Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

బీహారీల ఓటు ఎటు!?|EDITORIAL

బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

బిహార్‌లో రాష్ట్ర ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. రెండోదశ పోలింగ్ మంగళవారం జరగబోతోంది. మరి బిహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వేసిన ‘ఓట్ చోరీ’ పాచిక పారుతుందా? కాంగ్రెస్ నాయకత్వంలోని మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందా? అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న నితీశ్ కుమార్ విజయపరంపరకు తెరపడుతుందా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఎనే తిరిగి అధికారంలోకి వస్తుందా? ప్రజా తీర్పు ఎలా ఉండబోతోంది? ఏం జరగనుంది? ఆసక్తిగా మారింది.

బిహార్ లో గెలిచినా, ఓడినా రాహుల్‌, ఓట్‌చోరీ ఆయుధంగా దేశ వ్యాప్త ఉద్యమానికి బలమైన వ్యూహంతో ఉన్నారు. ఇప్పటికే బిహార్ లో 9సార్లు సీఎంగా గెలిచిన నితీశ్‌ కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలుగా భావించవచ్చు. గెలిస్తే పదోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ఆ అవకాశం ఉందా? లేదా? అన్నది ఆ రాష్ట్ర ఓటర్ల తీర్పుని బట్టి ఉంటుంది. 2020 అసెంబ్లీ ఎన్నికలలో జనతాదళ్‌ ఓట్ల వాటా 15 శాతంగా ఉన్నది. నితీశ్‌ మళ్లీ అధికారానికి రావడానికి ఇది విశేషంగా తోడ్పడింది. 2005 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ రెండు ప్రధాన వర్గాలు నితీశ్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆ వర్గాలు మహిళలు, బాగా వెనుకబడిన కులాలవారు. మహిళా ఓటర్ల శక్తిని జాతీయ రాజకీయ పార్టీలు అందిపుచ్చుకోకముందే నితీశ్‌ మహిళా ఓటర్ల ఆదరాభిమానాలను బాగా చూరగొంటున్నారు. మృదుభాషిగా పేరున్న నితీశ్‌ తన ప్రత్యర్థిగా మారిన స్నేహితుడు, పల్లెటూరి మనిషిలా వ్యవహరించే లాలూప్రసాద్‌కు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఈ కారణంగానే మహిళా ఓటర్లను నితీశ్‌ ఆకట్టుకున్నారు. అచంచలమైన కుల సంబంధిత విధేయతలతో పాటు మహిళా ఓటర్ల మద్దతు నితీశ్‌ విజయాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 2005లో నితీశ్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చదువుకుంటున్న బాలికలు అందరికీ ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఆనాడు లబ్ది పొందిన బాలికలు ఇప్పుడు వయోజన ఓటర్లుగా ఉన్నారు. ఆ మహిళా ఓటర్లే నితీశ్‌ నాయకత్వానికి, అధికార ప్రాభవానికి వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పకతప్పదు.

ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ నితీశ్‌ను ఎన్‌డిఎ పక్షాన ఉంచుకునేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. తనను వ్యతిరేకించిన వారిని క్షమించే అలవాటు లేని మోదీ, ఒకప్పుడు నితీశ్‌ తనను తీవ్రంగా వ్యతిరేకించారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించడం వెనక బీహార్‌ ప్రయోజనాలే ముఖ్యమని గుర్తించాలి. బిహార్‌లో బీజేపీ ఎదుగుదలకు నితీశ్‌తో పొత్తు తప్పనిసరని మోదీ గ్రహించారు. మరోమారు బీహార్‌లో ఎన్‌డిఎ విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో బిహార్‌లో కూడా ఏక్‌నాథ్‌ షిండే లాంటి తిరుగుబాటు సంభవించే అవకాశం లేకపోలేదు. అయినా ప్రస్తుతానికి మాత్రం బీజేపీ ఎన్నికల విజయాలకు నితీశ్‌ ఆవశ్యకత అమితంగా ఉన్నది. లాలూప్రసాద్‌ యాదవ్‌తో ఉన్న రాజకీయ అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో నితీశ్‌ జతకట్టంలో ఆయన స్వార్థం ఆయనకు ఉంది. నిరంతరాయంగా బీహార్‌ సిఎంగా నిలిచిపోవాలన్న ఆయన కాంక్షను కాదనలేం. రాజకీయ సౌలభ్యం కోసమే ఆయన మళ్లీ మోదీతో చేయి కలిపారు. అలాగని బీజేపీకి నితీశ్‌ పట్ల ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.

