Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

అభివృద్ధికి అవకాశంగా పంచాయతీ ఫలితాలు|EDITORIAL

తెలంగాణ పంచాయతీ ఎన్నకల్లో తొలి దశ పూర్తవగా, రెండో–మూడో దశలు ముందున్నాయి. మొదటి దశ ఫలితాలు అధికార కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకముంచారనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. అంతేగాక, మిగతా ఫలితాలు కూడా ఇంచుమించుగా ఇలాగే ఉండే అవకాశాలూ ఉన్నాయి. అయితే గత రెండేళ్లుగా గ్రామాల్లో కనీస పరిపాలన అచేతనంగా మారింది. అభివృద్ధి చక్రం కుంటుపడింది. ఈ సమయంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తిదాయక విజయాలు సాధించడమంటే, ప్రజలు ఇంకా జరగాల్సిన అభివృద్ధి కోసం ప్రభుత్వంపై నమ్మకముంచారని అర్థం. గుర్తులు లేకుండా జరిగిన పోరులో కూడా 2,383 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోవడం పెరుగుతున్న ప్రజాభిమానాన్ని ప్రతిఫలిస్తుంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ 1,146 పంచాయతీల్లో గెలవడం, బీజేపీ కూడా కొన్ని చోట్ల సత్తా చాటడం, స్వతంత్రులు 455 పంచాయతీలను గెలుచుకోవడం రాజకీయ వైవిధ్యాన్ని చూపుతున్నప్పటికీ, గ్రామ అభివృద్ధి విషయంలో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేసే సమయం వచ్చింది.

గ్రామాలను బలోపేతం చేయకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యం కాదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే పట్టణాలపై ఒత్తిడి తగ్గుతుంది. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం వంటి అంశాలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. వీటితో పాటు పారిశ్రామిక, ప్లాస్టిక్ కాలుష్యం నిశ్శబ్దంగా భూమినే మింగేస్తోంది. “నా గ్రామం – నా బాధ్యత’’ అనే భావనను ప్రజల్లో కల్పించాలి. సర్పంచ్‌లు గ్రామానికి నాయకులుగా కాక, అభివృద్ధి ప్రేరకులుగా మారాలి. అనవసర పథకాలపై చేసే ఖర్చును గ్రామాల పునర్నిర్మాణానికి మళ్లిస్తే పూర్వ వైభవం వస్తుంది.

ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కు పెరుగుతున్న ఆధిక్యం ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిపై ఉంచిన నమ్మకానికి సంకేతం. ప్రజలు ప్రభుత్వాన్ని అభివృద్ధి ఒక అవకాశంగా చూస్తున్నారు. గ్రామాల్లో మంచినీరు, విద్యా, వైద్యం, రవాణా, ప్రయాణ మౌలిక వసతులు బలహీనంగా ఉన్నాయి. గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తే నిరుద్యోగం తగ్గించడం నుండి చిన్న పరిశ్రమల ప్రోత్సాహం వరకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తే యువత నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంగా భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా దేశ అభివృద్ధిలో కీలక కేంద్రంగా ఎదిగింది. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ భౌగోళిక, వాతావరణం, వ్యూహాత్మక స్థానం, ఐటీ, పారిశ్రామిక వృద్ధి ప్రత్యేకం. తాజాగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమ్మిట్‌లో 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ వైపు మళ్లడం చరిత్రాత్మకం. అయితే ఈ విజయాలు పల్లెలకు చేరకపోతే అభివృద్ధి అసమతౌల్యంలో దెబ్బతింటుంది. పెట్టుబడుల్లో కనీసం పది శాతం గ్రామాభివృద్ధి వైపు మళ్లిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి.

వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో 10శాతం తెలంగాణ వాటాను కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఈ లక్ష్యం సాధించాలంటే సేవలు, పారిశ్రామిక రంగాలు మాత్రమే కాదు, వ్యవసాయం–అనుబంధ రంగాలను కూడా ఆధునీకరించాలి. గ్రామాల్లో చిన్న పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, స్టార్టప్‌లు స్థాపించేందుకు ప్రత్యేక విధానాలు రావాలి. రైతును కేవలం ఉత్పత్తిదారుడిగానే కాక, వ్యవసాయ పారిశ్రామిక వ్యాపారవేత్తగా తీర్చిదిద్దే సమయం ఆసన్నమైంది.

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను కార్యాచరణ ప్రణాళికలకు కేంద్ర బిందువుగా మార్చాలి. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి నమూనా రూపొందిస్తే వేగవంతమైన పురోగతి సాధ్యమవుతుంది. ప్రతి గ్రామం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తేనే తెలంగాణ అసలైన ‘రైజింగ్’ సాకారం అవుతుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News