017కు ముందు అంచనాల ఆధారంగానే చెల్లిస్తున్నారు. డ్యామ్‌ అంచనాలు రెండుసార్లు పెరిగినా, నిర్వాసితుల ప్యాకేజీ మాత్రం పెరగలేదు. పెళ్లయిన యువతులకు పునరావాస హక్కులు నిరాకరించడం, మహిళలకు పురుషులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వకపోవడం తీవ్రమైన అన్యాయం.

గతంలో ఏపీ సీఎం జగన్ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించినా, అది కాగితాలకే పరిమితమైంది. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అయినా తాజా ధరలకు అనుగుణంగా ప్యాకేజీ సవరించి అమలు చేస్తుందేమోనని నిర్వాసితులు ఆశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. డ్యామ్‌ పనులను పరిశీలించిన సీఎం, ముంపు ప్రాంతాలు, పునరావాస కాలనీలను సందర్శించి ఉంటే సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉండేది.

మార్చి నాటికి పోలవరం జాతికి అంకితం చేస్తామని లక్ష్యాలు ప్రకటిస్తున్నారు. కానీ నిర్వాసితులకు న్యాయం జరగకుండానే ప్రాజెక్టు పూర్తయితే అది అభివృద్ధి ఎలా అవుతుంది? డ్యామ్‌ను దశలవారీగా కాకుండా పూర్తి ఎత్తు వరకూ ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తయ్యాకనే నిర్మించాలన్న నిర్వాసితుల డిమాండ్ న్యాయమైనదే. డయాఫ్రం వాల్‌ నాణ్యత లోపాల వల్ల దెబ్బతిన్న విషయం విదేశీ నిపుణులే నిర్ధారించారు. అయినా నివేదికను బహిరంగపర్చలేదు. అదనంగా రూ.900 కోట్లు వెచ్చించారు. కానీ, బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. అవకతవకలపై పారదర్శక విచారణ జరగాలి.

అభివృద్ధి అంటే ప్రజలను ముంచి నిర్మించే కాంక్రీట్‌ నిర్మాణాలు కాదు. ప్రజల జీవన భద్రత, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణే నిజమైన అభివృద్ధి. హెలికాప్టర్‌ పర్యటనలు, తీయని మాటలు తగ్గించి, నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వాల తొలి కర్తవ్యం కావాలి. మరి ప్రభుత్వాలు, పాలకులు ఆ దిశగా ఆలోచిస్తారా? నిర్వాసితులకు నిజంగా సాయంగా నిలబడతారా? ప్రజల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతోన్న ప్రాజెక్టుల ఫలాలను వారికే దక్కనిస్తారా?

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News