2013లో ప్రధానమంత్రి పదవికి అవసరమైన అర్హతలు నరేంద్ర మోదీకి లేనేలేవని తొట్టతొలుత నిరసన తెలిపిన నేత నితీశ్‌కుమార్‌. ఈ విషయాన్ని బీజేపీ మరచిపోయి ఉండదు. అయితే బిహార్‌లో ఎన్డీఏకు సమర్థంగా నేతృత్వం వహించగల నాయకుడు మరొకరు లేరన్న వాస్తవమూ బీజేపీకి బాగా తెలుసు. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా మరెవ్వరూ లేనందునే బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తోంది. వయసు మీద పడడంతో నితీశ్‌ కూడా తప్పని పరిస్థితుల్లో మోదీయే సర్వం అయిన ఢిల్లీ దర్బార్‌కు విధేయుడుగా ఉంటూ వస్తున్నారు.

అయితే మారుతున్న కాలానుగుణంగా బిహార్‌ ఓటర్లలో అత్యధికులు మౌలిక మార్పులు కోరుకుంటున్నారు. మరి ప్రశాంత్‌ కిశోర్‌ నాయకత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీకి వారు ఓటు వేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. తేజస్వి యాదవ్‌ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.

బిహార్‌ ఓటర్ల సవరణ రచ్చ కూడా చర్చకు దారితీస్తోంది. ఎంఐఎం కూడా ముస్లింల ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో బరిలోకి దిగింది. మరైతే, బిహార్‌ ఎన్నికలు ఎవరికి మొగ్గు చూపుతాయి, ప్రజలు ఆలోచన ఏ విధంగా ఉందన్నది కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పటికే బిహార్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంలో నితీశ్‌ రికార్డు సృష్టించారు. మొత్తం తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనేక పరిమితులు ఉన్నప్పటికీ బిహార్‌కు ఆయన నాయకత్వం తప్పనిసరి అని పలువురు, ముఖ్యంగా బీజేపీ భావిస్తోంది. ఐదేళ్ళ క్రితం కొత్త తరం బిహారీ రాజకీయ నాయకుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను ప్రోత్సహించడం ద్వారా నితీశ్‌ స్థాయిని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నించింది. నితీశ్‌ ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. గత శాసనసభ ఎన్నికల్లో జనతాదళ్‌(యు) కేవలం 43 సీట్లు మాత్రమే కైవసం చేసుకోగా బీజేపీ 74 నియోజక వర్గాలలో జయపతాక నెగురవేసింది. అయినప్పటికీ నితీశ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ సంకోచించింది. తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేసేందుకు సుముఖత చూపలేదు.

నితీశ్‌ కుమార్‌ అపర చాణక్యుడు. బీజేపీ ఎత్తుగడలను అర్థం చేసుకున్నారు. ఆ పార్టీతో పొత్తును కొనసాగించడం ప్రమాదకరమని భావించారు. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చివేసిన రీతిలో బిహార్‌లో తన పార్టీని బీజేపీ చీల్చకుండా ఉంటుందా? అని నితీశ్‌ ఆలోచించారు. అందుకే బీజేపీని తన దగ్గరే పెట్టుకుని జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఈసారి ఆయన పదోసారి సిఎంగా బాధ్యతలు స్వీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.

తేజస్వీ యాదవ్‌ సీఎం కావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్‌ మహాఘట్‌బందన్‌ కలసివస్తుందా? లేదా? అలాగే రాహుల్‌ ఓట్‌చోరీ ఆరోపణలు ఏమేరకు ఫలితం ఇస్తాయో? ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోందో? ఫలితాలు వచ్చేదాకా ఆగాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News