Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

దేశానికి దిశానిర్దేశంగా బీహార్ ఎన్నికలు!|EDITORIAL

ఎన్నికలంటే ఆర్భాటాలు, ప్రచార పటాటోపాలే కాదు, మేనిఫెస్టోలు, హామీలు కూడా. అమలు చేయలేని, అలవికాని, ఆచరణ సాధ్యం కాని హామీలు ఎన్నికల్లో హల్ చల్ చేస్తుంటాయి. ఓట్ల కోసం ఏ ఫీట్లయినా చేసే, మన రాజకీయ పార్టీలు, నేతలు, ఉచిత పథకాలు, సబ్సిడీలతో ప్రజల్ని ప్రలోభ పెడుతుంటారు. తాయిలాలు ప్రకటించి, తిలాపాపం తలా పిడికెలా ప్రజా ధనాన్ని దోచేస్తుంటారు. మన దేశంలో ఓట్ల పండుగ అంటే నోట్ల పండుగే!

ఎన్నికల్లో పార్టీల, రాజకీయ నాయకుల ఎజెండాలను నిర్దేశించే స్థాయిలో ప్రజలుండాలి. తమకిచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి నాయకులను నిలదీయాలి. ఒక్కసారి నోటుకు తలొగ్గితే, ఐదేళ్ళు మనం ఎన్నుకున్న నేతకు తలొగ్గాల్సి వస్తుంది. దేశంలో వనుకబడ్డ రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అయితే బీహార్ లో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రంజుగా సాగుతున్నాయి. ఓట్ల చోరీ, దొంగ ఓట్ల చేరికల ఆరోపణలతో వచ్చిన ఈ ఎన్నికలు బీహార్ తోపాటు, దేశ భవితవ్యాన్ని ప్రభావితం చేయనున్నాయి. అందుకే ప్రజలు అత్యంత జాగరూకతతో ఓట్లు వేయాలి. తాయిలాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓట్లు వేసి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది.

బీహార్‌లో పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తోంది. నితీశ్‌ సిఎంగా పెద్దగా చేసిందేమీ లేదు. అంతుకుముందు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా తమ కుటుంబ సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్‌ మొదటి నుండి రాజకీయంగా చురుకుగా ఉండే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కళింగ రాజ్యమైన బీహార్‌ ను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని మౌర్యులు పాలించారు. చాణక్యుడు అక్కడే ఉండేవారు. నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ప్రపంచానికి మార్గం చూపింది. ఇలాంటి నేల బీహార్‌లో ఇప్పుడు అరాచకం రాజ్యమేలుతోంది.

రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన నేల. అక్కడ చోటుచేసుకునే పరిణామాలు అనేక సందర్భాలలో దేశ వ్యాప్తంగా ప్రభావం చూపాయి. దేశ రాజకీయాలకు దిశా నిర్దేశం చేశాయి. బీహార్‌కు చెందిన జయప్రకాశ్‌ నారాయణ్‌ జనతా పార్టీని స్థాపించి దేశ రాజకీయాలను మలుపు తిప్పారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఆ రాష్ట్రానికే కాకుండా దేశానికే కీలకంగా మారాయి. మరోమారు అధికారం కోసం ఎన్డీఏ ఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నో అడ్డదారులు తొక్కుతోంది. హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ -సర్‌తో ఎన్నికల కమిషన్‌ స్వతంత్రత ప్రశ్నార్థకం గా మారింది. పెద్దఎత్తున ఓట్‌ చోరీ ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి జవాబిచ్చి, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై దాడికి దిగుతోంది.

అయితే బీహార్ లో బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్య కూడా తీవ్రంగా ఉంది. కొనసాగుతున్న నిరసనల మధ్యే ఓటర్ల తుది జాబితాను, ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం 243 మంది సభ్యులు గల బీహార్‌ శాసనసభకు నవంబర్‌ 6, 11 తేదీలలో పోలింగ్‌ జరగనుంది. 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాపై కూడా దుమారం రేగుతోంది. ఈ జాబితాలోని చేర్పులు, తొలగింపులకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు అందచేయడంతో పాటు, వాటిని క్షేత్రస్థాయి వరకు ప్రదర్శించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

ఓట్ల తొలగింపు ఆరోపణలు చేస్తున్న రాహుల్‌ వాటిని రుజువు చేయడంలో విఫలమయ్యారా? సుప్రీం కూడా తొలగించిన ఓట్లకు సంబంధించి రుజువులతో అఫిడవిట్‌ వేయాలని సూచించినా అది ముందు పడలేదు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నితీష్‌ ఇప్పటికే 9సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పదోసారి కూడా ఆ పదవిని ఆయన ఆశిస్తున్నారు. బీజేపీ నేతలు ఆ విషయాన్ని తేల్చకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలకు మాత్రం నితీష్‌ను పూర్తి బాధ్యుడిని చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్లను మభ్య పెట్టే కుతంత్రాలకు తెరతీస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ తరహా విన్యాసాలు మరింత జోరందుకోనున్నాయి.

2020లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం 0.2 శాతం ఓట్ల ఆధికత్యతను మాత్రమే సాధించింది. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికలలో వ్యతిరేక ఓటు కీలకంగా మారనుంది. అదే సమయంలో ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యత రావాల్సి ఉంది. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవడంతో పాటు, ప్రజలకు నమ్మకం ఇయ్యవలసిన బాధ్యత ప్రతిపక్షాలదే!

అధికారమే పరమావధిగా అన్ని పార్టీలు విన్యాసాలు చేస్తున్నాయి. తాజాగా 7.42 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. బీహార్‌ అభివృద్ధికి ఏం చేస్తారన్న దానిపై రాజకీయ పార్టీల్లో స్పష్టత లేదు. కేవలం ఓట్లు కొల్లగొట్టి కుల్లుగుత్తగా అధికారం దక్కించుకోవడం అందరిపనిగా మారింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేతల కుయుక్తులను గమనించాలి. తమ ఓటును సక్రమంగా వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News