సాధారణంగా ప్రజలెవరూ యుద్ధాలను కోరుకోరు. ఘర్షణలను కూడా ఆహ్వానించరు. ఎవరైనా ప్రశాంతంగా బతకాలనే అనుకుంటారు. ఒక్క ట్రంప్, ఇస్లామిక్ ఉగ్రవాదులు తప్ప. ఇలాంటి ఓ వ్యక్తి ఓ శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడవడమే అత్యంత బాధాకరం. అతడిని ఎన్నుకున్నందుకు ఆ దేశ ప్రజలే బాధపడుతుంటే, యుద్ధాలతో, సుంకాలతో, రక్తపాతంలో, మాయోపాయ కుయుక్తులతో, యుద్ధ హెచ్చరికలతో శాంతి ప్రవచనాలు పలికి, దేశాలను బెదిరించి మద్దతు కూడగట్టి, నామినేట్ చేయించుకుని, ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాంతి బహుమతిని కొట్టాయాలనుకోవడమే విధి వైచిత్రి. ఇది ట్రంప్ ఒక్కడికే సాధ్యమయ్యే ట్రంపరితనం! అత్యాశను మించిన హత్యాశ!! శృతి మించిన వెర్రితనం!!!
అమెరికా అధ్యక్షుడినన్న ఆధిపత్యంతో, నాకివ్వరా? అన్న అహంకారంతో, తన చుట్టుముట్టు దేశాలను బెదిరిస్తున్న ధోరణితో ‘నోబెల్ శాంతి’పై ట్రంప్ మనసు పడ్డారు. నోబెల్ స్టాండర్డ్ స్థాయిలు నీకు లేనే లేవుగా? అన్నట్లుగా ‘వైట్ హైస్’ ని, ‘లైట్’ తీసుకుంది నోబెల్ కమిటీ.
అయితే, ట్రంప్ ఆశలు ఇక్కడితో అడియాశలయ్యాయనుకోలేం. మళ్ళీ మళ్ళీ పోటీ పడటానికి జనవరి 20, 2029 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనకు ఈ టర్మే చివరి అవకాశం కాబట్టి, మున్ముందు ఈ ప్రయత్నాలను మానరు. ఒత్తిడిని పెంచుతారు. తాను ఈ ప్రపంచానికి శాంతి దూత కావాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. అది నెరవేరేనా? డా. మార్గం – అడుగు ఎడిటోరియల్
‘ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటాం’ అన్నారు నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్. అంతేకాదు, ‘త్వరితగతిన దక్కిన దౌత్య విజయాలకంటే, స్థిరమైన బహు పాక్షిక ప్రయత్నాలకు కమిటీ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ట్రంప్ ప్రయత్నాలు సుస్థిర ఫలితాలిస్తాయని ఇంకా నిరూపితం కాలేదు. ఒర ఘర్షణను స్వల్పకాలం ఆపడానికి, దాని మూల కారణాలను గుర్తించి, పరిష్కరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది.’ అని హెన్నీ జాక్సన్ సొసైటీలో చరిత్రకారుడిగా ఉన్న థియో జనౌ అన్నారు. ఇది ట్రంప్ నుద్దేశించే అనడానికి అనుమానాలు అక్కరలేదు. జనవరి 31ననే నోబెల్ కు నామినేషన్ల గడువు ముగిసింది. అయినా అమెరికా అధ్యక్షుడినన్న ఆధిపత్యంతో, నాకివ్వరా? అన్న అహంకారంతో, తన చుట్టుముట్టు దేశాలను బెదిరిస్తున్న తరహా ధోరణితో ‘నోబెల్ శాంతి’పై మనసు పడ్డారు. నోబెల్ స్టాండర్డ్ స్థాయిలు నీకు లేనే లేవుగా? అన్నట్లుగా ‘వైట్ హైస్’ ని ‘లైట్’ తీసుకుంది నోబెల్ కమిటీ. అసలే కోతి. ఆపై నిప్పును తొక్కింది. ఇగ దాని ‘ఎగురుడు’ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. నెబెల్ దెబ్బకు ట్రంప్ మైండ్ బ్లాంక్ అయింది. నోబెల్ లేవెల్ తను కాదని ట్రంప్ కి తెలిసొస్తే ప్రపంచానికి అంతకంటే ‘శాంతి’ మరోటి ఉండదు.
సాధారణంగా ప్రపంచంలో ప్రజలెవరూ యుద్ధాలను కోరుకోరు. ఘర్షణలను కూడా ఆహ్వానించరు. ఎవరైనా ప్రశాంతంగా బతకాలనే కోరుకుంటారు. ఒక్క, ట్రంప్, ఇస్లామిక్ ఉగ్రవాదులు తప్ప మిగతా ప్రపంచమంతా ఇదే కోరుకుంటోంది. ఇలాంటి ఓ వ్యక్తి ఓ శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడవడమే అత్యంత బాధాకరం. అతడిని ఎన్నుకున్నందుకు ఆ దేశ ప్రజలే బాధపడుతుంటే, యుద్ధాలతో, సుంకాలతో, రక్తపాతంలో, మాయోపాయ కుయుక్తులతో, యుద్ధ హెచ్చరికలతో శాంతి ప్రవచనాలు పలికి, దేశాలను బెదిరించి మద్దతు కూడగట్టి, నామినేట్ చేయించుకుని, ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాంతి బహుమతిని కొట్టాయాలనుకోవడమే విధి వైచిత్రి. ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఉంటుందా? ఇది ట్రంప్ ఒక్కడికే సాధ్యమయ్యే ట్రెంపరితనం! అత్యాశను మించిన హత్యాశ!! శృతి మించిన వెర్రితనం!!!
