Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఇండిగో సంక్షోభం, ఇండియాకో గుణపాఠం!|EDITORIAL

ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సంక్షోభం తలెత్తి వారం గడస్తున్నా పరిష్కారాలేవీ లేకపోవడం, పైగా రోజు రోజుకు మరిన్ని విమాన సర్వీసులు రద్దవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 350 సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన 70, ఇక్కడి నుండి వెళ్ళాల్సిన 74 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇది ఇండిగో వైఫల్యంగానే కనిపిస్తోంది. ఇండిగో నిర్వాహకుల తప్పిదాలే ఈ సంక్షోభానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సమస్య తలెత్తేనాటికి ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లంతా విదేశాల్లో ఉన్నట్లుగా తేలింది. అయితే సంక్షోభం తలెత్తిన నాటి నుండే బోర్డ్ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని ఇండిగో ప్రకటించింది.

ఇదిలా వుండగా, విమానాల రద్దు సమస్యకు ఇండిగోనే కారణమని భారత పౌరవిమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పారు. ఇండిగో ఎయిర్ లైన్స్ క్రూ, ఇంటర్నల్ ప్లానింగ్ లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఎఫ్డీటీఎల్ అమలు చేయడంతో ఎలాంటి సమస్యా లేదన్నారు. ‘నెల రోజులుగా ఇండిగో సంక్షోభంపై విమానయానశాఖ పరిశీలిస్తూనే ఉంది. డిసెంబర్ 1న సంక్షోభం తీవ్రమైనప్పుడు యాజమాన్యంతో చర్చించాం. ఎలాంటి సమస్యా లేదు. కానీ, హఠాత్తుగా డిసెంబర్ 3న క్రైసిస్ పెరగింది. ఈ సమస్యను విచారిస్తున్నాం, తేలికగా తీసుకోమని’ ఆయన హెచ్చరించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరుగుతోందన్న అనుమానాలను కూడా మంత్రి వ్యక్తం చేశారు.

ఇండిగో ఎయిర్ లైన్స్ భారత దేశానికి చెందిన చౌకైన విమానయాన సంస్థ. గుర్గావ్ దీని ప్రధాన కేంద్రం. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రాహుల్ భాటియా, అమెరికాలోని ఎన్ఆర్ఐ రాకేష్ ఎస్. గాంగ్వాల్ కలిసి 2006 లో ఇండిగోను స్థాపించారు. ఇంటర్ గ్లోబ్ సంస్థకు ఇండిగోలో 51.12% వాటా, గాంగ్వాల్ కు చెందిన సేలం ఇన్వెస్టిమెంట్ కంపెనీకి 48% వాటా ఉన్నాయి. 2014 డిసెంబరు నాటికే 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది. ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన 91 విమానాలు ఈ సంస్థలో ఉన్నాయి. భారత వైమానిక మార్కెట్ వాటాలో నాలుగో వంతుతో, కేవలం 6 ఏళ్ళల్లోనే ఇండిగో ఘనత సాధించడం విశేషం. ఇతర దేశాల్లోని 37 కేంద్రాల నుంచి ప్రతి రోజూ 550 విమానాలతో ఇండిగో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థ పాత విమానాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. 2015, ఫిబ్రవరి 6 నాటికి ఇండిగో నడిపిస్తోన్న వాటిలో 91 విమానాల సగటు విమాన వయస్సు కేలం 2.9 ఏళ్ళే. అనేక అవార్డులూ రివార్డులూ గెలుచుకుంది.

అయితే, డిసెంబర్‌ 2 అర్ధరాత్రి వరకు సాధారణంగా ఉన్న వ్యవస్థ, ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలపై విమానాయన సంస్థ లోతుగా దర్యాప్తు చేస్తున్నది. నిజానికి ఇండిగోలోనే అత్యధికంగా 2,260 మంది పైలెట్లు ఉన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కనుగుణంగా ఇండిగో ఎయిర్‌ బస్‌ నుంచి 100 విమానాలు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్‌ ఇండియా 500, ఆకాశ 100, స్పైస్ ‌జెట్‌ కూడా 50 విమానాలు కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాయని తేలింది. ప్రస్తుతావసరాలకు అనుగుణంగా రెండు, మూడు సంస్థలు అనుమతి పొందినా. మార్కెట్ లో విమానాలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు విమానయాన సంస్థల్లో ఆహారం, నీరు, టికెట్‌ బుక్‌ చేసుకున్న తర్వాత, సీటు కోసం మళ్లీ నగదు వసూలు చేస్తున్న వ్యవహారంపైనా పూర్తి విచారణ జరగాల్సి ఉంది. విమానాల ఆలస్యం, రద్దు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణీకులకు రిఫండ్‌ చేసే విషయంలోనూ పౌర విమానయాన శాఖ చర్యలు తీసుకోవాలి.

ఇండిగో సంక్షోభం దేశ విమానయాన రంగంలోని లోపాలను మరోసారి బయటపెట్టింది. 140 కోట్ల జనాభా ఉన్న జనాభాకనుగుణంగా విమానయాన వ్యవస్థ విస్తరణ జరగకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడం, ప్రైవేట్‌ రంగంపై నియంత్రణ లేకపోవడం విమానయాన రంగాన్ని బలహీనపరుస్తున్నాయి. పైలట్లు, సిబ్బంది కొరత లేకున్నా, సంస్థలు సంక్షోభాల్లోకి ఎందుకు జారుతున్నాయన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి.
వరుసగా చోటు చేసుకున్న బాంబు బెదిరింపులు, సాంకేతిక సమస్యలు, కార్యకలాపాల లోపాల వంటివన్నీ చూస్తూ, ఏదో పెద్ద కుట్ర కోణం దాగి ఉందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. సమగ్ర దర్యాప్తు చేసి, వాస్తవాలను వెలికి తీయాలి.

ఇండిగో సంక్షోభం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, విమానాయాన సంస్కరణలకు అవకాశం కూడా. ఇప్పటికైనా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే విధానాలు రూపుదిద్దాలి. లేకపోతే రాబోయే రోజుల్లో చిన్న చిన్న లోపాలే పెద్ద పెద్ద సంక్షోభాలుగా మారే ప్రమాదం తప్పదు.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News