Tuesday, April 14, 2026
38.2 C
Hyderabad

‘మమత’ను మరచి బెనర్జీ వ్యాఖ్యలు!?|EDITORIAL

మనిషిలో రాను రాను రాక్షస ప్రవృత్తి పెరుగుతోంది. సమాజంలో అత్యాచారాలు, హత్యలు, హత్యాకాండలు పెచ్చుమీరడం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, ఏపీ, తెలంగాణ ఇలా దేశమంతటా అనేక రాష్ట్రాల్లో సభ్యసమాజం తలదించుకునేలా సంఘటనలు జరుగుతున్నాయి. చివరకు చిన్నారి బాలలపైనా కామాంధులు లైంగికదాడులకు పాల్పడడం దారుణం. బాలలపై ఉపాధ్యాయులే లైంగిక దాడికి తెగించడం దుర్మార్గపు చర్య. ఇలాంటి వారికి ఏ శిక్ష వేసినా తప్పులేదు.

అక్కడక్కడా పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. వెలుగు చూడనివెన్నో! కులాలు, మతాలు కలవని ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు. పెళ్ళి కొడుకుల అడ్డు తొలగిస్తున్నారు. భర్తలు భార్యల్ని, భార్యలు భర్తల్ని, అనైతిక కార్యకలాపాలకు అడ్డువస్తున్నారని, పిల్లల్ని, పిల్లలు ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని చంపడం వంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయంటే, వాటి పట్ల సమాజంలో భయం లేకపోవడం, చట్టాల్లో లొసుగుల వల్ల ప్రజల్లో ఇలాంటి పైత్యం పరాకాష్టకు చేరుతోంది. సైబర్ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు కొదువే లేదు.

