Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

బీజేపీ: పరాజయాల పరంపర!|EDITORIAL

లెఫ్ట్ పార్టీలకు నెలవైన కేరళ తిరువనంతపురం మున్సిపాల్టీలో బీజేపీ విజయం సాధించిన సమయ, సందర్భంలోనే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అదే బీజేపీ స్వతంత్రులకంటే తక్కువ సీట్లతో నాల్గో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభసభ్యుడు ఉన్న బీజేపీ, ఇంత దారుణంగా విఫలమవడం తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జీర్ణించుకున్నా, మోదీ ఆమోదించలేరు. ఈ ఫలితాలకు రెండు రోజుల ముందే ఢిల్లీలో తెలంగాణ, ఏపీ, అండమాన్ నికోబార్ దీవుల ఎంపీల సమావేశంలో మోదీ ఒకింత అసహనాన్ని ప్రదర్శించారు. ఏపీలో తమ పార్టీ, ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటూనే, తెలంగాణ నాయకత్వాన్ని చీల్చి చెండాడారు. రాష్ట్రంలో బీజేపీ నాయకత్వ పనితీరుకు ఈ ఘటనలు ఉదాహరణలు.

తెలంగాణలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కోల్పోయిన పరాభవం నుంచి తేరుకోక ముందే, పంచాయితీ ఎన్నికల్లో తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఫలితాలతో తెలంగాణలో బీజేపీ బలపడటం ఇప్పట్లో సాధ్యం కాదన్న భావన రాజకీయ వర్గాల్లోనే కాదు ఆ పార్టీ శ్రేణులో బలంగా వ్యక్తమవుతోంది.
బీజేపీకి తెలంగాణలో ఇద్దరు కేంద్రమంత్రులు, ఆరుగురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీలతోపాటు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేలలో రాజాసింగ్ ని పార్టీ దూరం చేసుకున్నది. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు? వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా పంచాయతీ ఎన్నికల్లో వారికి సానుకూల ఫలితాలు రాలేదు. ఒకవైపు పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్న సందర్భాలు, మరోవైపు అదే పార్టీకి ఎన్నికల్లో నిరాదరణ దేనికి సంకేతాలు? ఇది కచ్చితంగా ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల లోపమే!

ఏపీ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం సమన్వయంతో కేంద్రం నుండి భారీగా నిధులు రాబట్టుకుంటున్నారని కూడా మోదీ నిష్టూరపడ్డారు. ఏపీలో టీడీపీతో జతకట్టడం కలిసి వచ్చిందనీ చెప్పారు. నిజమే, ఇటీవలి కాలంలో ఏపీకి కేంద్రం నుండి లభిస్తున్న సహకారాన్ని చూస్తే మిగతా రాష్ట్రాలకు ఈర్ష్య కలగకమానదు. ఆ రాష్ట్ర ఎంపీలు చొరవతో చేస్తున్న ప్రయత్నాల ఫలితమది. అదే తెలంగాణ బీజేపీకి ఏపీకి మించి రాజ్యసభ సభ్యుడిని కలుపుకుని, 9మంది ఎంపీలనిచ్చింది. అదే బీజేపీ తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులనిచ్చింది. అయినా పరస్పర ప్రయోజనాలేవీ కనిపించడం లేదు. మోదీ నిందించినట్లు, ఎప్పుడు చూసినా ఢిల్లీలో అందుబాటులో లేకుండా హైదరాబాద్ లో ఉండే కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేస్తున్నట్లు? రాష్ట్ర సమస్యలు పరిష్కరించి, ఢిల్లీ నుంచి నిధులు తేవడంలో, రాష్ట్రంలో పార్టీ బలోపేతంలో, పార్టీ శ్రేణులతో సమన్వయంలో, చివరకు ప్రజలతో మమేకమవడంలోనూ విఫలమవుతున్నారు. అందుకే కేంద్రమంత్రులను, బీజేపీ నేతలను తరచూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శిస్తూనే ఉన్నారు. ప్రతిగా ప్రగల్బాలే తప్ప రాష్ట్ర ప్రగతి కోసం తెచ్చిందీ, సాధించిందీ ఏమీ లేదు.
రాష్ట్రానికి గణనీయమైన ప్రాజెక్టు, నిధులు రాలేదు. కనీసం రోడ్ల పరిస్థితి కూడా మెరుగుపడలేదు. ఇవి ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. కంటోన్మెంట్‌ భూముల బదలాయింపు పెండింగులోనే ఉంది. రాష్ట్రం ఏదైనా కోరితే కేంద్రం నుంచి కొర్రీలు తప్ప ఫలితం కనిపించడంలేదు.

ఇదిలావుంటే, అత్యంత క్రమశిక్షణ గల బీజేపీలో కాంగ్రెస్ ను మించి అంతర్గత కుమ్ములాటలు గతంలో ఎన్నడూ లేనంతగా బహిర్గతమవుతున్నాయి. కేంద్రమంత్రులిద్దరికీ పడదు. ఎంపీలది, ఎమ్మెల్యేలది ఎవరి దారి వారిదే. కీలక నేతల మధ్య పొసగదు. ప్రజా సమస్యల సాధన అటుంచి సఖ్యత, సమన్వయం ఉండదు. గల్లీలో ప్రజల్లో, ఢిల్లీలో పార్టీలో, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నట్లుగా కూడా రాష్ట్ర పార్టీ నాయకత్వం కనిపించదు.

ఐదేళ్ళ క్రితం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిన బీజేపీ, కారణాలేవైనా అసెంబ్లీ ఎన్నికల నాటికి చతికిల పడింది. అధికారంలోకి వస్తామని ఆశించిన బీజేపీకి ప్రజలు కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ముఖం చూసి ఆ మాత్రం ఎంపీలనిచ్చారు. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కైందన్న ప్రచారం బీజేపీకి మరింత నష్టం కలిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అధికారంలోకి రావాల్సిన బీజేపీ చేజేతులా కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చింది. ఉప ఎన్నికల్లోనూ విఫలమైంది. తాజా సర్పంచ్‌ ఎన్నికల్లోనూ నాల్గో స్థానానికే పరిమితమైంది. స్వతంత్రులకు కలిపి వచ్చిన స్థానాలు కూడా బీజేపీకి రాకపోవడం దయనీయమే. అయితే, ప్రజలకు రెండో ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీజేపీ వరుస వైఫల్యాల వల్ల, రేపు బీఆర్ఎస్ కూడా దూరం పెట్టదనే గ్యారెంటీ లేదు. ప్రజలకు దూరమవుతున్న బీజేపీ, అధికారానికే కాదు, కలిసి రావాల్సిన పార్టీలకు కూడా దూరం కాక తప్పదు. బీజేపీ వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర నాయకత్వ విధి విధానాలు, పార్టీ సంస్థాగత లోపాలే కారణం. మరి ఆలోపాలను ఆ నాయకత్వాలు సరిదిద్దుకుంటాయా? వేచి చూడాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News