Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

ఓటర్ల జాబితా సవ‘రణ’లు!|EDITORIAL

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

భారతదేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నమోదైన ఓటర్లు 96.88 కోట్ల మంది. అంతకుముందు ఎన్నికలకు నమోదైన ఓటర్లతో పోలిస్తే 8% పెరుగుదల ఉంది. మహిళా ఓటర్ల నమోదు పురుష ఓటర్ల కంటే ఎక్కువగా ఉంది. 18-29 ఏళ్ల వయస్సు గల 2 కోట్ల మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. అయితే, ఓటర్ల జాబితా సవరణలు అవసరమా? లేదా? అన్నది ఈ మధ్య వివాదాంశంగా మారింది. బిహార్ ఎన్నికలకు ముందు సవరింపులు, అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సవరింపులతో ముడిపడి పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశంలో బీజేపీయేతర పార్టీలు, ప్రభుత్వాలు వసరణను వ్యతిరేకిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఏకంగా తీర్మానమే చేసింది. ఇంతకీ ఓటర్ల జాబితా సవరణ అవసరమా? కాదా?

దేశంలో ఉద్యోగ, ఉపాధి వలసలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ఓట్లు ఒకచోట, వారొక చోట ఉండటమో, లేదా రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటమో చేస్తున్నారు. ఓటే లేకుండా పోవడమో జరుగుతోంది. చిరునామా మార్చులు, మరణించినవారి పేరు తొలగించకపోవడం లాంటి కారణాల వల్ల జాబితా మార్పులు అవసరం అవుతాయి. భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నట్లు ‘ఒకసారి తయారైన ఓటర్ల జాబితాను ఎప్పటికి అలాగే కొనసాగించలేం. అందుకే సవరణ అవసరం’. భద్రతా ప్రమాణాల రీత్యా, రిప్రజెంటేసన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, సెక్షన్ 16 ప్రకారం ‘కేవలం భారత పౌరులు, 18 ఏళ్ళు నిండిన వారు ఓటర్లుగా నమోదు కావచ్చు’.

అయితే, సాంకేతికత, సమాచారం, డిజిటలైజేషన్ పెరిగిన ఈ తరుణంలో ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులను అత్యంత భద్రతగా ఇవ్వాల్సి ఉంది. కానీ, నకిలీ గుర్తింపు కార్డులున్నట్లుగా గుర్తించారు. ఓటర్ల రిజిస్ట్రేషన్, జాబితా వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలంటే, సవరణలు తప్పనిసరి.
అయితే వసరణల్లో లోపాలే సవరణ ఎందుకు? అన్న ప్రశ్నలను సంధిస్తున్నాయి. హడావుడిగా ఎన్నికలకు ముందే ఈ సవరణలు చేపట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నయి. నిర్ణీత పద్ధతులు, సమయాల్లో నిరంతరంగా జరగాల్సిన సవరణపై సుప్రీం కోర్టు కూడా ఈసీని మందలించింది. ఇందుకు తగ్గట్లుగానే, వసరణల్లో లోపాలు, నిర్లక్ష్యాలు, ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. డాక్యుమెంటేషన్ పద్ధతి వల్ల నిరక్షరాస్యులైన ఓటర్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పరిమిత వనరులతో తక్కువ సమయంలో చేపట్టే సవరణలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

దేశ అత్యున్నత న్యాస్థానం చెబుతున్నట్లు.. ఇలాంటి అనుమానాలకు తావులేకుండా ఓటర్ల జాబితా సవరణలు నిరంతరంగా పారదర్శకంగా జరగాలి. సవరణ సులభంగా ఉండి, నిజమైన ఓటు పోకుండా ఉండాలి. ఆధార్ లింకింగ్, డేటాబేస్ పూర్తి చేయడం, ఇంటర్నెట్/మొబైల్ ద్వారా తనిఖీలు చేయడం వంటి మార్గాలు ఉండాలి. అయితే ఇది ప్రజల గోప్యత, డేటా భద్రత హక్కులకు హాని కలగకుండా ఉండాలి. ‘అధికారికంగా ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాద’ని ఈసీ తెలిపింది. సవరణ ఎన్నికల ముంగిట కాకుండా, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా ఉండాలి.

అయితే, బిహార్ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ వివాదస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ సవరణలపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈసీని నిందించింది. దొంగ ఓట్లను చేర్చారని అనుమానించింది. పెద్ద దుమారమే లేచింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఓటర్ల సవరింపులో కొన్ని లోపాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీయేతర పార్టీ ప్రభుత్వాలన్నీ సవరణను వ్యతిరేకిస్తున్నాయి. ‘స్థానిక సంస్థలకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎస్‌ఐఆర్‌ చేపట్టవద్దని కేరళ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సీఎం అఖిలపక్షానికి పిలునిచ్చారు.

ఎన్నికల సంఘం విధుల్లో తలదూర్చడం తప్పే. అయితే, ఓటర్ల జాబితా ఆధునీకరణ పక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంగా, రాజకీయ పక్షపాత రహితంగా, అనుమానాలకు తావివ్వని విధంగా చేపట్టాల్సిందే. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికలు భారత రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు మూలస్తంభం. వాటిని నిర్వహించే ఎన్నికల కమిషన్‌ను బలోపేతం చేస్తూ పోవాల్సిందే. శేషన్‌ లాంటి వారు ఎన్నికల కమిషనర్‌గా ఉన్నత ప్రమాణాలను పాటించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను చేపట్టే విధానాన్ని బీజేపీ ప్రభుత్వం మార్చేసింది. సీజేఐని తొలగించి, ఆ స్థానంలో సీనియర్‌ కేబినెట్‌ మంత్రిని సభ్యుడిగా చేర్చింది. దీన్ని వ్యతిరేకించిన సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెడుతూ పార్లమెంటులో చట్టం చేసింది. ఈ ప్రక్రియే అనేక అనుమానాలకు మూలంగా మారింది.

అయితే, బీహార్‌ ఎస్‌ఐఆర్‌ పక్రియపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనే లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టడం వల్ల కొందరికి అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్రం ఈ రకమైన అనుమానాలను నివృతి చేయాలి. ప్రతిపక్షాలు కూడా అనుమానాలుంటే వాటిని నిరూపించాలి. అంతేకానీ, వ్యవస్థనే తప్పుపడితే, ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుంది. పైగా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా మాట్లాడ్డం కూడా మానుకోవాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News