Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

నల్ల బజారులో తెల్ల బంగారం!|EDITORIAL

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పత్తి రైతుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. తెల్లబంగారాన్ని పండించి లాభాలు పొందాలనుకున్న రైతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, మార్కెట్ అస్థిరత, విదేశీ దిగుమతుల ప్రభావం వల్ల చిత్తవుతున్నారు. ముఖ్యంగా సీసీఐ విధిస్తున్న కఠిన నిబంధనలు రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. అమెరికా, చైనా టారిఫ్ ల యుద్ధం నేపథ్యంలో భారతీయ పత్తి రైతులను కాపాడుతానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, పత్తిపై దిగుమతి సుంకాన్ని 11 శాతం నుంచి సున్నాకు తగ్గించింది. దీంతో విదేశీ పత్తి వరదలా వచ్చిపడింది. దేశీయ పత్తికి డిమాండ్ తగ్గి, రైతు నష్టాల్లో కూరుకుపోయాడు.

రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోళ్ల సమస్యపై కనీస స్పందనను కబరచకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. సీసీఐ వరుసగా టెండర్లు పిలిచినా మిల్లులు పాల్గొనకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆలస్యంతో రైతులు పత్తిని ఆరబెట్టుకునే అవకాశాలు కోల్పోయి, తేమ శాతం పెరగడంతో పత్తి కొనుగోలు తిరస్కరణకు గురవుతున్నది. ఎనిమిది నుంచి 12 శాతం తేమ ఉన్నా, తూకంలో కోతలు పెట్టడం, 12 శాతం దాటితే కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురవుతున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలు, చలికాలం కావడంతో మంచుతో తేమ శాతం సహజంగానే పెరుగుతోంది. ఇదంతా తెలిసినా, ప్రభుత్వం కానీ, సీసీఐ కానీ కఠిన నిబంధనల్లో ఎటువంటి సడలింపు ఇవ్వకపోవడం వల్ల రైతులకు దెబ్బ మీద దెబ్బలా మారింది.

కపాస్ కిసాన్ యాప్ ద్వారా మాత్రమే కొనుగోళ్లు జరుపుతామని సీసీఐ షరతు పెట్టడం, కొనుగోళ్ళకు మరో పెద్ద అడ్డంకిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు లేని రైతులు, నెట్‌వర్క్ సమస్యలు, నమోదు ప్రక్రియలో, యాప్ వినియోగం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పీకులాటలకు తాళలేక రైతులు, ప్రైవేట్ వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అటు సీసీఐ నుంచి కానీ, ఇటు ప్రైవేటు వ్యాపారుల నుంచి కానీ రైతులకు లభించడం లేదు. పైగా రైతులు దోపిడీకి గురై తీవ్ర నష్టాల్లోకి నెట్టబడుతున్నారు.

ఎకరాకు గరిష్టంగా 12 నుంచి 15 క్వింటాళ్లు దిగుబడి వచ్చే పత్తిపై, సీసీఐ చివరి నిమిషంలో ఎకరాకు 7 క్వింటాళ్లకే పరిమితం చేయడం రైతులను మరింత నిరాశకు గురి చేసింది. అంటే ఎంత పండినా, ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ళ చొప్పుననే సీసీఐ కొనుగోలు చేస్తుంది. మిగతా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలన్న ప్రశ్నకు సమాధానం లేదు. కొంత సీసీఐ వద్ద, మరికొంత ప్రైవేట్ కంటే మొత్తానికి మొత్తం ప్రైవేట్ వ్యాపారులకే తెగనమ్ముకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.8,110 అయినప్పటికీ, తేమ, రంగు మార్పు పేరుతో కోతలు పెట్టి రైతు చేతికి వెయ్యి రూపాయల వరకు తగ్గిస్తున్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి పత్తి సాగును పూర్తిగా సంక్షోభంలోకి నెట్టాయి. సీసీఐ అవకతవకలను నియంత్రించేందుకని నిబంధనలు తెచ్చినా, అవే రైతుల పాలిట శాపంగా పనిచేస్తున్నాయి. కపాస్ యాప్ ను పంజాబ్ రైతులు తిరస్కరించారు. అయినా కేంద్రం ఆ యాప్ ను కానీ, రైతు సమస్యలను కానీ తిరిగి విచారించలేదు. దేశవ్యాప్తంగా పత్తి మార్కెట్ నే కుదిపేస్తున్న ఈ పత్తి కొనుగోళ్ళ సమస్యలను అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి.

పత్తి రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కేంద్రం అత్యవసర చర్యలు తీసుకోవాలి. దిగుమతుల నియంత్రణ, తేమ శాతం సడలింపు, మద్దతు ధర అమలు, యాప్ నిబంధనల సవరణ వంటి సమస్యల పరిష్కారం ఆలస్యం అయితే తెల్లబంగారం సాగు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News