Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

గ్రామాల్లో ‘పంచాయతీ’ ఎన్నికలు!|EDITORIAL

పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో గ్రామాల్లో మళ్ళీ రాజకీయ హడావుడి మొదలైంది. పార్టీ రహితంగానే ఎన్నికలు జరగనున్నప్పటికీ పార్టీలు స్థానికంగా పట్టు సాధించాలంటే సర్పంచ్‌ పదవులను గెల్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని విధాలుగా సర్వశక్తులు ఒడ్డడానికి పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో గ్రామాలు ఇప్పుడు రాజకీయ రణక్షేత్రాలు కానున్నాయి.

పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తరవాత నిర్వహించాలని నిర్ణయించడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగబోతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మూడు వారాల్లోనే మొత్తం ఎన్నికల పక్రియ ముగియనుంది. 27తో తొలి దశ ఎన్నికల పక్రియ మొదలై, డిసెంబర్‌ 17తో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. పోలింగ్‌ రోజే, ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. డిసెంబర్‌ 11న తొలిదశ, డిసెంబర్‌ 14న రెండో దశ, డిసెంబర్‌ 17న మూడో దశ పోలింగ్ జరగనుంది.

ఎన్నికల నిబంధనల మేరకు, ఐదు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేయాలి. ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.1.5 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేల లోపు ఖర్చు చేయాలి. అయితే ఆచరణలో జరిగే ఖర్చులకు, ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలకు పొంతన ఉండదన్న విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల ప్రకటనకు ముందే, ప్రభుత్వం పందేరాలను ప్రారంభించింది. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. హడావుడిగా ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది. మరోవైపు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు కూడా పంపిణీ చేశారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులను ఆయా అభ్యర్థులు పడ్డారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో, పోటీ పడే అవకాశం రాని నేతలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల పోటీ చేసే భర్తలకు విడాకులిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ఆలస్యమవడం, ప్రభుత్వ వద్ద డబ్బుల్లేకపోవడం, ఇప్పటికే గ్రామాల్లో కొంత పురోగతి జరిగి ఉండటం, వచ్చే టర్మ్ లో నిధుల కొరత, పనుల లేమీ కచ్చితంగా ఉంటుందన్న అంచనాతో పలువురు పోటీకి విముఖుత కూడా చూపుతున్నారు. ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఉంటుంది. గ్రామానికి మొదటి గౌరవం సర్పంచ్ కే కాబట్టి, పోటీ చేద్దాంలే అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇక ఆయా పార్టీల పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ఇదే తడవుగా ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల నుండి డిపాజిట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ కావాలనుకునే అభ్యర్థి తమ వద్ద పెద్ద గ్రామ పంచాయతీకి రూ.కోటి, చిన్న గ్రామ పంచాయతీకి రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకు డిపాజిట్ చేస్తే టికెట్లిస్తామంటున్నారట. తమ ఎన్నికలకు పెట్టిన ఖర్చుకే దిక్కులేదని, స్థానిక ఎన్నికల ఖర్చు తాము పెట్టలేమని, అభ్యర్థులే పెట్టుకోవాలని షరతులు విధిస్తున్నారు. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఖర్చుపై ఆందోళనలు మొదలయ్యాయి.

అభ్యర్థులు తమ ఖర్చుపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ముందుగా డిపాజిట్ చేస్తేనే టికెట్లు. ఆ తర్వాత రోజువారీగా చేసే ఖర్చు, ఓటుకిచ్చే నోటు? అదెంతివ్వాలి? ఎంత మంది ఓటర్లకివ్వాలి? ఆ డబ్బు ఎక్కడి నుండి తేవాలి? అనేది అభ్యర్థులకు సమస్యలుగా పరిణమించాయి. రియల్ దందా కుదేలుతో ప్లాట్లు, భూములు అమ్ముకోలేకపోతున్నారు. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పో సప్పో తెచ్చి పెడదామంటే, పెరిగిపోతున్న ఖర్చు, ఓటర్ల మనోగతం లాటరీగా మారడం, గెలిచినా, పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే దారులే లేకపోవడం వంటి అంశాలు అభ్యర్థులను గందరగోళ పరుస్తున్నాయి.

ఇక తొలి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులకు కేవలం రెండు వారాలు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. రెండో విడతలో పోటీ చేసే అభ్యర్థులకు అదనంగా మూడు రోజులు కలిసి వస్తోంది. తుది విడతలో పోటీ చేసే వారికి దాదాపుగా మూడు వారాల సమయం దక్కుతోంది. ప్రచారానికి సమయం తక్కువ ఉండటం ఖర్చు తక్కువవడానికి ఆస్కారముంది. కానీ, కనీస నిధులు సమకూర్చుకోవడమే కష్టంగా మారింది. అయినప్పటికీ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే ఆవేదన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అయితే ఎన్నికలు ఓటర్లకు పండుగ తెస్తున్నాయి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News