సుంకాలతో ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టిన ట్రంప్ ఎప్పిటికైనా శాంతి కాముకుడు కాగలడా? ముందుగా ఇజ్రాయెల్ ను ఎగదోసి, బలవంతంగా గాజా, హమాస్ మధ్య శాంతి కుదిరినా అది ట్రంప్ ఖాతాలో వేయగలమా? శాంతిదూతలెప్పుడూ ట్రంప్ లా తనను తాను శాంతిదూత అని ప్రకటించుకోలేదు. యుద్ధాలే కాదు, ఆర్థిక యుద్దాలు కూడా యుద్ధం కిందకే వస్తాయని ట్రంప్ తెలుసుకోవాలి.
భారత్, పాక్ యుద్ధం సహా ఎనిమిది యుద్ధాలు ఆపానని, ఈ ఏడాది తనకు నోబెల్ బహుమతి రావాలని, లేదంటే అమెరికాను అవమానించినట్లేనని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ట్రంప్ తనను తాను శాంతి దూతగా సంసిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని విధాల అర్హుడినని ప్రకటించుకున్నాడు. ఈ ఏడాదికి నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైన తర్వాత ట్రంప్ మరింత వేగం పెంచాడు. పాక్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్ కూడా చేశాయి. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతికి ట్రంప్ అసలు అర్హుడేనా? అన్న చర్చ ప్రపంచమంతా జరుగుతున్నది. పాలస్తీనా దురాక్రమణకు ఇజ్రాయెల్‌ను ఎగదోస్తున్నదే అమెరికా! రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నది కూడా అగ్రరాజ్యమే!! అఫ్ఘానిస్తాన్ ఎయిర్ బేస్‌ను ఆక్రమిస్తామని, కెనడా కూడా అమెరికా భూభాగమేనని, దాన్నితమ దేశంలో మరో రాష్ట్రంగా గుర్తిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. సుంకాలతో ప్రపంచానికి కంటివిూద కునుకు లేకుండా చేశాడు. వీసాలు, గ్రీన్ కార్డుల విషయంలోనూ ట్రంప్ వైఖరే వేరు. అయితే హమాస్, ఇజ్రాయిల్ శాంతి ఒప్పందంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కానీ ట్రంప్ కు కాదు.
ట్రంప్ కి తనేంటో తనకు తెలుసు. అయినా, నోబెల్ శాంతి కావాలి. అందుకే ఆయన పరస్పర భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడుతూ, ‘వాళ్ళు నాకు నోబెల్ ఇవ్వరు. అర్హుడినైనా ఎప్పటికీ ఇవ్వరు.’ అన్నారు. ఆగస్టులో ఉక్రెయిన్ ‘నేను యుద్ధాలతో మగ్గుతున్న దేశాల ఒప్పందాలు చేశాను. ఆరు అని, కాదు ఏడు అని సవరించుకున్నారు. భారత్, పాక్ యుద్ధ సమయంలోనూ ‘నేను ఈ యుద్ధాన్ని ఎలా ఆపానో మీకు తెలుసు. నేను నోబెల్ కు అర్హుడను.’ అన్నారు. అప్పటికీ నోబెల్ రాకపోడంతో, ఆప్రకటనకు ముందు ‘ఆ అవార్డు నాకు రాకపోతే, అమెరికాకు అవమానం’ అన్నారు. 1901 నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు 105సార్లు నోబెల్ బహుమతి ప్రకటించారు. 111 మంది సభ్యులు, 31 సంస్థలు ఇప్పటి వరకు ఈ పురస్కరాన్ని అందుకున్నారు. అయితే, ‘వాతావరణ మార్పులపై నమ్మకంలేని వారికి, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కుతాయనుకోలేం’ అని కూడా థియో జనౌ అన్నారు. ఇది ట్రంప్ గురించేనన్న విషయం వేరే చెప్పక్కరలేదు.
అయితే, ట్రంప్ ఆశలు ఇక్కడితో అడియాశలయ్యాయనుకోలేం. మళ్ళీ మళ్ళీ పోటీ పడటానికి జనవరి 20, 2029 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనకు ఈ టర్మే చివరి అవకాశం కాబట్టి, తన ప్రయత్నాలను మానుకోరు. కొద్ది గంటల ముందే రష్యా, ట్రంప్ పేరును నోబెల్ ప్రతిపాదించింది. ఈసారి నోబెల్ గ్రహీత మరియా కొరీనా, ట్రంప్ నకు అంకితమిస్తున్నానని ప్రకటించారు. దీనికి భిన్నంగా వైట్ హౌస్ మాత్రం ‘నోబెల్ కు ఎంపికలో రాజకీయ వివక్ష చూపించార’ని విమర్శించింది. ‘అయినా ట్రంప్ యుద్ధాలను ఆపుతూనే ఉంటారు. ఒప్పందాలతో ప్రజల ప్రాణాలు నిలబెడతారు. ఆయన మానవతవా వాది. ఆయన సంకల్పంతో పర్వతాలను సైతం కరిగించగలిగిన ఆయనలాంటి వ్యక్తి మరొకరుండరు’అని వ్యాఖ్యానించింది. అంటే మున్ముందు ఈ ప్రయత్నాలను మానరు. ఒత్తిడిని పెంచుతారు. తాను ఈ ప్రపంచానికి శాంతి దూత కావాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. మరి అది నెరవేరేనా?