ఈ నేపథ్యంలో బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయి. అత్యాచార ఘటనపై స్పందిస్తూ, ‘అర్థరాత్రి ఆ అమ్మాయి ఒంటరిగా ఎందుకు బయటకు వచ్చింద?’ని పెడసరంగా ప్రశ్నించారు. ఒక సీఎంగా, అందునా మహిళ అయిన మమత ఇలాంటి విషయాల్లో అలా కనీస ఇంగితం లేకుండా మాట్లాడారు. గత కొన్నేళ్లుగా మహిళలపై నేరాల్లో బెంగాల్‌, కోల్‌కతా ముందువరసలో ఉంటున్నాయని నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వార్షిక నివేదికలు ఘోషిస్తున్నాయి. దుర్గాపూర్‌ అత్యాచార దుర్ఘటనను ఖండిస్తూ మహిళలు, విద్యార్థులు, డాక్టర్లు, సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు రెండు రోజులుగా ఆందోళనలు చేస్తుంటే, దేశమంతా ఆవేదన పెల్లుబికుతుండగా, బాధ్యత కలిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత స్పందన బాధితురాలిని, కుటుంబ సభ్యులను, యావత్‌ మహిళాలోకాన్ని నివ్వెర పరచింది. ‘రాత్రిపూట క్యాంపస్‌ నుంచి బయటికి ఎందుకు వెళ్లింది? ఆ సమయంలో ఆమెకు ఏం పని?’ అని సీఎం యక్షప్రశ్నలు సంధించారు. అసహనం వ్యక్తం చేశారు. ‘ఏ సమయంలోనైనా బయటికి వెళ్లడం వ్యక్తుల ప్రాథమిక హక్కు అయినప్పటికీ, స్త్రీలు రాత్రుళ్లు రోడ్లపైకి రాకూడద’ని విరుచుకుపడ్డారు. ‘ప్రతి మహిళ ఇంటి ముందు పోలీసులను కాపలాగా పెట్టలేమం’టూ మహిళా భద్రతపై చేతులెత్తేశారు.
పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌లో ఐక్యూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీ విద్యార్థినిపై కాలేజీ క్యాంపస్‌ పరిసరాల్లో జరిగిన సామూహిక అత్యాచారం బెంగాల్‌లో మహిళా భద్రతా వైఫల్యాన్ని మరొకసారి బట్టబయలు చేసింది. ఒరిస్సాకు చెందిన విద్యార్థిని వైద్య విద్యనభ్యసించేందుకు ఆ కాలేజీలో చేరింది. శుక్రవారం రాత్రి తన స్నేహితునితో కలిసి డిన్నర్‌కు క్యాంపస్‌ వెలుపలికి వెళ్లగా విద్యార్థినిని మృగాళ్లు అటకాయించి చేతిలోని ఫోన్‌ను లాక్కొని, దగ్గరలోని దట్టమైన చెట్లలోకి బలవంతంగా లాక్కెళ్లి, అఘాయిత్యానికి ఒడిగట్టారు. విషయం బయటికి చెబితే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయని దుండగులు బాధితురాలిని భయపెట్టారు. ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యశాలలో చికిత్స పొందుతున్నది. కాగా విద్యార్థినిని డిన్నర్‌కు బయటికి తీసుకెళ్లిన యువకుడు మధ్యలోనే పరారయ్యాడని అంటున్నారు. అందుకే అతనిపైనా అనుమానాలు కలుగుతున్నాయి. అత్యాచారంలో ఈ ఫ్రెండ్‌ పాత్ర తెలియాలంటే పోలీస్‌ దర్యాప్తు ముమ్మరంగా జరగాలి. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని దుర్గాపూర్‌, కోల్‌కతా, బెంగాల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. జాతీయ మహిళా కమిషన్‌ బెంగాల్‌లో మహిళలకు సరైన భద్రత కల్పించాలని మమత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిరుడు ఆగస్టులో ఆర్‌జి కర్‌ హాస్పిటల్లో రాత్రిపూట వైద్య విధుల్లో ఉన్న లేడీ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఉదంతం సంచలనమైంది. అయినా బెంగాల్లో మమతా బెనర్జీ పాలనతీరు మారలేదు. మహిళలకు రక్షణ కల్పించడం లేదు. దీనికి తోడు మమత చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ఆటవిక చర్యలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. ఆర్‌జికర్‌ హాస్పిటల్ ఘటనలో అసలు నిందితులను వదిలేసి ఓ అమాయకుడిని అందులో ఇరికించేశారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు మిన్నంటాయి. ఈ కేసులో సివిక్‌ పోలీస్‌ వలంటీర్‌ సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు పడింది. అసలు నిందితులను వదిలేశారని నేటికీ బాధితురాలి కుటుంబం పోరాడుతూనే ఉంది.

ఆర్‌జి కర్‌ ఘోరాన్ని మరవకముందే దుర్గాపూర్‌ దారుణం సంభవించింది. ఈ ఏడాది జులైలో దక్షిణ కలకత్తా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో కాలేజీ క్యాంపస్‌లలో విద్యార్థినులపై జరుగుతున్న వరుస అత్యాచారాలు విద్యా సంస్థలు, వాటి పరిసరాల్లో భద్రతా చర్యల డొల్ల తనాన్ని ప్రశ్నిస్తున్నాయి. పటిష్టమైన భద్రత, నిఘా, అప్రమత్తపు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి.

అత్యాచారం వంటి దారుణాలు జరిగినప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. బాధితులకు న్యాయం జరుగుతుందన్న భరోసానివ్వాలి. వారిలో ఆత్మవిశ్వాసం కలిగించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలాలి. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. ఇందుకు భిన్నంగా మాట్లాడటం మాత్రం ఎంతో కాలం అధికారాన్ని నిలపలేవు. పైగా ప్రజల్లో పలచన చేస్తాయి. ఈ మాత్రం మమతకు తెలియవనుకోలేం. కానీ ఆమె మాటలు బాధిత మహిళల్ని మరింతగా బాధకు గురిచేసే విధంగా ఉన్నాయనడంలో సందేహం లేదు.

Latest News

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News