Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

పరనింద కాదు ఆత్మవిమర్శ కావాలి!|EDITORIAL

కులతత్వ, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలాన్ని బిహార్ ప్రజలు తిరస్కరించారా? ఇందిర, రాజీవ్ లతో పని చేసిన సీనియర్లు కూడా రాహుల్ విన్యాసాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మిత్ర పక్షాలు, పార్టీ కార్యకర్తలకు కూడా వివరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదా? అవుననే ప్రదాని మోదీ అంటున్నారు. సూరత్ లో స్థిరపడిన బిహారీలతో సమావేశంలో ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు వరస ఓటములపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మరి కాంగ్రెస్ లో ఆ ఆత్మపరిశీలన, అంతర్మథనం జరుగుతోందా?

కులతత్వ, ముస్లిం లీగ్-మావోయిస్టు భావజాలాన్ని బిహార్ ప్రజలు తిరస్కరించారా? ఇందిర, రాజీవ్ లతో పని చేసిన సీనియర్లు కూడా రాహుల్ విన్యాసాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మిత్ర పక్షాలు, పార్టీ కార్యకర్తలకు కూడా వివరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదా? అవుననే ప్రదాని మోదీ అంటున్నారు. సూరత్ లో స్థిరపడిన బిహారీలతో సమావేశంలో ఆయన సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు వరస ఓటములపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. మరి కాంగ్రెస్ లో ఆ ఆత్మపరిశీలన, అంతర్మథనం జరుగుతోందా?

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్షం పట్ల ప్రజల విముఖత ప్రతిబింబించింది. అధికార కూటమికి 202 సీట్లు రాగా, ప్రతిపక్ష కూటమి మహాగఠ్‌ బంధన్‌కు కేవలం 35 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ప్రజాతీర్పును రాహుల్‌, ఎన్నికల ప్రక్రియ మొత్తం తప్పుగా సాగిందంటున్నారు. ఏకపక్ష ప్రజా తీర్పులో కాంగ్రెస్ కూటమి పెద్దగా కనిపించకుండా కొట్టుకుపోయింది. నితీశ్‌ ను నిలువరించే ఒక్క ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. జన్‌ సురాజ్‌ ప్రశాంత్‌ కిశోర్‌ ఉనికే కనిపించలేదు.

ఓట్‌ చోరీ, నిరుద్యోగితకే పరమితమైన రాహుల్, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, లేదా ప్రజాభిమానాన్ని చూరగొనే ఒక్క అంశాన్నీ ప్రస్థావించలేకపోయారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలలో బిహారీల తీరుతెన్నులకు ఎవరూ సహేతుకమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు. బిహార్‌ ప్రజల ప్రత్యామ్నాయ దార్శనికతతో ఉత్తేజితులను చేయడంలో, మార్పునకై ఒక ప్రగాఢ ఆకాంక్షను వారి మనసుల్లో పురికొల్పడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. ఓటర్లను బూత్ ల వరకు తీసుకువచ్చే సంస్థాగత వెన్నుదన్ను కూడా మహగఠ్ బంధన్ కు కరువైంది. ఎన్నికల వేళ బిహార్‌లో మాత్రమే ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ -సర్‌ ని చేపట్టి బీజేపీ విజయవంతమైంది.

బిహార్ ఎన్నికల్లో నితీశ్ గత పాలనతోపాటు, తాజాగా ఇచ్చిన హామీలు ఎన్డీఎ కూటమిని విజయతీరాలకు చేర్చింది. ఎన్నికలకు ముందు ఆగస్టు 29న నితీశ్‌ సర్కార్ ప్రకటించిన ’ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన’ గేమ్‌ చేంజర్‌గా నిలిచింది. ప్రతి కుటుంబంలో ఒక మహిళకు వ్యాపారం చేసుకోవడానికి సీడ్‌మనీ కింద రూ.10 వేలు చొప్పున పంపిణీ చేశారు. 1.4 కోట్ల మంది బిహారీ మహిళలకు ఈ సొమ్ము సరిగ్గా ఎన్నికలకు ముందు అందింది. బాలికలకు ఉచిత విద్య, సైకిళ్లు, యూనిఫారాలు, వితంతు పింఛన్ల పెంపు వంటి పథకాలు మహిళల్ని బాగా ఆకర్షించాయి.

ముస్లింలు, యాదవుల-ఎంవై- ఓట్లపై కాంగ్రెస్‌, ఆర్జేడీ కూటమి నమ్మకంగా ఉంటే, ఆ వర్గాల మహిళల్ని కూడా ఎన్డీయే ఆకట్టుకుంది. బీజేపీ సంప్రదాయ అగ్రకులాలవారి ఓట్లపై దృష్టి సారించగా, జేడీయూ కుర్మీలు, ఈబీసీల ఓట్లపై దృష్టి సారించింది. కూటమిలోని లోక్‌జనశక్తి, రాష్టీయ్ర లోక్‌ మోర్చా, హిందుస్థానీ అవామ్‌ మోర్చా పార్టీలు దళితులు, వెనుకబడిన వర్గాల ఓట్లను రాబట్టడంలో కీలకపాత్ర పోషించాయి. సీమాంచల్‌ ప్రాంతంలో ముస్లింల ఓట్లు అత్యధికంగా మజ్లిస్‌ పార్టీకే పడ్డాయి. ముస్లిం ఓట్లలో చీలిక.. మహాగఠ్‌బంధన్‌ కు బలమైన పట్టున్న ప్రాంతాల్లో కూడా ఓటమికి కారణమైంది. ఆర్జేడీకి కోర్‌ ఓట్‌ బ్యాంకు అయిన యాదవుల ఓట్లు సైతం ఈసారి చీలిపోయాయి.

బిహార్ ఓటర్లు మరచిపోయినా, బీజేపీ ఆర్జేడీ జంగిల్‌రాజ్‌ పాలనను పదే పదే గుర్తు చేసింది. బిహారీల పట్ట బయటి ప్రపంచానికి చిన్నచూపు ఉండేది, నితీశ్‌ పాలనతో ఆ మరక పోయి, బిహార్‌ను గౌరవంగా చూస్తున్నారనే భావన చాలా మంది బిహారీల్లో కలిగింది.

ఎప్పటిలాగానే బిహార్‌లో మోదీ మ్యాజిక్‌ కొనసాగింది. ఆయన సభలు, సంక్షేమ పథకాలు, తటస్థ ఓటర్లను ఎన్డీఎ తమ వైపు తిప్పుకోగలిగింది. చొరబాటుదారులకు ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతునిస్తున్నాయని, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనాన్ని దోచుకుతిన్నాయని, ఆటవిక పాలన కొనసాగించాయని పదేపదే గుర్తు చేసి సక్సెస్ అయ్యారు.

ఇలాంటి అనేక అంశాలు బిహార్ ఓటర్లపై ప్రభావాన్ని చూపాయి. స్వీయ ప్రాభవాన్ని కోల్పోతున్న కాంగ్రెస్, ప్రజల్లో పట్టున్న పార్టీలను పట్టుకోవడంలోనూ విఫలమవుతోంది. మరి ఇవన్నీ విశ్లేషించుకుని, తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించకునే అంతర్మథనం కాంగ్రెస్ లో, రాహుల్‌ లో జరిగితేనే రాజకీయ భవితవ్యం ఉంటుంది.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News